అన్వేషించండి

Most Awaited Daawat Promo: ఎందుకు మాకు ఈ క్షోభ - శోభాపై యాంకర్ రవి పంచ్, టేస్టీ తేజ బట్టలపై శృతి హాసన్ కౌంటర్

Daawat Promo: బిగ్ బాస్ కంటెస్టెంట్స్, బుల్లితెర సెలబ్రిటీలు న్యూ ఇయర్‌ను చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.

దైనా పండగ వచ్చిదంటే చాలు.. బుల్లితెర నటీనటులంతా ఒక్కటయ్యి ప్రేక్షకులకు ఎంటర్‌‌టైన్మెట్ అందించే ప్రయత్నం  చేస్తారు. ఇక న్యూ ఇయర్ వేడుకలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి స్టార్ మా సిద్ధమయ్యింది. ఈసారి పోటీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కు, సీరియల్ ఆర్టిస్టులకు మధ్య జరగనుంది. యాంకర్స్‌గా రవి, వర్షిణి వ్యవహరించనున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కు సపోర్ట్‌గా రవి ఉండగా.. సీరియల్ ఆర్టిస్టులుగా వర్షిణి సపోర్ట్‌గా నిలబడింది. ఇప్పటివరకు బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్స్‌గా పాల్గొన్న ఎంతోమంది ఈ ‘మోస్ట్ అవెయిటెడ్ దావత్’ ఈవెంట్‌లో పాల్గొనగా దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. శోభా శెట్టిపై, ‘కార్తీక దీపం’ సీరియల్‌పై, ‘యానిమల్’ సినిమాపై రవి వేసిన పంచులు ప్రోమోలో హైలెట్‌గా నిలిచాయి.

బుల్లితెరతో పాటు వెండితెర ఆర్టిస్టులు

‘‘మా బిగ్ బాస్ వాళ్లతో పార్టీ మ్యాడ్‌గా ఉంటుందా లేకపోతే ఈ సీరియల్ వాళ్లతో మ్యాడ్‌గా ఉంటుందా చూద్దాం’’ అంటూ రవి చెప్పిన డైలాగ్‌తో ప్రోమో మొదలయ్యింది. ‘‘ఈ దావత్‌లో మా బిగ్ బాస్ వాళ్లు ఉంటే ఒక మాస్ ఉంటుంది’’ అని రవి అనగా.. ‘‘మా సీరియల్ వాళ్లు ఉంటే ఒక జోష్ ఉంటుంది’’ అని వర్షిణి కౌంటర్ ఇచ్చింది. ‘‘మా వాళ్లు ఉంటే ఫుల్ మ్యాడ్‌గా ఉంటుంది’’ అని రవి అంటే.. ‘‘మా వాళ్ల దావత్‌లో డబుల్ మ్యాడ్ ఉండబోతుంది’’ అంటూ ఛాలెంజ్ చేసింది వర్షిణి. కేవలం బిగ్ బాస్ కంటెస్టెంట్స్, సీరియల్ ఆర్టిస్టులు మాత్రమే కాకుండా పలువురు వెండితెర సెలబ్రిటీలు కూడా ఈ ఈవెంట్‌లో సందడి చేశారు. ‘బబుల్ గమ్’ టీమ్‌తో పాటు కావ్య కళ్యాణ్‌రామ్ కూడా అందరితో ఆడిపాడింది.

మీది సీరియల్.. మాది రియల్..

ముందుగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నుంచి టేస్టీ తేజ.. ఒక కామెడీ స్కిట్‌తో వచ్చాడు. అందులో తను శోభా పబ్‌కు ఓనర్‌గా నటించాడు. వెల్‌కమ్ టు పబ్ అని చెప్పగానే.. ‘‘ఏం పబ్ రా.. బౌన్సర్లే వచ్చి హాయ్ చెప్తున్నారు. అర్జెంట్‌గా వెళ్లి ఓనర్‌ను పిలుచుకొని రాపో’’ అంటూ తనపై కౌంటర్ వేశాడు రవి. అయితే తానే ఓనర్ అని, తన పబ్ పేరు శోభా పబ్ అని చెప్పాడు తేజ. ‘‘ఎందుకు రా మాకు ఈ క్షోభా’’ అని మరో కౌంటర్ వేశాడు రవి. ‘‘పార్టీ అయ్యేలోపల అవినాష్.. ఏ అమ్మాయిని గెలకకుండా ఉంటే మీ అందరికీ ఫ్రీ’’ అని ఆఫర్ ఇచ్చాడు తేజ. ఆయన గెలకకుండా ఉండలేడని ధీమా వ్యక్తం చేశాడు. ‘‘ఈవెంట్ అయిపోయేలోపు ఎవరు ఎక్కువ ఎంటర్‌టైన్ చేస్తే వారికే బిల్ ఫ్రీ’’ అని ఆఫర్ ఇచ్చాడు తేజ. ఆ తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌పై ‘బ్రహ్మముడి’ ఫేమ్ కావ్య.. ఒక పంచ్ డైలాగ్ వేసింది. దానికి భోలే కౌంటర్ ఇచ్చాడు. ‘‘మీది సీరియల్. మాది రియల్’’ అనగానే కంటెస్టెంట్స్ అంతా అరిచారు.

కార్తీక దీపం, యానిమల్ ఒక్కటి కాదు

‘కార్తీక దీపం’లోని ఒక సీన్ రీక్రియేట్ చేయమని అందరికీ ఛాలెంజ్ విసిరింది వర్షిణి. ఆ సీన్‌లో వంటలక్క.. డాక్టర్ బాబుకు ముద్దుపెడుతుంది. డైలాగ్స్ ఎవరు రీక్రియేట్ చేసినా పర్వాలేదు.. చివరి సీన్ మాత్రం తనతో చేయమనండి అంటూ తేజ లేచాడు. ‘‘అయితే శోభా ఏమయిపోవాలి’’ అంటూ కావ్య కౌంటర్ ఇచ్చింది. ముందుగా కావ్య, మానస్‌లే వచ్చి సీన్‌ను అద్భుతంగా రీక్రియేట్ చేశారు. మానస్.. అందులో జీవించేస్తూ ఉండగా.. ‘‘పెళ్లయ్యింది చాలు వదిలేయ్’’ అని అవినాష్ పంచ్ వేశాడు. ఆ తర్వాత సీన్‌ను రీక్రియేట్ చేయడానికి రోల్ రైడా, తేజస్విని వచ్చారు. వాళ్లు చాలా ఫన్నీగా యాక్ట్ చేయగా.. రవి వచ్చి ‘‘కార్తీక దీపానికి, యానిమల్‌కు చాలా తేడా ఉంది. రెండు వేర్వేరు’’ అంటూ క్లారిటీ ఇచ్చాడు.

తేజపై శృతి హాసన్ సెటైర్

ఆ తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్, సీరియల్ ఆర్టిస్టుల మధ్య నవరసాలపై పోటీ జరిగింది. అందులో భోలే షావలి, అశ్విని శ్రీ ఎక్స్‌ప్రెషన్స్ అందరినీ ఎంటర్‌టైన్ చేశాయి. ఈ ఈవెంట్‌లో పాల్గొనడానికి శృతి హాసన్ కూడా వచ్చినట్టు ప్రోమోలో చూపించారు. వచ్చిన వెంటనే ‘‘2024 అద్భుతంగా ఉండబోతుంది’’ అంటూ అందరినీ మోటివేట్ చేసింది. ఆ తర్వాత శృతి హాసన్, వర్షిణిలకు ఒక టాస్క్ ఇచ్చాడు రవి. ‘‘ఇద్దరు అమ్మాయిలు పార్టీలో ఉన్నారు, ఒక అందమైన అబ్బాయి నడుచుకుంటూ వెళ్తున్నాడు. వాడి గురించి ఎలా కామెంట్స్ చేస్తారో చూద్దాం’’ అంటూ అందమైన అబ్బాయి పాత్ర పోషించడానికి తేజను పిలిచాడు. తేజను చూసిన శృతి.. ‘‘రొంబ అందం’’ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది. ఆ తర్వాత తన డ్రెస్‌పై కామెంట్ చేసింది. దీంతో అందరూ నవ్వుకున్నారు.

Also Read: వద్దంటే మళ్లొచ్చాడు - పల్లవి ప్రశాంత్‌ను అందుకే అరెస్ట్ చేశారా? ఆ రోజు ఏం జరిగింది?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget