అన్వేషించండి

Rangula Ratnam June 30th: సిద్దును వదిలేసిన స్వప్న.. ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతున్న వర్ష?

రేఖ ఇంటి నుండి గెంటేయటంతో సిద్దు, స్వప్న రోడ్డున పడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Rangula Ratnam June 30th: వర్ష తన అత్తమామలతో కలిసి గుడికి రాగా.. అక్కడ తన వర్షచే పిల్లలు పుట్టడానికి ముడుపు కట్టిస్తుంది. వర్షను ముడుపు కట్టమని చెప్పి తాము ఒకచోట కూర్చొని విశ్రాంతి తీసుకుంటారు. ఇక వర్ష వెళ్తుండగా అప్పుడే వర్షను చూసే డాక్టర్ దేవికరాణి ఎదురుపడి హాస్పిటల్ కి ఎందుకు రావట్లేదు అని అడుగుతుంది. దాంతో వర్ష తన అత్తమామలు ఎక్కడ చూస్తారో అని ఆమె నుండి తప్పించుకుందామని అనుకోగా అప్పుడే తన అత్తమామలు అక్కడికి వచ్చి ఎవరు అని అడుగుతుంది.

తను వర్ష ను చూసే డాక్టర్ అని చెబుతుంది. అప్పుడే వాళ్ళు వర్షను ముడుపు కట్టేటప్పుడు ఆగకూడదు అని పంపిస్తారు. ఇక వర్ష ముడుపు కట్టడానికి చెట్టు దగ్గరికి వెళ్లి తనకు పిల్లలు కారని తెలుసు అని.. కానీ తన అత్తమామలకు తన ఆరోగ్యం గురించి నిజం తెలువకుండా చేయాలి అని దండం పెట్టుకుంటుంది. ఇక డాక్టర్ వాళ్లతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక వర్ష తన పని అయిపోయిందని అత్తమామలకు నిజం తెలిసింది అని అనుకుంటుంది.

ఆ తర్వాత అత్తమామలు తన దగ్గరికి వచ్చి మాకు డాక్టర్ అన్ని విషయాలు చెప్పింది అని కాసేపు భయపడిస్తుంటారు. దాంతో నిజం తెలిసింది ఏమో అని కంగారుపడుతుంది వర్ష. కానీ డాక్టర్ వాళ్లకు వర్ష ప్రెగ్నెంట్ గురించి తన దగ్గరికి వచ్చిందని అన్నదని చెబుతారు. ఇప్పుడు కాకపోతే మరో రెండేళ్ల తర్వాత అయినా  పిల్లలను కనమ్మ మా కోసం ఇబ్బంది పడొద్దు అని చెప్పి ధైర్యం ఇస్తుంది.

దాంతో తన అత్తను పట్టుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది వర్ష. డాక్టర్ దేవిక వర్షని చూసి నవ్వుతుండగా వర్ష తనకు దండం పెడుతుంది. మరోవైపు హాస్పిటల్ లో డాక్టరమ్మ దగ్గరికి వచ్చిన పూర్ణ చాలా బాధతో ఉంటుంది. అప్పుడే నేను చనిపోతే ఇటువంటి సమస్యలు రాకపోయేవేమో అంటూ చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక డాక్టరమ్మ అవేవీ పట్టించుకోవదని ధైర్యం ఇస్తూ ఉంటుంది.

మరోవైపు శంకర్ ప్రసాద్ ఉన్న హాస్పిటల్ కి వస్తారు సిద్దు, స్వప్న. ఇక స్వప్న ఇప్పుడు మామయ్య మనల్ని దగ్గరికి తీసుకుంటారా అంటూ అనుమానంతో అడుగుతుంది. ఆ తర్వాత సిద్దు తన తండ్రిని దూరంగా చూస్తూ బాధపడతాడు. ఇక శంకర్ ప్రసాద్ వాటర్ బాటిల్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండగా వెంటనే సిద్దు వెళ్లి బాటిల్ అందిస్తాడు. దాంతో ప్రసాద్ థాంక్స్ అండి ఎవరండీ మీరు అని అడగటంతో సిద్దు ఏమి చెప్పకుండా మౌనంగా ఉంటాడు.

అప్పుడే ప్రసాద్ పావనిని పిలవడంతో సిద్దు అక్కడి నుంచి వెళ్తాడు. ఇక సిద్దు స్వప్నతో మాట్లాడుతూ.. తన డాడీకి ఈ పరిస్థితి వచ్చినందుకు బాధపడతాడు. తన డాడీ తనని ఎప్పుడు బాధ పెట్టలేదు అని.. తన మంచి కోసమే చూసేవాడు అని.. కష్టం అనేది ఎలా ఉంటుందో చూపించలేదు అని జ్ఞానోదయం కలిగినట్టు మాట్లాడుతాడు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్తూ ఉంటారు.

ఇక సప్న తనకు కాళ్ళు నొప్పి వస్తున్నాయని ఇక రాలేను అని.. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాము అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. ఇక సిద్దు గమ్యం దొరికే వరకు వెళ్దాము అని అంటాడు. ఇక తనకు అంత ఓపిక లేదు అని అనటంతో మళ్లీ సిద్ధూ తన తండ్రి గురించి చెప్పుకుంటూ బాధపడతాడు. అంతేకాకుండా తన అన్నయ్య రఘు గురించి కూడా మాట్లాడి బాధపడుతుంటాడు.

సప్న మాత్రం ఆ మాటలన్నీ వినిపించుకోకుండా తన పుట్టింటికి వెళ్దాము అని అంటుంది. సిద్దు మాత్రం ఆ ఇంటికి నేను అస్సలు రాలేను అనటంతో స్వప్న సిద్ధుని అక్కడి నుంచి వదిలేసి తల్లిగారింటికి వెళ్తుంది. ఇక సిద్దు ఎంత పిలిచినా కూడా వినిపించుకోదు. తరువాయి భాగంలో వర్ష ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఇక ఆకాష్ హాస్పిటల్ కి తీసుకెళ్లగా డాక్టర్ తనతో కాపాడాలని ప్రయత్నించాను అనటంతో ఆకాష్ బాధపడుతూ కనిపిస్తాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
'28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
Embed widget