Seethe Ramudi Katnam Serial Today November 7th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: విద్యాదేవినే సుమతి అని తెలుసుకున్న మహాలక్ష్మీ.. సీతకు అపశకునం.. విద్యాదేవి సంతోషం ఆవిరేనా!
Seethe Ramudi Katnam Today Episode విద్యాదేవి సుమతి ఒకరే అని మహాలక్ష్మీకి తెలియడం, విద్యాదేవి ఇంట్లో వాళ్లకి విషయం చెప్పాలని బయల్దేరడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Serial Today Episode సుమతికి పిల్లల మీద ప్రేమ ఉండి ఉంటే ఎప్పుడో వచ్చుండేదని అర్చన అంటుంది. కట్టుకున్న వాడినే పట్టించుకోని సుమతి వదిన కూతురి పెళ్లి కోసం రాదని గిరిధర్ అంటాడు. ప్రీతి పెళ్లి కంటే సుమతికి ముఖ్యమైనది ఏం ఉందని మహాలక్ష్మీ అంటుంది.
ప్రీతి: నిజంగా అమ్మనా పెళ్లికి రాకపోతే అదే పీటల మీద ఆత్మహత్య చేసుకొని చనిపోతాను. నా నిర్ణయంలో ఏ మార్పు ఉండదు.
మహాలక్ష్మీ: ఈ యాడ్ ఇచ్చి ఏదో పిచ్చి ప్రయత్నం చేశావు కదా సీత నీ వల్ల ప్రీతి సూసైడ్ చేసుకోవాలి అనుకుంటుంది. పెళ్లికి సుమతి రాకపోవాలి అప్పుడు చెప్తా నీ సంగతి.
రామ్: బాధ పడకు సీత నువ్వు మంచి ప్రయత్నమే చేశావ్ అమ్మ వస్తుంది.
చలపతి: ప్రీతి బతుకు కోసం అయినా సుమతి అక్క రావాలి.
విద్యాదేవి శివకృష్ణ ఇంటికి వెళ్లి తన కోసం సీత, మహాలక్ష్మీ ప్రయత్నాలు చేస్తున్నారని యాడ్ గురించి చెప్తుంది. పెళ్లి టైంకి రాకపోతే సూసైడ్ చేసుకుంటానని ప్రీతి చెప్పిందని చెప్తుంది. నిజం చెప్పేయాలి అనుకుంటున్నానని విద్యాదేవి అంటుంది. ఈరోజే నేనే సుమతి అని చెప్పేస్తా అని విద్యాదేవి అంటుంది. శివకృష్ణ కూడా చెప్పమని మహాలక్ష్మీ సంగతి తాను చూసుకుంటానని అంటాడు. ఇన్నాళ్లు విద్యాదేవిగా బతికాను ఇప్పుడు సుమతిగా బయట పడతానని చెప్పి అన్న ఆశీర్వాదం తీసుకుంటుంది. అంతా మంచే జరుగుతుందని శివకృష్ణ సంతోష పడతాడు.
మరోవైపు సీత పూజ చేస్తుంది. అక్కడికి రామ్ వస్తాడు. అత్తమ్మ వస్తుందనే నమ్మకం ఉందని రామ్‌తో చెప్తుంది. మరోవైపు విద్యాదేవి కూడా సంతోషంగా ఇంటికి బయల్దేరుతుంది. నేను సుమతి అని తెలిస్తే అందరి రియాక్షన్ ఎలా ఉంటుందో అని అనుకుంటుంది. ఇక సీత కొబ్బరి కాయ కొడుతుంది. అది కుళ్లిపోవడంతో సీత అపశకునంలా ఫీలవుతుంది. సుమతి అత్తమ్మకు ఏమైనా ప్రమాదం రాబోతుందా అని కంగారు పడుతుంది. ఏం జరగదు అని సీతకి రామ్ ధైర్యం చెప్తాడు. మరోవైపు మహాలక్ష్మీ రామ్‌కి యాక్సిడెంట్ జరిగిన చోటుకి వచ్చి ఇక్కడే విద్యాదేవి పరిచయం అయిందని విద్యాదేవి గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇక పక్కనే ఉన్న ఓ షాప్ దగ్గరకు వెళ్లి తాను సీబీఐ అని చెప్పి యాక్సిడెంట్ రోజు సీసీ టీవీ ఫుటేజ్ చూపించమని అడుగుతుంది. ఆరోజు రామ్‌కి యాక్సిడెంట్ నుంచి సుమతి కాపాడటం చూసి షాక్ అయిపోతుంది. సుమతి ఎగిరి కరెంట్ పోల్‌కి తగిలి కాలిపోవడం చూసి బిత్తరపోతుంది.
రామ్‌ని సుమతి కాపాడితే విద్యాదేవి ఎక్కడనుంచి వచ్చిందని అసలు రామ్‌ని జాయిన్ చేసిన హాస్పిటల్‌కి వెళ్లి ఎంక్వైరీ చేస్తే విషయం తెలుస్తుందని అనుకొని హాస్పిటల్‌కి బయల్దేరుతుంది. విద్యాదేవి తన అజ్ఞాతం తొలగిపోతుందని చాలా సంతోషపడుతుంది. మహాలక్ష్మీ డాక్టర్‌ని కలుస్తుంది.ఫైర్ యాక్సిడెంట్ అయిందని రామ్, సీత కాపాడారని చెప్పి డిటైల్స్ అడుగుతుంది. ఆమె ముఖం కాలిపోతే సర్జరీ చేశానని డాక్టర్ చెప్తుంది. దాంతో మహాలక్ష్మీ సుమతి ఫొటో చూపిస్తే డాక్టర్ గుర్తుపట్టలేకపోతుంది. దాంతో విద్యాదేవి ఫొటో చూపిస్తే ఆవిడే ఈవిడ అని సర్జరీ అయిన తర్వాత ఇలా రూపం మారిపోయిందని తన గురించి అడిగినా ఎవరికీ చెప్పొద్దని మాట తీర్చుకొని వెళ్లిపోయిందని చెప్తుంది. మహాలక్ష్మీ బిత్తరపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: సత్యతో మసాజ్ చేయించుకోవాలని క్రిష్ తంటాలు.. కోడలికి షాక్ కొట్టించాలని భైరవి ప్లాన్!