Trinayani Serial Today December 30th: 'త్రినయని' సీరియల్: నయనిని చూసేసిని బామ్మ.. కొత్త డ్రామా మొదలు పెట్టిన వదినామరిది!
Trinayani Today Episode నయని బామ్మకు త్రినేత్రిగా కనిపించి తన దేహాన్ని చూపించి కొన్ని రోజులు నాటకం ఆడుతానని బామ్మతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Serial Today Episode నయని త్రినేత్రిని తీసుకొస్తానని ఇంట్లో వాళ్లకి చెప్తుంది. ఏం చేయాలా అని విక్రాంత్, నయని అనుకుంటే గాయత్రీ పాప లంగావోణి పట్టుకొని వస్తుంది. దాంతో నయని తానే త్రినేత్రిగా కనిపించాలని పాప చెప్పిందని అంటుంది. ఇక ముక్కటి తన భార్యతో విశాల్ వాళ్ల ఆస్తులు మనం కొట్టేయాలని అంటాడు. త్రినేత్రిలా ఉన్న నయనిని వాడుకొని సంపాదించాలని అంటాడు. ఇక అందరూ రావడంతో ఇళ్లు చాలా బాగుంది అని గొప్పలు చెప్తాడు. ఇక బామ్మ రత్నాంబ మా మనవరాలని చూపించండి అని అంటుంది.
నయని త్రినేత్రిలా లంగావోణి కట్టుకొని బామ్మ అని త్రినేత్రిలా నటించి హడావుడి చేస్తుంది. బామ్మ చాలా మురిసిపోతే ముక్కోటి, వైకుంఠం మాత్రం షాక్ అయిపోతారు. ఇక త్రినేత్రి అత్త మామల్ని పలకరిస్తుంది. ఇక అందరూ త్రినేత్రి వచ్చింది నయని ఏదని అడుగుతారు.
తిలోత్తమ: మన చెవిలో పువ్వులు పెడుతుందిరా. నయనినే లంగావోణి కట్టుకొని వచ్చి ఇప్పుడు హడావుడి చేస్తుంది.
త్రినేత్రి: ఏంటి మీరు మా బామ్మ వచ్చింది అనే సంతోషం కూడా లేకుండా చేస్తారా.
సుమన: అదంతా సరే ఇప్పుడు త్రినేత్రి వీళ్లతో వెళ్లిపోతుందా.
వల్లభ: అలా ఎలా వెళ్లిపోతుంది మా తమ్ముడికి పెళ్లాం ఉండదు కదా.
బామ్మ: ఇది మరీ బాగుందయ్యా వాళ్లావిడతో విశాల్ బాబు కాపురం చేసుకుంటాడు. నా మనవరాలిని పెళ్లి చేసుకోవడానికి రాలేదు అని జరిగింది చెప్పారు కదా.
వల్లభ: అది కాదు బామ్మ మా నయని కూడా ఇక్కడే ఉందని మేం అనుకోవాలి కదా.
హాసిని: మీ మనవరాలిని తీసుకొని మీరు మీ ఊరు వెళ్లండి కానీ వెళ్లే ముందు మా నయనిని కూడా చూసి వెళ్లండి అప్పుడు క్లారిటీ వస్తుంది కదా.
సుమన: హలో కొత్త అక్క నీతో మీ బామ్మ వాళ్లు వచ్చారని చెప్పిన మా నయని అక్క ఎక్కడ ఉంది.
త్రినేత్రి: ఇక్కడే ఉంది మీ అందరికీ చూపించాలా మా బామ్మకి చూపిస్తే చాలా.
బామ్మ: నాకు చూపిస్తే చాలమ్మా.
తిలోత్తమ: పెద్దావిడ నయనిని త్రినేత్రిని ఇద్దరినీ చూశాను అంటే కానీ మేం నమ్మం.
త్రినేత్రి: తప్పకుండా చూపిస్తాను ముందు ఇళ్లు చూద్దువు రాబామ్మ ఎంత పెద్ద ఇళ్లు తెలుసా.
విక్రాంత్, తినేత్రి ఇద్దరూ బామ్మని నయని సజీవ దేహం దగ్గరకు తీసుకెళ్తారు. బామ్మ నయని దేహాన్ని చూసి షాక్ అయిపోతుంది. నయని దగ్గరకు వెళ్లి చూసి త్రినేత్రిని నయనిని చూస్తుంది. ఇక విక్రాంత్ దేవీపురంలోనే యాక్సిడెంట్ అయిందని ఆరోజు నుంచి మా వదిన కోమాలోనే ఉందని చెప్తాడు. దాంతో బామ్మ ఆ రోజు ప్రమాదానికి గురైంది నయనినా నా మనవరాలు అనుకొని కుప్పకూలిపోయాను అని అంటుంది. ఇక నయని తల మీద చేయి వేసి చక్కగా ఉన్నావ్ లేచి మీ వాళ్ల బాగోగులు చూసుకోమ్మా అని అంటుంది. ఇక త్రినేత్రి బామ్మతో తన పరిస్థితి అలా ఉందని తెలిసే నయనిలా నటిస్తున్నాని చెప్తుంది. విక్రాంత్ రెండు చేతులు జోడించి ఏడుస్తూ బామ్మకి దండం పెట్టి మా వదిన కోలుకునే వరకు మీ త్రినేత్రిని ఇక్కడే ఉండనివ్వండి అని అంటాడు. దాంతో బామ్మ నయనిలా ఉండమని త్రినేత్రితో చెప్తుంది.
తర్వాత అందరికీ నిజం తెలిసినా ఏం కాదు అంటుంది. ఇక త్రినేత్రి గురించి ఎక్కడా అని అడిగితే ఏం చెప్పాలి అని అంటే వెళ్లిపోయిందని చెప్దామంటారు. మీరు ఉన్నా ఎందుకు వెళ్లిందని అడుగుతారని అప్పుడేం చెప్పాలని బామ్మ అడిగితే దానికి విశాల్ బాబుని పెళ్లి చేసుకోవడం కుదరదు అని చెప్పినందుకు అలిగి వెళ్లిపోయిందని చెప్పమంటారు. ఇక నయని, విక్రాంత్‌లు ఎలా గోలా బామ్మని నమ్మించామని అనుకుంటారు. ఇక తిలోత్తమ వల్లభతో త్రినేత్రినే ఇలా నయనిలా నటిస్తుందని ఆస్తి కొట్టేయడానికే ఇలా చేస్తుందని అంటుంది. ఇక ముక్కోటి విలాసంగా కాలు చాపుకొని లగ్జరీగా కూర్చొని ఉంటాడు. ఇక పాము ఇంట్లో ఉందని నాగయ్య, నాగలమ్మ అని చెప్పడంతో ముక్కోటి, వైకుంఠం నోరెళ్లబెట్టి భయపడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: కోడలు వర్సెస్ కుటుంబం.. ఎవరెన్ని చెప్పినా సత్య తగ్గెదేలే!