అన్వేషించండి

Trinayani Serial Today July 15th: 'త్రినయని' సీరియల్: ఆస్తిని నయనికి ఇచ్చేసిన దురంధర, వద్దన్న నయని.. ఉలూచిని పాములా మార్చేసిన పెద్దబొట్టమ్మ!

Trinayani Serial Today Episode: ఉలూచి పాదాలను నయం చేస్తానని పెద్దబొట్టమ్మ పసుపు తీసుకొచ్చి ఉలూచికి రాసి తిరిగి పాములా మార్చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Episode: తిలోత్తమ సుమనకు ఇస్తానన్న 70 కోట్ల ఆస్తిని దురంధర తన పేరు మీద రాసుకుంటుంది. పిల్లాజల్లా లేని నువ్వు మోసం చేసి నా ఆస్తి కొట్టేశావని సుమన ఫైర్ అయితే దురంధర ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు తల్లి కాబోతుందని నయని అందరికీ చెప్తుంది. అందరూ దురుంధర, పావనామూర్తిలకు కంగ్రాట్స్ చెప్తారు. పావనామూర్తి నిజమా కాదా అని షాక్ అయి దురంధరని అడుగుతారు. దానికి దురంధర ఉదయం జరిగింది చెప్తుంది. ఉదయం తాను మొక్కలకు నీరు పోస్తూ నయనితో మాట్లాడుతుంది. ఇంతలో దురంధర కళ్లుతిరిగి పడిపోతుంది. అప్పుడే వచ్చిన గురువుగారు దురంధరని చూసి తల్లి కాబోతుందని చెప్తారు. 

దురంధర: సిగ్గేస్తుంది నయని ఈ వయసులో నాకు పిల్లలేంటి.
నయని: అలా అంటావ్ ఏంటి పిన్ని.
గురువుగారు: వయసు శరీరానికే కానీ మనసుకి కాదమ్మా. ఈ రోజు విశాలాక్షి అమ్మవారు నిన్ను ఇలా ఎందుకు కరుణించారో దానికి కారణం ఉండే ఉంటుంది. 
దురంధర: ఏది ఏమైనా ఇంట్లో వాళ్లకి చెప్పకు నయని ఆట పట్టిస్తారు.
నయని: ఎన్నాళ్లని దాస్తావు పిన్ని. 

ప్రస్తుతం

దురంధర: ఈ విషయం చెప్తే ఎవరు ఏమనుకుంటారో అని చెప్పలేదు.
గురువుగారు: ఎవరు ఏమనుకున్నా తన బిడ్డ భవిష్యత్ కోసం స్వార్థంతో ఆలోచించి ఎలా సంపాదించిందో తెలియని తిలోత్తమ ఆస్తిలో వాటా తీసేసుకుంది. 
సుమన: నాకు అన్యాయం జరిగినట్లు కాదా.
గురువుగారు: కాదు. ఎందుకంటే సర్పదీవి నుంచి తిలోత్తమ 
ఇంకేదో తీసుకొచ్చి వాటి వల్ల కూడబెట్టిన ఆస్తి నీకు ఇచ్చినా దక్కదు. దక్కినా నిలవదు అందుకే ఇలా జరిగింది. 
హాసిని: తిల్లు ఆంటి ఇంకా కోలుకోనట్లుంది.
వల్లభ: ఇది అక్రమం కాదా.
హాసిని: కానే కాదు.
విక్రాంత్: లెక్కలు చెప్పని ఆస్తిని ఇన్‌కమ్ ట్యాక్స్ వాళ్లు జప్తు చేస్తారు. 
విశాల్: ఇక్కడ అత్తయ్య తీసేసుకుంది. పోనీలే అమ్మ కూడా అర్థం చేసుకుంటే మంచిది. 
పావనా: షష్టిపూర్తి చేసుకునే టైంలో నన్ను తండ్రిని చేశావ్ కదే దూర్.

దురంధర: రాత్ర ఆస్తి పేపర్లు నయనికి ఇస్తూ.. 70 కోట్లు మీ చెల్లి సుమ్మికి రావాల్సిన వాటాని నా పేరు మీద రాయించుకోవడం అన్యాయం. కేవలం సుమ్మి పొగరు అణచాలి అని అలా చేశాను కానీ ఆస్తి నాకు ఎందుకు చెప్పు.
నయని: చాలా మంది ఈ విషయంలోనే పొరపడతారు పిన్ని. వయసు పెరిగిపోతున్నప్పుడు డబ్బు ఆస్తి మాకు ఎందుకని నిర్లక్ష్యం చేస్తారు. అలా అనుకున్నప్పుడే ఆస్తి పేదలకో అయినవారికే ఇచ్చేస్తారు. ఆ రెండు మూడు రోజులు ప్రేమగా చూసి తర్వాత నడిరోడ్డు మీద వదిలేస్తారు. అందుకే మనం అటూ ఇటూ కదిలేంత వరకు ఆస్తి మన పేరు మీదే ఉండాలి. మంచాన పడ్డాక మన పేరుమీద స్వర్గం ఉన్నా అనవసరం అప్పుడు మీకు నచ్చిన వారికి ఇచ్చేయండి.
దురంధర: నువ్వు ఇంత ముక్కు సూటిగా మాట్లాడుతావ్ కాబట్టి నీకు అంతా మంచే జరుగుతుంది. నేను నా భర్త మీ ఇంట్లో మూడు పూటలు తింటున్నా ఒక్క రోజు కూడా విసుక్కోవు. ఖర్చు అవుతుందని లెక్క చేసింది లేదు. అందుకే ఇదేదో నీకే ఇచ్చేస్తే బాగని.
నయని: వద్దు పిన్ని. తిలోత్తమ అత్తయ్య ఏం చేసి సంపాదించిందో తెలీదు కానీ నువ్వు తన ఆడపడుచువి అందులో వాటా తీసుకున్నా ఓ లెక్క ఉంటుంది. 
దురంధర: అంతే అంటావా.
నయని: అంతే ఆ పేపర్లు జాగ్రత్త. బాబాయ్‌కి కూడా తెలీకుండా వాటిని దాచేయ్. ఇచ్చేయ్ మంటే ఇచ్చేస్తారు కూడా..

సుమన గదిలో ఏడుస్తుంది. విక్రాంత్ వచ్చి ఏమైందని అడిగితే తన పేరు మీద రాయాల్సిన ఆస్తి దురంధర పిన్ని కోటీశ్వరురాలు అయిపోయిందని ఏడుస్తుంది. విక్రాంత్ తిలోత్తమ కూడా భవిష్యత్‌లో నిన్ను ఇలాగే మోసం చేస్తుందంటే తిలోత్తమ దేవత అని సుమన అంటుంది. మళ్లీ తన పేరు మీద ఆస్తి వచ్చేలా చేయమని సుమన రెచ్చ గొడుతుంది. విక్రాంత్ నీ మాటలకు రెచ్చిపోనని అంటాడు. ఉదయం ఉలూచి పాప పడుకొని ఉంటే పావనా దురంధని పాపని చూడమని అంటాడు. ఆ పాపని చూస్తే కడుపుతో ఉన్న తనకు అలాంటి పాప పుడుతుందని పావనా ఉద్దేశం అని దురంధర హాసినితో చెప్తుంది. ఇక అందరూ అక్కడికి వస్తారు. సుమన దురంధరతో ఆరు నెలలు ఆగితే మీకు పాప, బాబో పుడుతారు కదా మరి నా బిడ్డని ఎందుకు హాల్‌లోకి తీసుకొచ్చారని అడుగుతుంది. దానికి పావనా ఆడిద్దామని అంటాడు. ఇక తిలోత్తమ, వల్లభలు దురంధర సుమనను తమను ముంచేసిందని అంటారు. 

ఇంతలో పెద్దబొట్టమ్మ చేతిలో పసుపు పట్టుకొని వస్తుంది. అది ఏంటని అందరూ అడిగితే లక్ష్మీపురంలోని నాగలక్ష్మి అమ్మవారి పాదాల దగ్గర ఉండే పసుపు అని అది ఉలూచి పాదాలకు రాస్తే నయం అవుతుందని చెప్తుంది. సుమన వద్దని అంటే అందరూ సుమనను ఒప్పించాలని చూస్తారు. పాపకు నయం కాకపోతే అప్పుడు పెద్దబొట్టమ్మ సంగతి చూస్తా అని కోప్పడుతుంది. ఇక పెద్దబొట్టమ్మ ఉలూచి పాదాలకు పసుపు రాస్తుంది. కొద్ది సేపటికి ఉలూచి పాములా మారిపోతుంది. దురంధర పెద్దగా అరుస్తుంది. నయనితో పాటు అందరూ షాక్ అవుతారు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీని నిలదీసిన అర్జున్, మిత్ర తన భర్త అని చెప్పిన లక్ష్మీ.. మనీషా ప్లాన్ వినేసిందిగా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Sai Durgha Tej: ‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
Allu Arjun: రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Viral News: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ !  వీడియో
ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో
Embed widget