News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Trinayani September 22nd Episode: కొత్త ప్లాన్‌తో తిలోత్తమా- పుట్టినరోజు సంబరాలలో విష ప్రయోగం!

పుట్టినరోజు వేడుకలో తిలోత్తమ విషప్రయోగం చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

Trinayani September 22th Written Update: అవును బాబు గారు, సహనం లేని సుమనకి ఈ ప్రసవనం పరీక్షగా మారింది అని నయని అంటుంది.

విశాల్: గొడవలేవీ లేకుండా తనకి ఆస్తి ఇచ్చేసి ఉంటే అంతా ప్రశాంతంగా ఉండేది

నయని: అయినా మీరు ఇవ్వాలనుకుంటుంది మీ పూర్వీకుల ఆస్తి కాదు మీరు కష్టపడి సంపాదించుకున్న ఆస్తి. ఎంత అభిమానంతో మీరు ఆస్తి ఇచ్చిన సరే, ఆస్తి దక్కిన తర్వాత సుమన కాటు వేసే పాములాగే మారుతుంది. అని అంటుంది నయని.

ఆ తర్వాత రోజు హాల్లో సుమన లాప్టాప్, పుస్తకాలు పట్టుకుని బిజీగా ఉంటుంది. ఎవరు ఏం మాట్లాడినా జవాబు ఇవ్వదు.

దురంధర: ఏంటి సుమ్మి పిల్లలు పుట్టిన రోజు వస్తుంది కదా అని చెప్పి దానికోసం ప్రిపరేషన్ చేస్తున్నావా? అంత బిజీగా ఉన్నావు?

విశాల్: అలాగైతే పిల్లల పిన్నిగా ప్రిపరేషన్ బాధ్యతలన్నీ నీకే అప్పచెప్పుతాను

సుమన: ఏం అవసరం లేదు. వాళ్ళు నా పిల్లలు కానప్పుడు వాళ్లకి చాకిరి చేయాల్సిన అవసరం నాకేంటి

హాసిని: అందులో నీ పాపకి కూడా పేరు పెట్టాలనుకున్నారు కదా

సుమన: అందుకే మంచి పేరు కోసం వెతుకుతున్నాను. అని అనగా దీనికోసం నువ్వు ఇలాగ అయిపోతున్నావు అని అందరూ అడుగుతారు. 

సుమన: నా పాప పేరు అందరికన్నా ప్రత్యేకంగా ఉండాలి అందుకే ఇవన్నీ వెతుకుతున్నాను.

నయని: నీ పాపే ప్రత్యేకం కదా దానికి మళ్ళీ ప్రత్యేకమైన పేరు ఎందుకు?

Also Read: Gruhalakshmi September 22nd: జానూకి దివ్య వార్నింగ్ - ఎప్పుడూ తన పక్కనే ఉండాలని తులసిని కోరిన నందు

సుమన: అంటే ఏంటి ఉదయం మనిషిలాగ రాత్రి పాములాగా పాకుతుంది అందుకే అది విషపూరితమని వేలాకోలం చేస్తున్నారా

విక్రాంత్: ఎందుకు ప్రతిదీ అంత నెగిటివ్గా తీసుకుంటావు? అలాంటి భేదాలు ఏవి లేకుండా ముగ్గురు పిల్లలు పుట్టిన రోజు నాడు నీ పాపతో కూడా పేరు పెడుతున్నారు కదా

సుమన: వాళ్ల ముగ్గురు పిల్లలనీ చూసినంత బాగా నా పిల్లని ఇంట్లో ఎవరూ చూడరు నేను నా పాప ఫంక్షన్ కి ఫ్రీగా వచ్చి ఎంగిలి మెతుకులు తిని రావాలా

విశాల్: నీ పాప మీద పది కోట్లు ఆస్తి ఇస్తానని చెప్పాను కదా

సుమన: అది పాప పేరు మీద నా పేరు మీద కాదు

వల్లభ: ఏం పర్లేదు చిన్న మరదలా చెక్కు మన చేతిలోకి వచ్చిన తర్వాత అది ఎప్పటికైనా మనతోనే ఉంటుంది కదా. ఎవరి పేరు మీద ఉంటే ఏంటి తీసేసుకో

హాసిని: అత్తయ్య గారు మీ పక్కన లేకపోయినప్పుడైనా మీ బుర్ర బాగా పనిచేస్తుంది.

విక్రాంత్: ఇంకెందుకు లేటు తీసేసుకో చెక్కు . మౌనమే సమాధానం తను ఇంత మౌనంగా ఉన్నదంటే అంగీకరించినట్టే.

హాసిని: ఏదేం జరిగినా సరే సాయంత్రంలోగా ఫంక్షన్ అవ్వగొట్టేయాలి లేకపోతే పాప మళ్ళీ పామలా మారుతుంది. అని అంటుంది.

ఆ తర్వాత సీన్లో సుమన తన రూమ్లో రెడీ అవుతూ ఉంటుంది.

విక్రాంత్:  సీరియస్ గా గదిలో కూర్చుంటావు అనుకున్నాను బానే రెడీ అవుతున్నావు. ఓ అన్న వదినలు చెక్ ఇస్తానన్నారు కదా అందుకేనా అని అనగా ఇంతలో అక్కడికి తిలోత్తమా, వల్లభలు వస్తారు.

Also Read: సుమనకు ఆస్తి ఇవ్వనని చెప్పేసిన నయని - చిన్నారికి పేరు వెతుకుతున్న సుమన!

వల్లభ: ఆ చెక్ తీసుకొని మనం పాపకి గార్డియన్ గా ఉందామా మమ్మీ?

తిలోత్తమ: ఉదయం పూట సుమన, విక్రాంతులు ఉన్నారు. రాత్రిపూట పెద్దబొట్టమ్మ, నాగయ్యలు ఉన్నారు వీళ్ళ మధ్య మనకెందుకురా. అయినా సరే పాపం సుమన పాపకి ఎంత అన్యాయం జరుగుతుందో. ఎవరో అనాధ పిల్లని ఇంట్లో తీసుకొని వచ్చి గాయత్రి అక్క అని చెప్పి మొన్నటికి మొన్న పాతిక కోట్లు ఇచ్చారు. మన సుమన కన్నా బిడ్డకి పది కోట్లు ఇచ్చారు. తనని మహారాణిల చూసుకుంటున్నారు తినని మాత్రం తక్కువ చేస్తున్నారు. చూసావా ఈ అన్యాయం.

విక్రాంత్: పెద్దమ్మ లేనప్పుడు తన గురించి ఇలా మాట్లాడడం ఏమైనా సరిగ్గా ఉందా అమ్మ

తిలోత్తమ: లేకపోతే ఏంట్రా గాయత్రి అక్క ఎవరికో మాట ఇచ్చిందట ఆ మాటకి మన సుమన పాముకి జన్మించిందట. పాపం సుమన.

విక్రాంత్: కింద కేక్ కటింగ్ జరుగుతున్నప్పుడు పెద్ద కేక్ తీసుకొని నోట్లో పెట్టుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

తిలోత్తమ: సుమనా నీకు ఒకటి చెప్పాలి అక్కడ నువ్వు ఫ్రీగా డబ్బులు తీసుకుంటున్నాను అని అందరూ అనకూడదు అంటే నాకు ఒక ప్లాన్ ఉన్నది అని చెప్పి సుమనకు ఒక ప్లాన్ చెప్తుంది తిలోత్తమ.

ఆ తర్వాత సీన్లో మిగిలిన కుటుంబ సభ్యులందరూ హాసిని నయని వాళ్ళ దగ్గర చేరుతారు. పిల్లల్ని ఇంకా రెడీ చేయలేదు అని అనగా హాసిని నేను వెళ్లి రెడీ చేస్తాను మళ్లీ సాయంత్రం అయితే సుమన పాప పాములా అయ్యి ఎవరిని బుస్సు కొడుతుందో తెలీదు అని డ్రస్సులు పట్టుకొని పిల్లల్ని రెడీ చేయడానికి వెళ్తుంది.

డమ్మక్క: విష ప్రయోగం వల్ల ఈరోజు పుట్టినరోజు ఎలా జరుగుతుందో చూడాలి అని డమ్మక్క తనలో తానే అనుకుంటుంది.

ఆ తర్వాత సీన్లో కింద పుట్టినరోజు డెకరేషన్ అంతా ఘనంగా ఉండగా కిచెన్లో కేక్ ఉంటుంది. అక్కడికి వల్లభ, తిలోత్తమలు వస్తారు.

వల్లభ: కేక్ ఇంకా ఓపెన్ చేయలేదు కదా మమ్మీ ఇప్పుడు ఇందులో విషం కలిపేద్దాము

తిలోత్తమ: వద్దు ఇందులో విషయం కలిపితే నయనికి ముందే తెలిసిపోతుంది అప్పుడు ప్లాన్ అంతా ఫ్లాప్ అవుతుంది. అని తన చేతిలో నుంచి ఒక కేక్ కట్ చేసే కత్తిని తీసుకొని కేక్ మీద పెడుతుంది.

వల్లభ: ఇది ఎందుకు మమ్మీ ఇక్కడ పెట్టావు?

తిలోత్తమ: స్పెషల్గా విషంతో చేయించాను. ఈ కత్తి తో కట్ చేస్తే ఆ కేక్ ముక్క అంగా విషపూరితంగా మారుతుంది అప్పుడు నయనికి ప్రమాదం ఎక్కడున్నదో కూడా తెలీదు

వల్లభ: నువ్వు ఇండియాలో ఉండడం చాలా డేంజరస్ మమ్మీ. అయినా సరే మంచి ప్లానే వేశావు అని అనగా ఇంతలో ఎద్దులయ్య అక్కడికి వస్తాడు. వచ్చి ఆ కేక్, ని కేక్ పైన ఉన్న కత్తిని కూడా తీసుకొని హాల్లో పెట్టడానికి వెళ్తాడు.

Join Us On Telegram: https://t.me/abpdesamofficial

Published at : 22 Sep 2023 10:49 AM (IST) Tags: Trinayani serial Trinayani telugu serial Trinayani zee telugu serial Trinayani

ఇవి కూడా చూడండి

Krishna Mukunda Murari December 2nd Episode రెస్టారెంట్‌లో రచ్చ రచ్చ చేసిన మురారి.. టెన్షన్‌లో భవాని, ముకుంద!

Krishna Mukunda Murari December 2nd Episode రెస్టారెంట్‌లో రచ్చ రచ్చ చేసిన మురారి.. టెన్షన్‌లో భవాని, ముకుంద!

Bigg Boss 7 Telugu: అమర్‌దీప్‌ ‘ఆట’పై శివాజీ సెటైర్లు, పనికిమాలినోడు అంటూ కామెంట్లు

Bigg Boss 7 Telugu: అమర్‌దీప్‌ ‘ఆట’పై శివాజీ సెటైర్లు, పనికిమాలినోడు అంటూ కామెంట్లు

Bigg Boss Telugu 7: 'బిగ్ బాస్' ఇంట్లో ప్రేమకథలు వినిపించిన కంటెస్టెంట్స్, ‘బేబీ’ స్టోరీని తలపించిన రైతుబిడ్డ స్టోరీ

Bigg Boss Telugu 7: 'బిగ్ బాస్' ఇంట్లో ప్రేమకథలు వినిపించిన కంటెస్టెంట్స్, ‘బేబీ’ స్టోరీని తలపించిన రైతుబిడ్డ స్టోరీ

Naga Panchami Serial December 1st Episode : 'నాగ పంచమి' సీరియల్: కరాళి మాయలో మోక్ష - పంచమి ఎదురుగానే ముద్దులాట! 

Naga Panchami Serial December 1st Episode : 'నాగ పంచమి' సీరియల్: కరాళి మాయలో మోక్ష - పంచమి ఎదురుగానే ముద్దులాట! 

Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌లను లాక్కెళ్లిపోయిన అర్జున్ - బాధతో కన్నీళ్లు పెట్టుకున్న రైతుబిడ్డ

Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌లను లాక్కెళ్లిపోయిన అర్జున్ - బాధతో కన్నీళ్లు పెట్టుకున్న రైతుబిడ్డ

టాప్ స్టోరీస్

Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం

Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్

India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం

India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం