Trinayani Serial Today January 11th: 'త్రినయని' సీరియల్: నయని దేహాన్ని చూపించడానికి వెళ్లిన పాప, గురువుగారు.. అద్భుతమైన ఐడియాతో నయని సిద్ధం!
Trinayani Today Episode నయని దేహాన్ని చూపిస్తానని పాప, గురువుగారు ఇంట్లో అందరికీ తీసుకెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode నయని ఆత్మని చూశాం కదా తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని అఖండ స్వామి చెప్పి వెళ్లిపోతారు. ఆయన్ని తీసుకొచ్చి అందరినీ ఇబ్బంది పెడుతున్నావ్ అని విక్రాంత్ తల్లితో అంటాడు. నయని చనిపోయిందని అనుకోలేదని ఇలా ఆత్మగా కనిపిస్తుందని అనుకోలేదని తిలోత్తమ మొసలి కన్నీరు కారుస్తుంది. దాంతో సుమన మీరే అలా అంటే నేను మా అక్కని పోగొట్టుకున్నా అత్తయ్య అని అంటుంది.
వల్లభ: త్రినేత్రి శరీరంలో మన నయని ఆత్మ దూరిందా.
తిలోత్తమ: నోర్ముయ్ మన త్రినయని వేరు ఆ త్రినేత్రి వేరు. నాకు ఇద్దరూ కనిపించారు.
సుమన: ఒకరు ఆత్మగా మరొకరు మనిషిగానా.
తిలోత్తమ: కాదు సోఫాలో పడుకున్నది ప్రాణాలతో ఉన్న త్రినేత్రి. ఆత్మగా వచ్చింది ప్రాణాలు లేని నయని.
వల్లభ: ప్రాణాలు లేకపోతే బాడీ ఎక్కడో ఒక చోట ఉండాలి కదా.
సుమన: ఆత్మ లింగం, అఖండ స్వామి వారు చెప్పినట్లు దేహం ఈ ఇంట్లోనే ఉంది అంటే మా అక్క పార్ధివ దేహం ఉందనా.
వల్లభ: ఇప్పటికే భయపడుతుంటే నువ్వు ఇంకా భయపెట్టకు చిన్న మరదలా.
సుమన: మా అక్క చనిపోయింది అంటే నాకు ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు. ఎందుకు అంటే మాది రక్త సంబంధం కదా తను నిజంగా చనిపోతే నా గుండె చల్లబారిపోతుంది.
తిలోత్తమ: ఆల్ రైట్ సుమన రేపు ఉదయం వరకు నాకు గడువు ఇవ్వు నీకు నమ్మకం కుదిరేలా చేస్తాను.
దురంధర: రోజు రోజుకు తిలోత్తమ వదిన వాళ్లకి పిచ్చి ముదిరిపోతుంది నయని. నువ్వు ఇక్కడ ఉంటే ఆత్మ చూశాను అంటున్నారేంటి.
విక్రాంత్: అదే నేను అడగాలి అనుకున్నా పిన్ని.
దురంధర: సమాధానం మాత్రం నయని చెప్తాలి.
నయని: జరిగిందే చెప్పారు పిన్ని. ఆత్మ వచ్చింది.
విక్రాంత్: పెద్దమ్మ వచ్చిందని చెప్పలేదు కదా వదిన
నయని: వచ్చింది నా ఆత్మనే విక్రాంత్ బాబు.
విక్రాంత్: అదేలా సాధ్యం వదిన.
నయని: మీ అమ్మ వాళ్లు చేసిన పని వల్లే నేను ఆత్మలా కనిపించాను. నిజం అని అప్పుడు చెప్తే వాళ్లు నన్ను ఈ ఇంట్లో ఒక్క నిమిషం ఉండనివ్వరు. హాల్‌లో కాగితాలు చిందర వందర ఉంటే వెళ్లాలి అనుకున్నా అప్పటికే పాప నాకు అటు వెళ్లొద్దని చెప్పింది కానీ నేనే వినలేదు. మత్తు ఇవ్వడంతో త్రినేత్రి దేహం సోఫాలో పడిపోయింది నేను ఆత్మలా కనిపించాను.
దురంధర: వాళ్లు తవ్వుకున్న గోతిలో వాళ్లే పడ్డారు అయితే.
నయని: లేదు పిన్ని నేను ఆత్మలా కనిపించాను అంటే ప్రాణాలతో లేను అని అనుకుంటారు. ఇప్పుడు వాళ్ల ప్లాన్ ప్రకారం మనం నడుచుకోవాలి.
విక్రాంత్: తొందరపడితే మనమే వాళ్లకి ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది వదినా.
ఉదయం ఇంటికి గురువుగారు వస్తారు. అందరూ హాల్‌లోకి చేరుకుంటారు. పండగ వరకు గురువుగారిని ఉండమని విక్రాంత్ చెప్తాడు. దాంతో గురువుగారు ఆచేతనంగా నిర్జీవంగా కనిపించే దేహం ఉన్న చోట నేను ఉండకూడదు అని చెప్తారు. అందరూ షాక్ అవుతారు. దాంతో తిలోత్తమ ఆత్మలింగం చెప్పిందే నిజం అని ఇంట్లో శవం ఉందని అంటుంది. ఎందుకు అలా అన్నారని హాసిని అంటుంది. మనకు ఎవరికీ తెలీకుండా ఇంట్లో శవం ఉందేమో అని వల్లభ అంటాడు. దానికి గురువుగారు నేను శవం అని చెప్పలేదు అని అచేతనంగా ఉన్న శరీరం ఉందని అంటారు. ఇక తిలోత్తమ గురువుగారితో ఇక్కడున్నది నయని కాదని త్రినేత్రి అని రాత్రి నయని ఆత్మని చూశానని చెప్తుంది. ఏదేదో ఊహించుకుంటున్నారని దేహం ఉందని అంటున్నారు కదా ముందు అది చూపించండి అని నయని అంటుంది. దాంతో హాసిని చూద్దామని అంటుంది. నయని గురువుగారితో మీరు చేయాలి అనుకున్నది చేయండి స్వామి మంచే జరుగుతుందని అంటుంది. ఇక నయని తిలోత్తమ వాళ్లని దేహం వెతకమని చెప్తుంది.
గురువుగారు విక్రాంత్తో నయని చెప్పిందే చేయండి అని అంటారు. ఆ దేహాన్ని గాయత్రీ చూపిస్తుందని తనకు మాత్రమే ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు అని అంటారు. నయని కూడా గాయత్రీనా అని షాక్ అవుతుంది. ఇక తిలోత్తమ పాపతో గాయత్రీ నిర్జీవంగా ఉన్న దేహాన్ని చూపించు అంటుంది. పాప నడుచుకుంటూ మీదకు వెళ్తుంది. నయని చాలా టెన్షన్ పడుతుంది. దురంధర, విక్రాంత్ కూడా టెన్షన్ పడతారు. గాయత్రీ పాప వెళ్లడం గురువుగారు మా అమ్మ మాట విని రావడం షాకింగ్గా ఉందని అంటాడు. దేహాన్ని ఎక్కడికైనా మార్చేద్దామని దురంధర అంటే విక్రాంత్ అవ్వదని అంటుంది. దాంతో నయని గురువుగారు మనకి మంచే చేశారని ఈ తల్లిని కాపాడటానికే పాప వాళ్లని అటు వైపు తీసుకెళ్లిందని నయని అంటుంది. ఏం అర్థం కాలేదని దురంధర అంటాడు. దానికి నయని గురువుగారు పాపని తీసుకొని వెళ్లారు అంటే నేరుగా దేహం దగ్గరకు వెళ్లాలి అలా నేరుగా వెళ్లకుండా ఇంటి మొత్తం తిరుగుతున్నారు అంటే నేను వెళ్లి చీర మార్చుకొని వస్తానని నేను వచ్చే లోపు మీరు కోమాలో ఉన్న దేహాన్ని మార్చేయండి నేను వచ్చి ఆ స్థానంలో కూర్చొంటా పాప వచ్చేలోపు అంతా జరిగిపోవాలని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: అదిరిపోయిన ట్విస్ట్.. బంటీతోనే రాజు, రూపలు.. మందారం, రాఘవని చూసేసిన తల్లీకొడుకులు!





















