Trinayani Serial Today February 6th: గాయత్రీ దేవి చీర కట్టుకున్న తిలోత్తమ.. తన కంగారుతో సుమనకు దొరికిపోయిన విశాల్!
Trinayani Serial Today Episode గాయత్రీ దేవి చీర కట్టుకొని వచ్చిన తిలోత్తమ చూపులమ్మకు దీపారాధన చేయడానికి సిద్ధం కావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Today Episode: సుమన నగలు వేసుకొని రెడీ అవుతుంటుంది. విక్రాంత్ అక్కడికి వస్తాడు. ఫంక్షన్, పండగలు లేవు కదా ఎందుకు రెడీ అవుతున్నావ్ అని అడుగుతాడు. దీంతో సుమన అత్తయ్య గాయత్రీ అత్తయ్య చీర కట్టుకుంటారు కదా అందుకు అందంగా రెడీ అవుతున్నాను అని అంటుంది. విక్రాంత్ చీవాట్లు పెడతాడు. మరో వైపు నయని ఇంట్లో విపరీతంగా గాలి వీస్తుంది. దీంతో ఏమైందా అని నయని, హాసిని, ధురందర, పావనామూర్తి, డమ్మక్క చూస్తారు.
డమ్మక్క: ఈ వాయు ప్రకంపనలకు మీ అత్త తిలోత్తమే కారణం. ఆ గాయత్రీ దేవమ్మ చీర కట్టడం వల్లనే..
తిలోత్తమ: గాయత్రీ దేవి చీరకట్టుకొని అద్దంలో చూసుకుంటూ.. హాయ్ గాయత్రీ అక్క.. ఎలా ఉన్నావ్.. నీకేంటి అందగత్తెవి ఎలా అయినా బాగుంటావ్..
సుమన: వావ్ నిజంగా గాయత్రీ అత్తయ్య అంత బాగుండేదా.. మిమల్ని ఇలా చూస్తుంటే ఆవిడ ఇంకా ఎలా ఉండేదో అర్థమవుతుంది అత్తయ్య.
తిలోత్తమ: కేవలం చీర కడితేనే ఇంతలా ఆశ్చర్యపడుతున్నావంటే ఆవిడ ఆస్తి అధికారాలు చేతిలో ఉంటే ఇంకెంత గొప్పగా ఉంటుందో ఊహించు సుమన.
సుమన: వైభవాన్ని తలచు కోవచ్చు కాని.. వైభోగాన్ని తట్టుకునే శక్తి కూడా ఉండాలి కదా అత్తయ్య.
వల్లభ: మనదే పై చేయి అయిన రోజు అన్నింటిని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు చిన్నమరదలా..
తిలోత్తమ: కరెక్ట్ ఆలోచిస్తే నీకే అన్ని అర్థమవుతాయి.
విక్రాంత్: ఇక్కడ బాగానే ఉందే.. అక్కడమాత్రం వేరేలా ఉందే... హాల్‌లో గాలికి కర్టెన్స్, ఫ్లవర్ వాజ్‌లు అన్నీ కదులుతున్నాయి బ్రో. ఈ రూంలో మాత్రం అలా లేదు.
సుమన: గాయత్రీ అత్తయ్య చీర కట్టిన తిలోత్తమ అత్తయ్య అక్కడికి వస్తే ఆ హోరు తగ్గిపోతుంది ఏమో అండీ.
వల్లభ: రేయ్ నువ్వు హాల్‌లోకి వెళ్లు మేం వచ్చి దీపారాధన చేస్తాం.
విక్రాంత్: సరే.. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. పెద్దమ్మ పునర్జన్మ ఎత్తింది అంటే ప్రాణాలతోనే ఉంది. మీరు దీపారాధన ఎందుకు చేస్తున్నారో జాగ్రత్తగా ఆలోచించి చేయండి.
సుమన: అవును ఎందుకు చేస్తున్నారు అత్తయ్య.
ధురందర: ఇక్కడ గాలికి అన్నీ ఊగిపోతుంటే దీపం ఉంటుందా..
డమ్మక్క: ఉంటుంది. ఇక్కడ వస్తువులు అన్నీ ఊగిపోతున్నా చూపులమ్మలో ఎలాంటి చలనం లేదు చూశారా..
హాసిని: అవును కలశం అలాగే ఉంది.
వల్లభ: వచ్చేస్తున్నాం.. వచ్చేస్తున్నాం..తిలోత్తమ కిందకి వస్తుంది. గాలి ఆగిపోతుంది.
నయని: అసుర సంధ్యావేళ దీపారాధన చేయడానికి ఇలా వస్తారా..
విశాల్: అమ్మా అమ్మ చీరలో నిన్ను చూడాలి అన్నా నువ్వ ఎవర్నీ చూడకూడదు అన్నట్లు కళ్లద్దాలు పెట్టుకున్నారు ఏంటి.
తిలోత్తమ: నేను వీటిని ఎందుకు పెట్టుకున్నానో తిలిస్తే ఆశ్చర్యపోతారు. గాయత్రీ అక్క చీర కట్టినా తన అందం నాకు రాకపోవచ్చు. ఒప్పుకుంటాను. అయితే అక్కడ ఉండే చూపులమ్మ దగ్గర దీపారాధన చేస్తే అందులో నుంచి వచ్చే కాంతి కావొచ్చు. లేదంటే ఇంకేదైనా కావొచ్చు ఆ పవర్‌ని తట్టుకోవాలి అంటే ఈ గ్లాస్‌ని వాడాలి.
విక్రాంత్: కాంతి వస్తుందని ఎవరు చెప్పారు అమ్మ.
వల్లభ: తమ్మీ డైరెక్ట్‌గా పెద్దమ్మే వచ్చినా ఆశ్చర్యంలేదు.
సుమన: గాయత్రీ అత్తయ్య చీర కట్టుకుని చూపులమ్మ దగ్గర దీపారాధన చేస్తే పునర్జమ్మ ఎత్తిన గాయత్రీ అత్తయ్య జాడ తెలుస్తుంది అంట.
డమ్మక్క: జాడ కాదు సుమన ఏకంగా ఆ తల్లి నీడే తెలుస్తుంది. విశాల్, హాసిని, పావనాలు కంగారు పడతారు.
విశాల్: ఇలాంటిది ఏదో చేస్తారు అన్న నా అనుమానం నిజం అయింది. ఛా ఇప్పుడు ఏం చేయాలి.
హాసిని: అంటే గాయత్రీ అత్తయ్యని రప్పించడానికి తన చీరే కట్టుకొని దీపారాధన చేస్తున్నారన్నమాట.
సుమన: మనసులో.. విశాల్ బావగారిలో తెలియని కంగారు కనిపిస్తోంది. వాళ్ల అమ్మ కనిపిస్తుంది అంటే సంతోషం ఉండాలి కాని టెన్షన్ పడుతున్నారు ఏంటి.
తిలోత్తమ, వల్లభలు దీపారాధన చేయడానికి వెళ్తారు. ఇక విశాల్ గాయత్రీ పాపని రూంలోకి తీసుకెళ్లాలని బయల్దేరుతాడు. అందరూ ఎందుకు అని ప్రశ్నిస్తారు. అమ్మ ఆచూకి తెలిస్తే పిలవండి అంటూ గాయత్రీ పాపని తీసుకెళ్లిపోతాడు. ఇక విశాల్ మెట్లమీద నుంచి కిందకి చూస్తుంటే సుమన వచ్చి చూస్తుంది. గాయత్రీ దేవి గురించి ఎవరికీ తెలీకూడదు అని విశాల్ అనుకోవడం వినేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.