Krishnamma kalipindi iddarini June 27th: ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయడానికి ప్లాన్ వేసిన సౌదామిని-పెద్ద షాక్ ఇచ్చిన దుర్గాభవాని?
సౌదామిని దుర్గ భవానికి డబ్బులు ఇచ్చి ఎంగేజ్మెంట్ జరగకుండా చేయమని చెప్పటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Krishnamma kalipindi iddarini June 27th: ఈశ్వర్, గౌరీ కృష్ణమ్మ నది దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇక ఏ ఆడపిల్ల అయినా అత్తారింటికి వెళ్ళాక తన కన్నీటిని భర్త తుడువాలని అనుకుంటుందని.. ఆ విషయంలో మీరు కూడా నన్ను బాగా చూసుకుంటారు అని నమ్మకం అని అంటుంది గౌరీ. ఇక ఈశ్వర్ కూడా మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడే మీతో జీవితం పంచుకోవాలని అనుకున్నాను అని అది నిజమైపోయింది అని అంటాడు.
ఇక పెళ్లి తర్వాత తమ మధ్య అపర్థాలు, గొడవలు రావద్దని అంటాడు. అంతేకాకుండా విడిపోయే పరిస్థితి కూడా రావద్దు అని అనటంతో గౌరీ.. ఆ పరిస్థితి అసలు రాదు అని అంటుంది. మరోవైపు సౌదామిని భవానిని ఒకచోట కలిసి రేపు మీ ఇద్దరి కూతురు ఎంగేజ్మెంట్ జరగదు అని అంటుంది. దాంతో భవాని కోపంగా కనిపిస్తుంది.
నా కూతురుకి ఆదిత్యతో ఇచ్చి పెళ్లి చేయటానికి అమెరికా నుంచి వచ్చాము అని.. అటువంటిది నువ్వు ఎలా నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తావు అని అంటుంది. రేపు కానీ ఎంగేజ్మెంట్ జరుగుతే మీ కుటుంబంలో ఎవరిని బతకనివ్వను అంటూ డబ్బు బ్యాగు చూపిస్తుంది. దాంతో భవాని ఆ డబ్బులు తీసుకొని సంతోషంగా అక్కడినుంచి వెళ్తుంది.
ఇక ఇంట్లో సునంద తన ఇద్దరు కొడుకులకు అన్నం తినిపిస్తూ కనిపిస్తుంది. ఇక ఈశ్వర్ తో నీ జీవితంలోకి గౌరీ వస్తున్నందుకు సంతోషంగా ఉంది అని చెబుతుంది. ఈశ్వర్ కూడా అంతే సంతోషంగా ఉంటాడు. తమ్ముడి విషయంలో కూడా ఎందుకు అంత తొందరగా నిర్ణయం తీసుకున్నావు అని అనటంతో.. వాడు నీ పెళ్లి కోసమే అటువంటి నిర్ణయం తీసుకున్నాడు అని మనసులో అనుకుంటుంది సునంద.
రేపు జరగబోయే ఎంగేజ్మెంట్ గురించి కూడా సంతోషంగా మాట్లాడుతూ కనిపిస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఎంగేజ్మెంట్ వేడుకలు జరుగుతూ ఉంటాయి. సునంద హడావుడిగా కనిపిస్తూ ఉంటుంది. ఇక అన్ని పనులు పూర్తయినట్లేనా అని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే తన భర్త ఎంగేజ్మెంట్ రింగ్స్ కూడా తీసుకురావడంతో వాటిని చూసి మురిసిపోతుంది.
అప్పుడే ఆదిత్య, ఈశ్వర్ లు అక్కడికి రావడంతో ఇంకా రెడీ కాలేదా అని అంటుంది సునంద. వెంటనే వెళ్లి రెడీ అవ్వండి గౌరీ వాళ్ళ కోసం కారు పంపించాము వాళ్ళు వస్తున్నారు అని అంటుంది. ఇక సౌదామిని ఈ ఎంగేజ్మెంట్ జరగదు అని తన కూతురితో చెబుతుంది. భవానికి డబ్బు ఆశ చూపించాను అని చెబుతుంది. అయితే అదే సమయంలో భవాని ఫ్యామిలీ కార్ లో వస్తారు.
ఆనందయ్య ఆ ఇల్లు చూసి ఆశ్చర్యపోతాడు. అఖిల ఆ ఇంటి కోడల్ని అవుతున్న అంటూ తెగ సంబరపడిపోతుంది. ఇక వెంటనే సౌదామినికి వీళ్లు వచ్చిన విషయం తెలియటంతో కోపంతో రగిలిపోతుంది. అప్పుడే సునంద ఫ్యామిలీ బయటికి వచ్చి వాళ్ళని పలకరిస్తారు. ఇక సునంద గౌరీని మెచ్చుకుంటూ ఉండటంతో అఖిలకు బాగా కోపం వస్తుంది. ఈ ఇంటికి నేనొక్కదాన్ని కోడల్ని అవుతే బాగుండు అని అనుకుంటుంది. ఇక కోపంతో ఉన్న సౌదామిని ముఖం చూసి భవాని భయపడుతుంది. నిశ్చితార్థం అయ్యేవరకు తన కంట పడొద్దు అని అనుకుంటుంది.