అన్వేషించండి
Advertisement
Sudheer-Rashmi: 'స్టార్ మా'లో జబర్దస్త్ జంట, 'తగ్గేదేలే' అంటున్న సుధీర్-రష్మీ
హోలీ సందర్భంగా స్టార్ మా ఛానెల్ లో ఓ స్పెషల్ ప్రోగ్రామ్ ను ప్లాన్ చేశారు. దీనికి సుధీర్-రష్మీ హోస్ట్ లుగా వ్యవహరించారు.
బుల్లితెర పాపులర్ జంట సుధీర్-రష్మీ ఇప్పటివరకు ఈటీవీ ఛానెల్స్ లోనే కనిపించేవారు. 'జబర్దస్త్', 'ఢీ' షోలతో బిజీగా గడిపేవారు. అయితే కొంతకాలంగా వీరు ఈ షోలలో కనిపించడం లేదు. మల్లెమాలతో అగ్రిమెంట్ రద్దు చేసుకొని మరో పాపులర్ ఛానెల్ స్టార్ మాలో ఎంట్రీ ఇచ్చింది ఈ జంట. వీరిద్దరూ కలిసి ఇప్పుడు హోలీ సెలబ్రేషన్స్ ను మొదలుపెట్టేశారు.
హోలీ సందర్భంగా స్టార్ మా ఛానెల్ లో ఓ స్పెషల్ ప్రోగ్రామ్ ను ప్లాన్ చేశారు. దీనికి సుధీర్-రష్మీ హోస్ట్ లుగా వ్యవహరించారు. దీనికి సంబంధించిన ప్రోమో బయటకొచ్చింది. సీరియల్స్ లో పాపులర్ అయిన కొందరు నటీనటులు ఈ ప్రోగ్రామ్ లో కనిపించనున్నారు. కమెడియన్ అవినాష్.. 'అన్నా మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ..' అంటూ డైలాగ్ చెప్పగానే సుధీర్ ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తరువాత రష్మీ కోసం ఓ పాట పాడేశాడు. దానికి ఇంప్రెస్ అయిన రష్మీ.. 'నీకు.. నీ ఫ్యూచర్ కి ఎప్పుడూ దిష్టి తగలకూడదు' అంటూ అతడికి దిష్టి చుక్క పెట్టింది. ఇక యాంకర్ రవి.. తన కూతురు వియాతో కలిసి ఓ సాంగ్ కి డాన్స్ పెర్ఫార్మ్ చేశారు. ఈ ప్రోమో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
సినిమా
న్యూస్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion