Trinayani Serial Today February 22nd: 'త్రినయని' సీరియల్: విషం కలిపిన ప్రసాదం తిననున్న జంటలు.. నాగయ్య పాముకి అంజన్న సాయం!
Trinayani Serial Today Episode అమ్మవారి ప్రసాదంలో విషాన్ని కలపడంతో అది తెలియక జంటలుగా ప్రసాదం తినడానికి సిద్ధం కావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Today Episode నాగయ్య పాము వచ్చి అఖండ స్వామి విధించిన రేఖ దగ్గర ఆగిపోతాడు. దీంతో అఖండ స్వామి వచ్చి నా శక్తి పరీక్షిస్తున్నావా నాగయ్య. దాటాలి అని చూస్తే కాలి బూడిద అయిపోతావు అని అంటాడు. దీంతో నాగయ్య పాము వెనక్కి వెళ్లిపోతుంది. మరోవైపు గురువుగారు నయనితో ప్రసాదం తీసుకోమని చెప్తారు.
ఇక నాగయ్య పాము ఆంజనేయ విగ్రహం దగ్గరకు వెళ్లి బుసలు కొడతాడు. అప్పుడు ఓ రామచిలుక వచ్చి నాగయ్య నువ్వు వస్తే తప్ప గండాన్ని ఆపలేవు అని నీ భార్య నాగులమ్మ చెప్పిందని అంటుంది. ఢీలాగ్ని దాటలేక నిస్సహాయ స్థితిలో ఉన్న నువ్వు భజరంగబలి దగ్గరకు వచ్చావని.. ఆ స్వామి నిన్ను చేయి అందిస్తారు అని అంటుంది.
సుమన: హారత ఇచ్చిన మా అక్కకి ముందు పులిహోర ఇవ్వాలి.
విక్రాంత్: ఆచారమా..
సుమన: అవసరం..
విశాల్: అందులో ఏం కలిపి ఉంది.
ఇక చిలుక ఆంజనేయ స్వామిని వేడుకోగా ఆంజనేయ స్వామి నుంచి తమలాపాకుల దండ కింద పడుతుంది. దాంతీ చిలుక నాకు అర్థమైంది అని ఆంజనేయుడ్రి దండం పెడితే చిలుక సైజు పెద్దగా అయిపోతుంది. దీంతో పాము తమలాపాకుల దండను నోట కరిస్తే చిలుక ఆ దండను మరో చివర పట్టుకొని నాగయ్య పామును అక్కడికి తీసుకెళ్తుంది.
తిలోత్తమ: అదేంటి విశాల్ అలా అన్నావ్.
విశాల్: నేను అనుమానంతో అనలేదు అమ్మ. మళ్లీ నయని ముందుగా చెప్పలేదు అని సుమన అంటుంది. అందుకే..
వల్లభ: పంచామృతం నువ్వు తీసుకో తంబి. అప్పుడు రెండింటిలో ఏం లేదు అని అందరకీ అర్థమవుతుంది. లేదు అంటే చిన్నమరదలు అనుమానంతో ఏ పని చేయనీయదు.
పెద్దబొట్టమ్మ: ఆ ప్రసాదంలోనే విషం ఉంది కాబోలు అందుకే ముందు నయని విశాల్‌లకు తినమని చెప్తున్నారు.
నయని: దానిదేముందు బావగారు అలాగే చేద్దాం.
హాసిని: గండం వస్తుంది అని భయం లేకుండా మా ఆయన అత్తయ్య హ్యాపీగా ఉన్నారు.
తిలోత్తమ: ఎన్నాళ్లు ఉంటే అన్నాళ్లు సంతోషంగా ఉండాలి అని డిసైడ్ అయ్యాం.
గురువుగారు: అందరూ ఇక్కడే ఉన్నారు. పూజ జరిగింది. ఆ అమ్మవారి కృపాకటాక్షాలు మీ ఇద్దరి మీదే ఉండాలి అనా మీ ఇద్దరే ముందు ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు.
విశాల్: అలాంటి స్వార్థం మాకు లేదు గురువుగారు.
గురువుగారు: పైకి లేకపోయినా మిగతావాళ్లు అలాగే అనుకుంటారు.
తిలోత్తమ: మాకు అయితే అలా ఏం లేదు.
హాసిని: నాకు మాత్రం అలాగే ఉంది.
గురువుగారు: చూశావా నయని హాసిని అలానే అంది అంటే.. ఇక్కడ గ్రహించాల్సింది అమ్మ వారి కృప అందరికి ఉండాలి అనే తప్ప అందులో ఏదో ఉంది అని కాదు.
నయని: అందరికీ పంచమని అంటారా..
వల్లభ: ఏయ్ వద్దొద్దు.
విక్రాంత్: అమ్మవారి దయ అందరికీ ఉండాలి అంటే అందరం ప్రసాదం తినాలి.
గురువుగారు: భార్యాభర్తలుగా ఉన్న మీరు ఒకరికి ఒకరు ప్రసాదం తినిపించుకోండి.
పెద్దబొట్టమ్మ: అయ్యయ్యో ఒక్కరు కాదు అందరూ పోతారే..
ఇక అందరికీ ప్రసాదం తీసుకోమని అంటారు. ఇక అందరూ ప్రసాదం దగ్గరుకు వెళ్తారు. మరోవైపు నాగయ్య పాము ఢీలాగ్ని రేఖ దాటేస్తుంది. నయని అరటిఆకుల్లో అందరికీ ప్రసాదం ఒడ్డిస్తుంది. సుమన మనసులో ఇప్పుడు పులిహోరలో విషం ఉంది అంటే ముందు నన్ను చంపేస్తారు అని బాధపడుతుంది. ఇక తిలోత్తమ పంచామృతంలో విషం ఉంది అంటే నన్నే దోషిగా తేల్చేస్తారు అని.. తన కొడుకులు చనిపోతే తాను బతికి ప్రయోజనం ఏంటని అనుకుంటుంది. మూడు జంటలు ఒకరికి ఒకరు తినిపించుకోవడానికి రెడీ అవుతారు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.