Satyabhama Serial Today July 30th: సత్యభామ సీరియల్: ప్రేమతో కన్నీళ్లు పెట్టించేసిన సత్య, క్రిష్‌లు.. ముసుగులో వచ్చి ధనుంజయ్‌కి అండగా నిలిచిన క్రిష్!
Satyabhama Serial Today Episode లాయర్ ధనుంజయ్‌ని మహదేవయ్య బెదిరించి చంపేయడానికి రౌడీలను పంపించడం క్రిష్ ముసుగులో వచ్చి లాయర్‌ని కాపాడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Today Episode విశ్వనాథం కేసు తీసుకున్నది ధనుంజయ్ అని తెలుసుకున్న రుద్ర ధనుంజయ్ ఆఫీస్‌కి వెళ్తాడు. అక్కడ లాయర్ రుద్రని చూసి నువ్వు మహదేవయ్య కొడుకువి కదా అని అంటాడు. గుర్తు పట్టావా అని రుద్ర అంటే అచ్చే వేసిన ఆంబోతుల్ని గుర్తుపట్టమా ఏంటని లాయర్ ధనుంజయ్ అంటాడు. దాంతో రుద్ర కోపంతో లాయర్ మీదకు వెళ్లబోతే ధనుంజయ్ ఆపేస్తాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరుగుతాయి. త్వరలోనే నిన్ను జైలుకి వెళ్లేలా చేస్తానని రుద్రని అంటాడు. ఇక రుద్ర ఒక సారి సింహం గాండ్రింపు విను అని మహదేవయ్యకు వీడియో కాల్ చేస్తాడు.
మహదేవయ్య: ఏం ధైర్యంతో ఆ విశ్వనాథం కేసు తీసుకున్నావ్ రా.
ధనుంజయ్: నీలాంటి మృగంతో డైరెక్ట్‌గా ఫైట్ చేయాలని ఉంది. కానీ ఛాన్స్ దొరకడం లేదు. దొరికినట్లు దొరికి జారిపోతున్నావ్. ఈ సారి విశ్వనాథం కేసు గెలిచి చిన్నగా మీసం తిప్పాలి అనుకుంటున్నా. ఇక్కడున్న ప్రతి లాయర్‌కి తెలుసు మహదేవయ్యతో పెట్టుకునే మగాడిని నేనే అని.
మహదేవయ్య: రేయ్ నాకే ఎదురొస్తావ్‌రా నువ్వు. ఈ కేసు అయ్యేంత వరకు నిన్ను కిడ్నాప్ చేసి దాచిపెడదాం అనుకున్నా కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నా. కోర్టు మెట్లు ఎక్కకముందే ఆ యమధర్మరాజు దగ్గరకు పంపిస్తా.
ధనుంజయ్: సింహం అన్నావ్ గాండ్రిస్తుంది అన్నా గొంతులో భయం కనిపిస్తుందేంటి. మీ అందరికి త్వరలోనే చిప్ప కూడు తినే రోజు దగ్గర్లోనే ఉంది.
సత్య: తప్పు చేస్తున్నానా క్రిష్ మాట కాదు అని అతన్ని ఇబ్బంది పెడుతున్నానా. నేను నాన్న గురించి ఆలోచించాలా క్రిష్ గురించి ఆలోచించాలా ఈ సారి మామయ్యకి కోపం వస్తే నన్ను గెంటేస్తారు. నా కాపురం నేనే కూల్చుకున్నట్లు అవుతుంది. ఏం చేయను.
క్రిష్: ఏంటి ఆలోచిస్తున్నావ్ కోర్టుకి వెళ్తా అన్నావ్ ఏం ఆలోచిస్తున్నావ్.
సత్య: అంతా అయోమయంగా ఉంది. నా జీవితం నాకే ప్రశ్నార్థకంగా మారిపోయింది. తెగించాల్సి వస్తుంది. పెద్దవాళ్లకి ఎదురు తిరగాల్సి వస్తుంది. అవన్నీ పక్కన పెడితే నిన్ను బాధ పెడుతున్నానని దిగులు. ఇక మనం కలిసి ఉండేది ఇంకా రెండు మూడు నెలలే అప్పటి వరకు నీతో కలిసి ఉండాలని ఉంది. నా కోసం నాఫ్యామిలీ కోసం నువ్వు చాలా కష్టపడుతున్నావ్ రుణపడి ఉండాలి కదా. నా ఇష్టాలకు అదృష్టం లేదు.
క్రిష్: మన బంధానికి ఇంకా రెండు నెలలే అని నువ్వు అంటుంటే ఎట్లా ఉందో తెలుసా ఓరేయ్ పిచ్చోడా నువ్వు బతికేది ఇంకా రెండు నెలలేరా అన్నట్లుంది. సరే కానీ ఇప్పుడు దాని గురించి మాట్లాడి లాభం లేదు అర్థం లేదు. కానీ రెండు నెలల తర్వాత ఈ ట్యాటూ తీయించమని మాత్రం అడగకు ఎందుకంటే ఇది నాతోనే కాలిపోవాలి. కన్నీళ్లు మనకు వస్తే కష్టం అంటారు. అవే కన్నీళ్లు మన కోసం వస్తే ప్రేమ అంటారు. ఈ కన్నీళ్లు నీ కోసమే సంపంగి. కోర్టుకి టైం అయింది వెళ్లు. సత్య కూడా ఏడుస్తుంది. నిన్ను నిన్న వద్దు అన్నాక చాలా ఆలోచించా నీ ఆలోచన కరెక్ట్ సత్య జన్మిచ్చిన తండ్రి తర్వాతే ఏదైనా ఎవరైనా ఎలాంటి కష్టం వచ్చినా నేను నీతోనే ఉంటా నీ పక్కనే ఉంటా. కనీసం ఈ రెండు నెలలు. నువ్వు ఈ కేసు గెలవాలి. ఆల్ ది బెస్ట్.
సత్య ఎవరికీ తెలీకుండా కోర్టుకి వెళ్లిపోతుంది. అది మేడ మీద నుంచి మహదేవయ్య, రుద్ర చూస్తారు. రుద్ర కావాలనే తండ్రిని రెచ్చగొడతాడు. రోజు రోజుకి నీ ఇంట్లో నీకు పరువు పోతుందని అంటాడు. తనకు బయట శత్రువు ఇంట్లో శత్రువు ఒకటే అని తన రాజకీయం కోసం వెన్ను పోటు పొడవాలని అనుకుంటాడు. సత్యని అన్ని రకాలుగా లాక్ చేస్తే తన కాళ్ల మీద పడుతుందని మహదేవయ్య అంటాడు. ఇక తన పేరు బయటకు రాకుండా లాయర్‌ని ఏసేయ్ మని మహదేవయ్య రుద్రకు చెప్తాడు. ఇక కోర్టు దగ్గర సత్య, సంధ్య, హర్షలు కోర్టు దగ్గర వెయిట్ చేస్తుంటారు. ఇంతలో పోలీసులు విశ్వనాథాన్ని తీసుకొస్తారు. సత్య, సంధ్యలు తండ్రిని చూసి ఎమోషనల్ అవుతారు. కచ్చితంగా మీరు బయటకు వస్తారని మంచి లాయర్‌ని పెట్టామని తండ్రికి హర్ష చెప్తాడు. మరోవైపు లాయర్ ధనుంజయ్ ఇంకా రాలేదని సత్య వాళ్లు టెన్షన్ పడతారు. లాయర్ కోసం రుద్ర మనుషులు దారిలో ఎదురు చూస్తుంటారు. కారు రాగానే ఆపి గొడవ పడతారు. ధనుంజయ్ రౌడీలను చితక్కొడతాడు. ఇక రౌడీలు ధనుంజయ్‌ని పట్టేసి కొట్టబోతే క్రిష్ ముసుగు వేసుకొని వచ్చి రౌడీలను చితక్కొడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: గౌరి, శంకర్‌ల తో మాట్లాడిన అకి – రాకేష్ ప్లాన్ పసిగట్టిన జెండే