అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Seethe Ramudi Katnam Serial Today March 8th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: అక్కని తన ఇంటి నుంచి వెళ్లిపోమన్న సీత.. మధుమితకు అండగా రామ్!

Seethe Ramudi Katnam Serial Today Episode మధుమితని తనతో పాటు వచ్చేయ్‌మని శివకృష్ణ, లలిత గొడవపట్టుకోవడం మధు రాను అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మి ఇంటికి శివకృష్ణ, అతని భార్య, సీత వస్తారు. వాళ్లని చూసి మహాలక్ష్మి ఏంటి అన్నయ్య గారు సడెన్‌గా వచ్చి సర్‌ఫ్రైజ్ ఇచ్చారని అడుగుతుంది. దానికి శివ సడెన్‌గా వచ్చి షాక్‌లు ఇవ్వడం మీకు అలవాటు మాకు కాదు అని అంటుంది. ఏమంటున్నారు అన్నయ్య గారు అని మహాలక్ష్మి అడుగుతుంది. 

శివకృష్ణ: మీరు చేసింది ఏం బాలేదు మహాలక్ష్మి గారు.. మీ లాంటి పెద్దవాళ్లు చేయాల్సిన పని పద్ధతి ఇదికాదు.
జనార్థన్: మేమేం చేశాం బావగారు మమల్ని ఎందుకు అలా అంటున్నారు. 
లలిత: చేయాల్సింది అంతా చేసి ఇప్పుడు ఇలా అడుగుతున్నారేంటి అన్నయ్య గారు. మీరు మా ఊరు వచ్చి మా మధుమితని ఇక్కడికి తీసుకొచ్చారు.
శివకృష్ణ: ఆడపిల్లకు కష్టం వస్తే తల్లిదండ్రులుగా ఆ బాధ్యత మేం తీసుకుంటాం మధ్యలో మీరు మా అమ్మాయిని తీసుకురావడం ఏంటి. 
లలిత: మీకు ఏం హక్కు ఉందని మా మధుమితని మీతో తీసుకొచ్చారు. అయినా మాకు ఒక్క విషయం అయినా చెప్పాలా లేదా..
శివకృష్ణ: మా మధుమిత విషయంలో జోక్యం చేసుకోవడానికి మీరు ఎవరు. మధు మీకు ఏమవుతుందని తీసుకొచ్చారు.
మహాలక్ష్మి: ఏంటి సీత మీ అమ్మానాన్నలను మా మీదకు యుద్ధానికి తీసుకొచ్చావా. 
సీత: మా అమ్మానాన్న మీ మీద యుద్ధానికి రాలేదు అత్తయ్య. తమ కూతురు కాపురం నిలబెట్టడానికి వచ్చారు. 
మహాలక్ష్మి: ఏ కూతురు కాపురం నిలబెట్టడానికి వచ్చారు. నీదా మీ అక్కదా.. వీళ్లని ఇక్కడికి తీసుకొచ్చే ముందు నాకు ఓ మాట చెప్పాలి అని తెలీదా నీకు.  
సీత: మా అమ్మానాన్నలను చెప్పే మీరు మా అక్కని ఇక్కడికి తీసుకొచ్చారా..
జనార్థన్: మేం మీ అక్కని ఇక్కడికి తీసుకురాలేదు సీత. మీ అక్కే మాతో వచ్చింది. 
అర్చన: మీ ఊరిలో మీ అక్కకి ఎవరూ సపోర్ట్‌ లేరని ఇక్కడికి వచ్చింది.
ప్రీతి: మధు వదిన తన ఇష్టంతో ఇక్కడికి వస్తే మీరు మా పిన్నిని తప్పు పడతారేంటి. 
సీత: మా అమ్మానాన్నలు గొడవ పడటానికి రాలేదు మా అక్కని తీసుకెళ్లడానికి వచ్చారు.
మహాలక్ష్మి: వీళ్లతో మధుమిత వెళ్లదు.
రేవతి: కూతురు కోసం వాళ్లు వచ్చారు మధ్యలో నీకు ఎందుకు వదిన.. నువ్వెందుకు జోక్యం చేసుకోవడం. 
మహాలక్ష్మి: వీళ్లు మధుమితని తమ కూతురు అని అనుకుంటే తను నాతో ఎందుకు వస్తుంది. నాతో మా ఇంటికి ఎందుకు వస్తుంది. సాయం చేయమని నన్ను ఎందుకు అడుగుతుంది. వీళ్లు పేరెంట్స్‌గా సాయం చేయలేదు కాబట్టే నాకు సాయం అడిగింది. అక్కడ ఉండలేను అని నాతో వచ్చింది.
సీత: అబద్ధం. మా అక్క ఎప్పుడూ అలా అడగదు. మీరే ఉద్దేశ పూర్వకంగా ఇక్కడికి తీసుకొచ్చారు.
శివకృష్ణ: మీరు ఏంటో మీ ఉద్దేశాలు ఏంటో మాకు తెలుసు. రిసెప్షన్ వెనుక ఉద్దేశం, పేపర్‌లో ఫొటోలు ఎలా వచ్చాయో అన్నీ మాకు అన్నీ తెలిసిపోయాయి.  
లలిత: సీతను మీరు ఎలా చూస్తున్నారో సీత వెనుక మీరేం చేస్తున్నారో మాకు తెలుసు. 
శివకృష్ణ: పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే నేను ఊరుకోను. సీతే ఈ ఇంటి కోడలు. 
మహాలక్ష్మి: ఏంటి సీత నా మీద మీ అమ్మానాన్నలకు చాలా చాడీలు చెప్పి తీసుకొచ్చినట్లు ఉన్నాయి. పాపం మీ అమ్మానాన్న నువ్వు చెప్పేవన్నీ నిజాలు అనుకుంటున్నారు.
శివకృష్ణ: అబద్దాలు చెప్పాల్సిన అవసరం నా కూతురుకి లేదు. అయినా మధుని పిలవండి తనతోనే తేల్చుకుంటా. 
మహాలక్ష్మి: అలాగే అన్నయ్య గారు మధుతోనే మాట్లాడండి.. ప్రీతి పైన గదిలో రామ్‌ అన్నయ్య మధుమిత వదిన ఉన్నారు వెళ్లి పిలుచుకొని రా.. 
రామ్‌: మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి మధుగారు నవ్వితే మీరు బాగుంటారు.
ప్రీతి: అన్నయ్య నిన్ను వదినను పిన్ని పిలుస్తుంది. శివకృష్ణ అంకుల్, లలితా ఆంటీని తీసుకొని సీత వచ్చింది. 
మధు: ఇక్కడికి మా అమ్మానాన్న వచ్చారా.. 
ప్రీతి: ఇప్పుడే వచ్చారు వదిన నిన్ను తీసుకెళ్లిపోతారు అంట.
మధు: నాకు భయంగా ఉంది రామ్‌గారు. నన్నేమంటారో.. నేను ఇక్కడికి రావడం నాన్నకి ఇష్టంలేదు. నేను ఇక్కడికి రావడం మా అమ్మానాన్నలకు తెలీదు. చెప్పకుండా వచ్చాను.
రామ్: ఏం భయం లేదు మధుగారు కింద పిన్నిఉంది  అంతా తనే చూసుకుంటుంది. మీరు ధైర్యంగా ఉండండి.. ప్రీతి నువ్వు వెళ్లు మేం వస్తాం. చూడండి.. మీ పేరెంట్స్ మీకు సెల్టర్ ఇచ్చి ఉంటే మీరు ఇక్కడికి వచ్చేవారు కాదు. సో తప్పు వాళ్లది మీరు ఇక్కడ దాక్కొంటే తప్పు మీది అవుతుంది. భయపడకుండా నాతో రండి. నేనున్నానుగా నేను చూసుకుంటా రండి.. అని మధుమిత చేయి పట్టుకొని రామ్ తీసుకెళ్తాడు. అది చూసి సీత, శివకృష్ణ , లలిత షాక్ అవుతారు. 
శివకృష్ణ: మధుని తీసుకెళ్లడానికి వచ్చాం బాబు. 
లలిత: నిన్ను తీసుకురావడానికి సీత వస్తే మనింటికి రాకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావే. 
మధు: నాకు సాయం చేయమని ఒకసారి నేను మన ఇంటికి వచ్చానమ్మా మీరు నాకు సాయం చేయను అన్నారు. 
శివకృష్ణ: అందుకని ఎవరితో పడితే వాళ్లతో ఎవరి ఇంటికి అయితే వాళ్ల ఇంటికి వచ్చేస్తావా.. 
రామ్: ఇదేం పరాయి ఇళ్లు కాదు అంకుల్.
శివకృష్ణ: మధ్యలో మీరు మాట్లాడకండి బాబు. నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావే నీ లాంటి దాన్ని ఏం చేయాలే.. అంటూ కొట్టడానికి చేయి ఎత్తితే సీత ఆపుతుంది. ఇలాంటి దాన్ని నరికి పోగులు పెట్టినా పాపం లేదు. 
లలిత: మధు మాతో చెప్పకుండా నువ్వు ఇలా రావడం తప్పు కదా ఎందుకు ఇలా చేశావే.
సీత: అమ్మానాన్నలతో వెళ్లిపో అక్క నువ్వు ఇక్కడ ఉండకూడదు. 
మధు: వీళ్లని నువ్వే తీసుకొచ్చావా సీత నన్ను తిట్టించడానికి తీసుకొచ్చావా..
రామ్: మధుమిత గారిని ఇక్కడే ఉండనివ్వండి అంకుల్ కొన్ని రోజులు ఉండి వస్తుంది. తను మీ ఊరిలో ఉంటే ఇబ్బంది పడుతుంది.
లలిత: మీకు తెలీదు బాబు ఇక్కడుంటే ఇంకా ఇబ్బందులు వస్తాయి. 
రామ్: మేమంతా ఉన్నాం కదా చూసుకుంటాం.
శివకృష్ణ: మధుకి ఇబ్బంది కాదు బాబు మధు వల్ల ఇబ్బందులు వస్తాయి. 
సీత: నిజంగా ఇక్కడేం జరుగుతుందో మీకు తెలీదు అండీ. మా అక్కని పంపించేయండి.
రామ్: నువ్వు అనసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావ్ సీత..  మీ అక్క ప్రాబ్లమ్‌ని మా పిన్ని సాల్వ్ చేస్తుంటే నువ్వు అపార్థం చేసుకుంటున్నావ్.
శివకృష్ణ: నీకు ఎవరు శత్రువులో ఎవరు నీ వాళ్లో తెలీడం లేదు మధు. మర్యాదగా వెళ్లి బ్యాగ్ తెచ్చుకో. బయల్దేరవే..
మధు: నేను రాను నాన్న. నేను ఇక్కడే ఉంటాను. 
శివకృష్ణ: ఇది నీ ఇళ్లు కాదు ఇక్కడి వాళ్లు నీ వాళ్లు కాదు ఏ హక్కుతో ఉంటావే..
మధు: హక్కుతో కాదు నాన్న హామీతో ఉంటాను. మీరు ఇవ్వని ధైర్యం నమ్మకం మహాలక్ష్మి గారు నాకు ఇచ్చారు. మీరు చేయలేని సాయం ఆవిడ నాకు చేస్తా అన్నారు. మీరు నాకు కనీసం ఓదార్చులేదు కూడా. నా భర్త నేరం చేశాడని నిందించి నన్ను నేరస్తురాలిని చేశారు. నన్ను అవమానించారు. 
సీత: ఇప్పుడు అమ్మానాన్నే నిన్ను తీసుకెళ్లడానికి వచ్చారు కదా అక్క.  
మధు: నాకు నమ్మకం లేదు సీత. నాన్న మనసు ఒకసారి ఉన్నట్లు మరోసారి ఉండదు. నాన్నకి ఆ ఇంట్లో ఎవరూ ఎదురు చెప్పలేరు. 
లలిత: నీ భర్త స్టేషన్‌లో ఉంటే నువ్వేమో ఇక్కడికి వచ్చేశావు మంచిది కాదు మధు.
రేవతి:  మీ అమ్మ చెప్పింది నిజం మధు. నువ్వు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. 

ఇక రేవతి, చలపతి మాట్లాడుతుంటే మహాలక్ష్మి వాళ్లని కోప్పడుతుంది. మధ్యలో మాట్లాడొద్దు అని అంటుంది. ఇక మధుని ఇక్కడ ఉంటావా వెళ్లిపోతావా నువ్వే తేల్చుకో అని మధుకి చెప్తుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.

Also Read: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌ మార్చి 8th: ఆర్యను షూట్ చేసిన అజయ్ – వర్థన్ ఆస్థులు దక్కించుకునేందుకు అజయ్ ప్లాన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Crime News: 'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
Embed widget