అన్వేషించండి

Trinayani Serial Today January 25th: 'త్రినయని' సీరియల్: కాలి బూడిదైన తిలోత్తమ.. పునర్జన్మ పగ సమాప్తం.. దురంధర కడుపులో మళ్లీ జన్మ!

Trinayani Today Episode తిలోత్తమ గుడికి వెళ్లడం అక్కడ గాయత్రీ పాప చేతిలో సజీవ దహనం అయి దురంధర కడుపులోకి తిలోత్తమ ఆత్మ ప్రవేశించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode నయని, విశాల్‌లతో పాటు అందరూ గుడికి చేరుకుంటారు. అందరూ అమ్మవారిని దర్శించుకుంటారు. త్రినేత్రి కూడా వచ్చిందని ప్రదక్షిణలు చేస్తుందని విక్రాంత్ చెప్తాడు. త్రినేత్రి పూజ పూర్తి చేసేసిందని నయని తీర్థం ఇస్తానని చెప్పి గాయత్రీ పాప చేతిలో తీర్థం పెట్టి అందరికీ ఇవ్వమని అంటుంది. నయని పాపని ఎత్తుకుంటే గాయత్రీ పాప అందరికీ తీర్థం ఇస్తుంది. అందరూ పాపని పొగిడేస్తారు.

తిలోత్తమ కూడా తీసుకుంటుంది. పాప తిలోత్తమకు తీర్థం ఇవ్వగానే అమ్మవారి దివ్యదృష్టి ఆ తీర్థం మీద పడుతుంది. తిలోత్తమ తీర్థం తీసుకోగానే చేతులు వణుకుతూ తెలీకుండా ఏడుస్తుంది. గొంతు పట్టుకొని ఇబ్బంది పడుతుంది. కళ్లు తేలేస్తుంది. గాయత్రీ అక్కయ్య నా ప్రాణం తీసుకుంటుందని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. తిలోత్తమ కింద పడిపోతుంది. వల్లభ దగ్గరకు వెళ్లబోతే దగ్గరకు రాబోతుందని తిలోత్తమ వద్దని చెప్తుంది. తిలోత్తమ విలవిల్లాడిపోతుంది. అందరూ చూస్తూ ఉంటారు. అందరం అదే తీర్థం తాగాం కదా మనకు ఏం కాలేదని బామ్మ అని అంటుంది. దాంతో నయని అత్తమ్మ చనిపోయే సమయం వచ్చేసిందని అంటుంది. మా అమ్మని బలి ఇవ్వడానికి ఇక్కడికి రమ్మన్నారా అత్తయ్య నాటకం ఆడింది కదా అని వల్లభ అంటే దానికి తిలోత్తమ వల్లభతో ఎవరినీ ఏం అనొద్దురా ఇది ఆ తల్లి విశాలాక్షి అమ్మ ఆడించిన నాటకం అని అంటుంది. ఇంట్లో ఉండిపోవాల్సిన నాకు గుడికి రావాలి అని మనసు లాగిందని అదంతా దేవుడి నిర్ణయమే అని అంటుంది. అందరూ తీర్థం తాగినా ఏం కాలేదని తాను తాగగానే ఎడమ చేయి పడిపోయిందని అంటుంది. తిలోత్తమ నోటి నుంచి ముక్కు నుంచి రక్తం వస్తుంది. విశాల్ హాస్పిటల్‌కి తీసుకెళ్తానంటే తిలోత్తమ వద్దని అనేస్తుంది. 

అత్తయ్య పరిస్థితి చూసి అలాగే వదిలేస్తారా అని సుమన అడిగితే నా మీద జాలి చూపించొద్దని గాయత్రీ అక్కయ్య లక్ష్మీ పురం వెళ్లినప్పుడు జ్యూస్‌లో విషం కలిపాననని అప్పుడు అక్కయ్య కూడా ఇలాగే ప్రాణం విడిచిందని గుర్తు చేస్తుంది. మీ అమ్మ ప్రాణాలు తీసిన దుర్మార్గురాలిని నేను అని విశాల్‌తో తిలోత్తమ చెప్తుంది. దానికి నయని ఆ విషయం నా భర్తకి ఎప్పుడో తెలుసు అత్తయ్యా కానీ పెంచిన తల్లి మీద ప్రేమ చూపించారని అంటుంది. ఇక తిలోత్తమ తాను చాలా పాపాలు చేశానని పశ్చాత్తాపంతో బతకాలని లేదని ఇప్పుడు చేయి పడిపోయింది రేపు నోరు పడిపోతుందని ఇలా బతకాలి అని లేదని ఏడుస్తూ పాపని చూసి అక్కా గాయత్రీ అక్క నాకు విముక్తి ప్రసాదించు అని అంటుంది. తన చేతికి తాకి అఖండ దీపంలా వెలిగిపోయేలా చేయు అని తన చేతిని ఒక్క సారి తాకమని అంటుంది. దాంతో పాప వెళ్లి తిలోత్తమ చేయి తాకుతుంది. 

తిలోత్తమ చేయి తాకగానే పెద్ద మంట వచ్చి తిలోత్తమ కాలిపోతుంది. వల్లభ అమ్మ చేయి కాలిపోతుంది అని ఏడుస్తూ  అడ్డుకోవడానికి వెళ్తాడు. వల్లభని విశాల్ ఆపుతాడు. అందరూ చూస్తుండగానే తిలోత్తమ కాలి బూడిద అయిపోతుంది. వల్లభ చాలా ఏడుస్తాడు. బూడిది మిగలగానే దాని దగ్గర కూలబడి చాలా ఏడుస్తాడు. కనుమరుగైపోయిందని పావనా ఏడుస్తాడు. వల్లభ విక్రాంత్ రేయ్ విక్రాంత్ అమ్మ లేదురా అని ఏడుస్తాడు. వల్లభ ఏడ్వడం చూసి కంట నీరు రాక మానదు. ఇక సుమన కూడా అందరికీ క్షమాపణ చెప్తుంది. ఇప్పుడు నాకు బుద్ధొచ్చిందని తన బుద్ధి మార్చుకుంటానని అంటుంది. ఇంతలో త్రినేత్రి అక్కడికి వస్తుంది. అచ్చం నయనిలా ఉండటంతో అందరూ షాక్ అయిపోతారు.

త్రినేత్రి వచ్చి బామ్మని పట్టుకొని సంతోషం వ్యక్తం చేస్తుంది. నయనిని చూసి త్రినేత్రి నవ్వుకుంటుంది. నయని శరీరానికి త్రినేత్రి ఆత్మ చేరిందని విక్రాంత్ పావనా, దురంధరలతో చెప్తాడు. విశాలాక్షి అమ్మే చిక్కు తీయాలని అంటాడు. ఇక దురంధర కడుపులోకి తిలోత్తమ ఆత్మ చేరుతుంది. తిలోత్తమ పునర్జన్మ ఎత్తడానికి నీ కడుపులోకి చేరిందని నయని అంటుంది. వల్లభ మనసులో ఆడపిల్ల పుడితే మళ్లీ మా అమ్మ పేరు పెట్టి గాయత్రీ పాప అంతు చూస్తానని అనుకుంటాడు. ఇక తారు మారు అయిన త్రినేత్రి త్రినయనిలు అమ్మవారికి మొక్కకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. త్రినయని సీరియల్ కూడా ఈ ఎపిసోడ్తో శుభం కార్డు పడింది.

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: పాపని కాపాడమని చేతులు చాచి సాయం అడిగిన కాంచనను అవమానించిన తండ్రి..!

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Aug 23rd: దొంగ చిట్టి గురించి నిజం తెలుసుకున్న విక్కీ...ఆస్తి కొట్టేయడానికి సుందరి వేసిన ప్లాన్ భగ్నం చేసిన రాధ
నువ్వులేక నేను లేను: దొంగ చిట్టి గురించి నిజం తెలుసుకున్న విక్కీ...ఆస్తి కొట్టేయడానికి సుందరి వేసిన ప్లాన్ భగ్నం చేసిన రాధ
Illu Illalu Pillalu Serial Today August 23rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 6 లక్షలు పోయావని గుర్తించిన చందు! తిరుపతి మీదకి నింద నెట్టేసిన వల్లీ! ప్రేమ, ధీరజ్‌ల గొడవ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 6 లక్షలు పోయావని గుర్తించిన చందు! తిరుపతి మీదకి నింద నెట్టేసిన వల్లీ! ప్రేమ, ధీరజ్‌ల గొడవ!
Podarillu Serial Today August 23rd: కేశవ్‌ ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న మాధవ్‌....శైలూకు మళ్లీ పెళ్లి ప్రయత్నాలు చేసిన తల్లిదండ్రులు
పొదరిల్లు: కేశవ్‌ ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న మాధవ్‌....శైలూకు మళ్లీ పెళ్లి ప్రయత్నాలు చేసిన తల్లిదండ్రులు
Karthika Deepam 2 Serial Today August 23rd: కార్తీకదీపం 2 సీరియల్: సంతకాలు పెట్టించి చెమటలు పట్టేసిన సూరజ్! ఏదో పెద్ద మోసమే! అమ్మని చూసి జ్యోత్స్న ఎమోషనల్!
కార్తీకదీపం 2 సీరియల్: సంతకాలు పెట్టించి చెమటలు పట్టేసిన సూరజ్! ఏదో పెద్ద మోసమే! అమ్మని చూసి జ్యోత్స్న ఎమోషనల్!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Auto Drivers Strike: చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Embed widget