అన్వేషించండి
Advertisement
Upendra: ఉపేంద్ర పాన్ ఇండియా సినిమా, టెరిఫిక్ పోస్టర్ తో అనౌన్స్మెంట్
తాజాగా ఉపేంద్ర నుంచి ఓ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. ప్రముఖ ఆడియో లేబుల్ లహరి సంస్థ ఈ సినిమా కోసం నిర్మాణ రంగంలోకి ఎంటర్ అవుతుంది.
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సినిమాలు చేశారు. ఆయన నటించిన చాలా సినిమాలను సొంతంగా డైరెక్ట్ చేశారు కూడా. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం కేవలం నటనకు మాత్రమే పరిమితమయ్యారు. తెలుగులో ఆయన 'గని' సినిమాలో కీలకపాత్ర పోషించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉండగా.. తాజాగా ఉపేంద్ర నుంచి ఓ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. ప్రముఖ ఆడియో లేబుల్ లహరి సంస్థ ఈ సినిమా కోసం నిర్మాణ రంగంలోకి ఎంటర్ అవుతుంది. వీనస్ ఎంటర్టైనర్స్ తో కలిసి ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే ఇదొక పాన్ ఇండియా సినిమా అని తెలుస్తోంది. అంతేకాదు.. ఈ సినిమాలో ఉపేంద్ర నటించడంతో పాటు దర్శకత్వం బాధ్యతలు కూడా చేపట్టనున్నారు.
ఈ సినిమా ప్రకటనకు సంబంధించిన పోస్టర్ లో ఉపేంద్ర టెరిఫిక్ లుక్ తో కనిపిస్తున్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. అందుకే ఉపేంద్ర కూడా అదే రూట్ ఫాలో అవుతున్నారు. కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందించనున్నారు. చాలా కాలం తరువాత మళ్లీ మెగాఫోన్ పట్టుకోబోతున్నారు ఉపేంద్ర. మరి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి!
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
ఎంటర్టైన్మెంట్
తెలంగాణ
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion