అన్వేషించండి

Trinayani July 7th: ‘త్రినయని’ సీరియల్: మరింత వయసు తగ్గించుకున్న తిలోత్తమా, సంతకంతో షాక్ ఇచ్చిన గాయత్రి పాప?

తిలోత్తమా మరింత వయసు తగ్గించుకొని వయసులో ఉన్న దాన్ని లాగా ప్రవర్తించడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Trinayani july 7th: తిలోత్తమా పావనమూర్తి వాళ్లతో ఇప్పుడు సెక్రటేరియట్ గా ఉన్న నేను రేపు ఛైర్మన్ అవుతాను అంటుంది. గాయత్రి ఉన్నప్పుడు నువ్వెలా చైర్మన్ అవుతావు అని వాళ్ళు అడగడంతో తను ఉండదు కదా అని తను చేసే ప్లాన్ గురించి చెప్పటంతో.. పక్కనే ఉన్న వల్లభ తనను ఆపి వల్లభ అక్కడి నుంచి పంపిస్తాడు. ఇక నువ్వు చేసే ప్లాన్ గురించి వాళ్లకు చెప్పొద్దు అని వల్లభ తిలోత్తమాకు అర్థమయ్యేలా చెబుతాడు.

మరోవైపు నయని విశాల్ తో కాసేపు సరదాగా మాట్లాడుతుంది. ఆ తర్వాత విశాల్ ఇంట్లో జరుగుతున్న వరుస సంఘటనల గురించి తనతో చర్చ చేస్తూ ఉంటాడు. సుమన మొగ గొంతు తో మాట్లాడిందని, అమ్మ కొన్ని సంవత్సరాలు వెనక్కి పోయిందని, కసిని చంపింది మన ఇంట్లోనే ఒకరున్నారు అనటంతో వెంటనే నయని వాటి గురించి ఆలోచించొద్దని అంటుంది.

సుమన డెలివరీ అయ్యేవరికి చూడాలి అని.. ఇక అత్తయ్యను సమయం చూసి విశాలాక్షి తల తో ఢీ కొట్టించాలి అని అంటుంది. ఇక కసి గురించి మాత్రం పోలీసులే చూసుకుంటారు అని అంటుంది. విశాల్ మాత్రం కసిని చంపింది సుమన అని అనడంతో నయని నవ్వుతూ తను కాదు అని పోలీసులే సమాధానం చెబుతారు అని చెప్పి అక్కడ నుంచి వెళ్తుంది.

ఆ తర్వాత పై నుండి వల్లభ ఆవేశంగా వచ్చి ఏవేవో మాట్లాడేస్తూ ఉంటాడు. ఇంట్లో వాళ్లకి అర్థం కాకపోయేసరికి ఏం జరిగింది అని అంటారు. నేను చెప్పడం కాదు మీరే చూడండి అని తిలోత్తమా వైపు చూడటంతో తను లంగా వోని కట్టుకొని వయసులో ఉన్న దానిలాగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇక హాసిని తనతో ఫ్రెండ్షిప్ చేసి సరదాగా పగ తీర్చుకుంటూ ఉంటుంది.

ఇక అప్పుడే నాగులవరం లో నాగమణి గుడి నుండి పోస్ట్ రావటంతో.. అందరూ షాక్ అవుతారు. ఇక సంతకం పెట్టి పోస్ట్ తీసుకొని తిరిగి పెన్ను ఇస్తుండగా ఆ పెన్ను గాయత్రి దగ్గర పడుతుంది. గాయత్రి ఆ పెన్నుతో ఆడటంతో ఆ పోస్ట్ మాన్ సరేలే అని అక్కడనుండి వెళ్తాడు. ఇక నయని ఉత్తరం తీసి చూడగా అందులో అమ్మవారిని ఎత్తుకొని ఊరేగింపు జరిగే రోజుల్లో.. అమ్మ ఇచ్చిన కాసులకు ఆశపడ్డారని.. మట్టి గుట్టలను చదును చేశారు. అప్పుడు మాయమైన వారే చీకటిలో జీవం పోసుకుంటున్నారు అని రాసి ఉంటుంది.

దాంతో ఇంట్లో వాళ్ళందరూ ఆ మాటలు గురువు కూడా అన్నాడని గుర్తుకు తెచ్చుకుంటారు. ఇక ఆ లెటర్ తన చదువుతాను అని డమ్మక అడగటంతో ఆ లెటర్ కింద పడి గాయత్రి చేతిలో పడుతుంది. ఒక గాయత్రి కొన్ని పిచ్చి గీతాలు గీయగా.. ఆ పేపర్ నయని తీసుకోవడానికి వెళ్తుండగా.. అది తిలోత్తమా కళ్ళు దగ్గరకి రావడంతో తిలోత్తమా అందులో గాయత్రి దేవి పేరు చూడగా కళ్ళు తిరుగుతాయి.

వెంటనే ఆ లెటర్ సుమన చూడటంతో గాయత్రీ గీసిన పిచ్చి గీతాలు సంతకం లాగా ఉన్నాయని అనటంతో.. వెంటనే నయని చూడాలనుకోగా.. హాసిని ఆ లెటర్ లాక్కుంటుంది. ఇక అందులో ఏమీ లేవు పిచ్చి గీతాలు అనడంతో వెంటనే విశాల్ అమ్మని తీసుకెళ్లి బీపీ టాబ్లెట్ వేయించమని నయనితో చెబుతాడు. ఇక అందరూ వెళ్లాక హాసిని ఉత్తరాన్ని విశాల్ కు చూపిస్తుంది.

ఆ తర్వాత పావనమూర్తి డమ్మక్కతో తన జాతకం చెప్పామని అంటుండగా.. అదే సమయంలో తన గదిలో సుమన మణి గురించి వెతుకుతూ ఉంటుంది. ఇక డమ్మక్క దగ్గరికి వచ్చి అదేదో కానీ మణి ఎక్కడ ఉందో చెప్పమని అంటుంది. నీ దగ్గరనే ఉంది అని డమ్మక్క సుమన దగ్గర ఉన్న పాము విగ్రహం తీసి నీటి గ్లాసులో పెడుతుంది.

ఇక ఆ విగ్రహం నీరు మొత్తం తాగటంతో పావన మూర్తి, సుమన షాక్ అవుతారు. ఇక ఆ నీరు ఎక్కడికి పోయాయి అనటంతో సుమన నోట్లో ఉందని చెబుతుంది డమ్మక్క. వెంటనే సుమన నోట్లో ఉన్న నీరు కింద పారేస్తుంది. మ్యాజికులు సరే ఆ పెట్టె ఎక్కడ ఉంది అని అడుగుతుంది సుమన. నువ్వు పారేసిన నీరే చెబుతుంది అనటంతో.. ఆ నీరు జారీ ఒక కబోర్డు దగ్గరికి వెళ్తుంది. ఇక అక్కడి వెళ్లి చూడటంలో పెట్టే ఉంటుంది. కానీ అందులో మణి ఉండదు. అదే విషయం నయని అక్కడికి వచ్చి చెబుతుంది.

Also Read: Madhuranagarilo July 6th: ‘మధురానగరిలో’ సీరియల్: నెల్సన్ పై పగ తీర్చుకున్న గన్నవరం, శ్యామ్, రాధల మధ్య ఏం జరుగుతుందోనని టెన్షన్లో సంయుక్త?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ravichandran Ashwin Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
IND vs AUS 3rd Test Match: డ్రాగా ముగిసిన
డ్రాగా ముగిసిన "గబ్బా" టెస్టు - 1-1తో సిరీస్‌ సమానం- కపిల్ రికార్డు బ్రేక్ చేసిన బుమ్రా
Zika Virus In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రేవంత్ రెడ్డీ..  నీ వీపు పగలడం పక్కా..!Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ravichandran Ashwin Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
IND vs AUS 3rd Test Match: డ్రాగా ముగిసిన
డ్రాగా ముగిసిన "గబ్బా" టెస్టు - 1-1తో సిరీస్‌ సమానం- కపిల్ రికార్డు బ్రేక్ చేసిన బుమ్రా
Zika Virus In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Embed widget