అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today November 2nd: 'సీతే రాముడి కట్నం' సీరియల్: పచ్చని పొలాల్లో మల్లెపూల పందిరి.. మొత్తానికి ఒక్కటైన సీత, రామ్‌లు.. మహాకు ఊహించని షాక్!

Seethe Ramudi Katnam Today Episode ఫస్ట్‌నైట్‌ని సీత ఇంట్లో కాకుండా పొలాల్లో ప్లాన్ చేయడం ఆ విషయం తెలియని మహాలక్ష్మీ తెగ కంగారు పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode సుమతి వస్తుందనే వంకతో మహాలక్ష్మీ సీత, రామ్‌ల తొలిరేయి ఆపాలని ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే సీత, రామ్‌లను డోర్ కొట్టి లేపి పిలుస్తుంది. విద్యాదేవి వాళ్లు ఎంత చెప్పినా వినిపించుకోకుండా డోర్ కొడుతుంది. మహాలక్ష్మీ ఎంత డోర్ కొట్టినా రామ్, సీతలు డోర్ తీయరు. జనార్థన్ రామ్‌ని పిలిచి డోర్ కొట్టినా ఎవరూ తీయరు దాంతో డోర్ తీసి చూస్తే గదిలో ఎవరూ ఉండరు. అందరూ షాక్ అయిపోతారు. ఇద్దరూ ఎక్కడికి వెళ్లారా అనుకుంటారు.

ఇంతలో మహాలక్ష్మీ గదిలో వేరే డోర్ ఉండటం చూసి ఎక్కడికో వెళ్లినట్లున్నారు రామ్‌కి ఫోన్ చేయ్ అంటే రామ్ అక్కడే ఫోన్ వదిలేసి వెళ్లిపోతాడు. వాళ్లు ఎక్కడికి వెళ్లారని మహాలక్ష్మీ ఇంట్లో వాళ్లని అడుగుతారు. దానికి విద్యాదేవి ఇక్కడ ఉంటే మనం ఇబ్బంది పెడతామని ఎవరికీ తెలియని చోటులో ఏర్పాట్లు చేసుకున్నారేమో అని అంటుంది. సీన్ కట్ చేస్తే పచ్చని పంట పొలం మధ్యలో మంచం వేసి దానిని అందంగా రెడీ చేసి ఉంటుంది. సీత, రామ్‌ని అక్కడికి తీసుకెళ్తే రామ్ చూసి సర్‌ఫ్రైజ్ అవుతాడు.

ఇంట్లో అనుకున్న ప్రతీ సారి చెడిపోతుంది అని అందుకే ఇలా చేశానని అంటుంది సీత. ఇక రామ్ ఆరు బయట బాగోదేమో అంటే సీత చంద్రుడు మనం తప్ప ఎవరూ ఉండరు మామ. మన తొలిరేయి గుర్తుండిపోవాలని ఇలా చేశానని అంటుంది. ఇక రామ్ సీతని ఎత్తుకొని గిరిగిరా తిప్పి బెడ్ మీద పడుకోపెడతాడు. ఇక అర్చన ఫస్ట్ నైట్ ఆగిపోయి ఉంటుందని హ్యాపీగా ఫీలవుతుంటే మహాలక్ష్మీ నుంచి అర్చనకు మెసేజ్ వస్తుంది. విషయం తెలుస్తుంది. 

అందరం వెళ్లి వెతుకుదామని మహాలక్ష్మీ అంటే విద్యాదేవి ఆపుతుంది. వాళ్లు ఈజీగా దొరకరు దూరంగా వెళ్లుంటారు అని అంటుంది. ఇదంతా నీ ప్లాన్ లాగే ఉందని మహాలక్ష్మీ అంటే తాను అలా చేయదు అని లలిత అంటుంది. ఇక జనార్థన్‌ వెళ్లి వెతుకుదాం అంటే శివకృష్ణ వద్దని దొంగలు అనుకుంటారని అంటాడు. అందరం సుమతిని చూడటానికి వెళ్దామని హడావుడి చేస్తారు. మహాలక్ష్మీ ఏం మాట్లాడుండా సైలెంట్‌గా ఉండిపోతుంది. జనార్థన్‌ కూడా వెళ్దామని అంటాడు. ఇంతలో మళ్లీ అర్చన కాల్ చేస్తుంది. మహాలక్ష్మీ స్పీకర్ పెడుతుంది. సుమతి ఈ రోజు రావడం కుదరదు అంట తర్వాత వస్తానని చెప్పిందని మీరు మరి రావొద్దని అంటుంది. విద్యాదేవి, శివకృష్ణ, మహాలక్ష్మీ ప్లాన్ అర్థమై నవ్వుకుంటారు. ప్రీతి అమ్మ ఆశ పెట్టి ఇలా చేస్తుందని ఫీలవుతుంది. సీత రామ్‌లు మాట్లాడుకుంటూ ఒకర్ని ఒకరు ముద్దు పెట్టుకొని ఒక్కటవుతారు. 

మరోవైపు ప్రీతి తల్లి ఫొటో చూస్తూ ఏడుస్తుంది. విద్యాదేవి ప్రీతి దగ్గరకు వస్తుంది. మా అమ్మ వస్తానని ఆశపెట్టి రాకపోతే ఎంత బాధగా ఉంటుంది టీచర్ అని ఏడుస్తుంది. అమ్మ వస్తుంది కనిపించదు. ఫోన్ చేస్తుంది మాట్లాడదు. లెటర్స్ రాస్తుంది కానీ మాతో ఉండదు నేను ఏం తప్పు చేశాను టీచర్ అని ఏడుస్తుంది. పిన్నే అమ్మ అని అనుకున్న నాకు అమ్మ ఉందని తెలిసి అమ్మ కోసం చాలా ఎదురు చూస్తున్నాను అని అమ్మ చేతి గోరుముద్దలు తినాలి అనిపిస్తుంది. అమ్మ చేతిలతోనే నా పెళ్లి జరగాలి అని అంటుంది. నీ పెళ్లికి మీ అమ్మ తప్పకుండా వస్తుందని నేను మాటిస్తున్నాను అని విద్యాదేవి అంటుంది. లలిత, శివకృష్ణ కూడా వచ్చి ఈ అమ్మ చెప్పింది కదా అమ్మ తప్పకుండా వస్తుందని అంటారు. అమ్మ కోసం అయినా నేను ఈ పెళ్లి చేసుకుంటానని ప్రీతి అంటుంది. అమ్మ వస్తుంది అంటే అంత కంటే ఏం కావాలి అని అంటుంది. అమ్మకి కూడా నీ పెళ్లే ముఖ్యం ప్రీతి అని విద్యాదేవి చెప్తుంది. ఉదయం అందరూ హాల్‌లో కూర్చొని ఉంటే సీత, రామ్‌లు ఇంటికి వస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: తాత కాళ్లు పట్టుకొని మరీ గొడవ పెట్టుకున్న జ్యోత్స్న.. త్వరలోనే భార్య కోసం ఆ పని చేయనున్న కార్తీక్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget