Madhuranagarilo July 6th: ‘మధురానగరిలో’ సీరియల్: నెల్సన్ పై పగ తీర్చుకున్న గన్నవరం, శ్యామ్, రాధల మధ్య ఏం జరుగుతుందోనని టెన్షన్లో సంయుక్త?
గన్నవరం నెల్సన్ వీడియో అడ్డుపెట్టుకొని తనపై పగను తీర్చుకోవటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Madhuranagarilo July 6th: గన్నవరం నెల్సన్, గోపాల్ ను ఒక రెస్టారెంట్ కు బాగా తినమని ఇంటికి కూడా పార్సెల్ తీసుకెళ్లండి అని ఏమాత్రం మొహమాటం పడకండి అని అనటంతో వారిద్దరూ తెగ ఆర్డర్లు చేసి కడుపు నిండి తినేస్తారు. ఇక గన్నవరం కూడా కడుపు నిండా తిని బిల్ తెప్పిస్తాడు. ఇంకా తన దగ్గర డబ్బులు లేవని మీరే కట్టాలి అని అనటంతో వారిద్దరి షాక్ అవుతారు. నేనెందుకు కట్టాలి అని నెల్సన్ వాదించడంతో నెల్సన్ కు సంబంధించిన వీడియో చూపించి బ్లాక్ మెయిల్ అక్కడి నుంచి వెళ్తాడు. ఇక ఆ రెస్టారెంట్ వాళ్ళు వాళ్లతో పిండి రుబ్బడానికి రమ్మని అంటారు.
మరో వైపు రాధ మధుర ఇంట్లో కిచెన్ లో ఉండి మరో నాలుగు రోజులకే పెళ్లి అయిపోతుంది. అప్పటివరకు శ్యామ్ ప్రపోజల్ నుండి తప్పించుకోవాలి అని అనుకుంటుంది. అప్పుడే శ్యామ్ అక్కడికి రావడంతో ఎక్కడ అప్పుడే ఆడుకోవడం అయిపోయిందా అని పండు ఎక్కడ అని అడుగుతుంది. పండుతో నన్ను ఆడుకోడానికి తీసుకెళ్లమన్నావు అని పండు చెప్పాడు అని అనటంతో వాడు ముందు నన్నే అడిగాడు నాకు పని ఉందని నేను మిమ్మల్ని తీసుకెళ్ళమన్నాను అని కవర్ చేస్తుంది రాధ.
ఇక సరేలే అని శ్యామ్ మాట్లాడుతూ ఉండగా.. ఎక్కడ ప్రపోజ్ చేస్తాడేమో అని కాఫీ గురించి టాపిక్ తీసి కాఫీ పెట్టడానికి పాలు లేవు పౌడర్ లేదు అంటూ తెగ వాగుతూ ఉంటుంది. శ్యామ్ అక్కడే ఉన్న పాలు అవన్నీ చూపించడంతో ఇక్కడ నాకు వంట చేయడం నచ్చడం లేదు మా ఇంట్లోకి వెళ్లి చేస్తాను అని అక్కడ పండు నా పక్కనే ఉంటాడు అని అంటుంది. పండు ఆడుకుంటున్నాడు కదా నేను ఉంటానులే అనడంతో వెంటనే అతనిపై చీదరించుకొని బయటికి వెళుతుంది.
మరోవైపు సంయుక్త ఇక్కడ ఏం జరుగుతుందో అని తెగ టెన్షన్ పడుతూ కనిపిస్తుంది. ఇక శ్యామ్ రాధకు ప్రపోజ్ చేయాలనుకున్న విషయాన్ని కూడా వివరిస్తుంది. కానీ అపర్ణ రాధ ఒప్పుకోదు అని అనటంతో.. వెంటనే సంయుక్త నువ్వు అనుకున్నంత అమాయకురాలు కాదు.. తను చాలా ముదురు అని.. తననే తిట్టేసింది అని అంటుంది. ఇక వెంటనే అపర్ణ మనం భయపడాల్సింది రాధకు కాదు మధురకు అని.. శ్యామ్ రాధ ని ప్రేమిస్తున్నాడన్న విషయం తెలిస్తే వెంటనే పెళ్లి చేస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు సైలెంట్ గా ఉండటమే బెటర్ అనటంతో.. సరే అని పెళ్లయ్యాక దానిని అక్కడ నుంచి వెళ్ళగొడతాను అని అంటుంది.
ఇక రాధ ఇంట్లో వంట చేశాక అక్కడికి పండు వస్తాడు. ఇక పండు తనకు అన్నం పెట్టమని అనడంతో శ్యామ్ సార్ తో కలిసి తినమని అంటుంది. కానీ తనకి ఇప్పుడే పెట్టమని అనడంతో రాధ తినిపిస్తూ ఉంటుంది. పండుతో కలిసి తింటుంటే ప్రపోజ్ చేయటానికి వీలుండదని కావాలని ఆలస్యం చేస్తున్నాడని అనుకుంటుంది రాధ. పండు అన్నం తిన్న వెంటనే శ్యామ్ ని పిలుచుకు వస్తాను అని బయటికి వెళ్తాడు.
శ్యామ్ రావడంతో పండు ఎక్కడ అని అడుగుతుంది రాధ. పండు తినేసాడు కదా వీడియో గేమ్ ఆడుకుంటున్నాడు అని అంటాడు శ్యామ్. ఇక రాధ.. తన భోజనం బాగుందని అలాగే ప్రపోజ్ కూడా చేస్తూ ఉంటాడు అనుకోని కూరలలో ఉప్పు కారం ఎక్కువ వేస్తుంది. ఇక శ్యామ్ తినకముందే వంటలు బాగున్నాయి అని.. నువ్వు బాగా చేస్తావని మమ్మీ చెప్పింది అని పొగుడుతూ ఉంటాడు. కానీ తీరా అవి తిన్నాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆ సమయంలో రాధ వెటకారం చేస్తూ ఉంటుంది. అయినా కూడా శ్యామ్ ఇష్టంగా తింటాడు. అది చూసి రాధ తట్టుకోలేక పండు కోసం చేసిన భోజనం పెడుతుంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial