Seethe Ramudi Katnam Serial Today March 30th: వామ్మో ఇదేం ట్విస్ట్‌రా బాబు సుమతి బతికే ఉందిగా.. రామ్ తన భర్తని ఫ్రెండ్స్‌కి చెప్పిన మధు!
Seethe Ramudi Katnam Serial Today Episode మధుమిత ఫ్రెండ్స్ ఇంటికి రావడంతో మధు తన కోడలు అని రామ్ మధు భర్త అని మహాలక్ష్మి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Today Episode సుమతి కోసం శివకృష్ణ మంచి పెళ్లి సంబంధం తీసుకొని వస్తాడు. సుమతి తను ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నాను అని తననే పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. పెళ్లి అంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను అని ఇంట్లో వాళ్లి చెప్తుంది. శివకృష్ణ ఫ్యామిలీ షాక్ అవుతుంది. ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు అని శివకృష్ణ సీరియస్ అవుతాడు. సుమతిని తన తల్లి కూడా ప్రశ్నిస్తుంది. అతని కులం, గోత్రం, ఆస్తి పాస్తులు ఏంటి అని ప్రశ్నిస్తుంది.
సుమతి: నేను అదంతా చూడలేదు అమ్మ. అతను మంచి వాడు.
శివకృష్ణ: నేను అన్నీ చూసి నీకు మంచిగా సెట్ అవుతాడని ఈ సంబంధం తీసుకొచ్చాను.
సుమతి: నాకు ఎలాంటి వాడు కావాలో నాకు మాత్రమే తెలుసు అన్నయ్య.
శివకృష్ణ: అంటే మాకు తెలీదా నీకు ఏం కావాలో తెలీకుండానే పెంచామా.
లలిత: సుమతి మీ అన్నయ్య మాట విని ఈ సంబంధం చేసుకోమ్మా..
సుమతి: నన్ను క్షమించు వదిన. నాకు నచ్చిన వాడిని చేసుకుంటా. నేను అతనికి మనసు ఇచ్చాను అన్నయ్య మా ప్రేమ గొప్పది.
శివకృష్ణ: పాతికేళ్లు పెంచిన నా పెంపకం కంటే గొప్పదా నీ ప్రేమ.
సుమతి: వందేళ్ల బతుకు అన్నయ్య నా ప్రేమది.
శివకృష్ణ: నా మాట వినకపోతే నా ఇంట్లో నీకు స్థానం ఉండదు. నా మాట వినకపోతే నా ఇంటి నుంచి వెళ్లిపో..
సుమతి: ఒక్కసారి నేను ప్రేమించిన వాడిని చూస్తే నువ్వు ఇలా అనవు అన్నయ్య.
శివకృష్ణ: ఇంకొక్క క్షణం నువ్వు ఇక్కడ ఉంటే ఏం చేస్తానో నాకే తెలీదు. వెళ్లవే ఇక్కడనుంచి. నాన్న బతికి ఉంటే దీన్ని నరికి పోగులు పెట్టేవాడు. నేను దానికి ప్రేమ చూపిస్తే అది నాకు ఇలాంటి దుస్థితి తీసుకొచ్చింది. ఎవరైనా దాన్ని ఆపితే నా మీద ఒట్టు. సుమతి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది.
ప్రస్తుతం..
ఆ విషయాలను గుర్తు చేసుకొని శివకృష్ణ బాధపడతాడు. ఆవేశంలో సుమతి ఫొటో విసిరి కొడతాడు. అది వెళ్లి శివకృష్ణ తల్లికి తగులుతుంది. లలిత వాళ్లు ఆమెకు పసుపు రాస్తారు. కొడుకు చేసిన పనికి శివకృష్ణ తల్లి ఏడుస్తుంది. తన మనసును కూడా చూడటం లేదు. అని తన భర్తతో పాటు చనిపోకుండా బతికి ఉండి తప్పు చేశానని ఏడుస్తూ లోపలికి వెళ్లిపోతుంది.
మధు: తనలో తాను.. మహాలక్ష్మి గారు ఎంత మంచి వాళ్లు నాకోసం తన చేయి కాల్చుకున్నారు. సీత ఎందుకు మహాలక్ష్మి గారిని అపార్థం చేసుకుంటుంది. ఇంతలో రమ్య, సునీత, హారిక అనే మధుమిత దగ్గరకు వస్తారు. పెళ్లికి రాలేకపోయామని రిసెప్షన్ ఫొటో చూసి వచ్చామని అంటారు.
మహాలక్ష్మి బ్యాచ్ కూడా అక్కడి వస్తారు. మీ భర్త ఏం చేస్తుంటారు అని అడుగుతారు. ఇక మహాలక్ష్మి వాళ్లతో తాను మధుమిత అత్తయ్యని అని పరిచయం చేసుకుంటుంది. తన కోడల్ని చూడటానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంటుంది. ఇక మహాలక్ష్మిని మధుమిత ఫ్రెండ్స్ పొగిడేస్తారు. ఇద్దరూ అక్కాచెల్లెల్లా ఉన్నారని అంటారు. ఇక వాళ్లని లోపలికి తీసుకెళ్తారు. ఇంటిని చూసి మధు ఫ్రెండ్స్ పొగిడేస్తారు.
మహాలక్ష్మి: ఏంటి మధు కామ్‌గా ఉన్నావ్. ఇది నీ ఇళ్లు అని నువ్వు ఈ ఇంటి కోడలివని నీ ఫ్రెండ్స్ అని ధైర్యంగా చెప్పు.
అర్చన: మధు మా కోడలు అయినప్పటి నుంచి మేం చాలా హ్యాపీగా ఉన్నాం.
మహాలక్ష్మి: మధు లాంట అమ్మాయి నా కోడలిగా వస్తుంది అని నేను అనుకోలేదు.
మధుఫ్రెండ్స్: మీ ఆయన ఎక్కడ మధు.
జనార్ధన్: రామ్‌ని చూపిస్తూ.. అదిగో పైన ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. ఈ సంభాషణ అంతా సీత వింటుంది. బాధ పడుతుంది. ఇక మధు ఫ్రెండ్స్ మధు, రామ్ సూపర్ జంట అని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అంటారు. మధు ఫ్రెండ్స్ వెళ్లిపోగానే..
సీత: ఏంటి అక్కా ఇది.. ఇది నీ ఇళ్లు అని మామ నీ భర్త అని నీ ఫ్రెండ్స్‌కి చెప్తున్నావ్.
మహాలక్ష్మి: ఆ మాట మధు చెప్పలేదు నేను చెప్పాను.
సీత: ఆవిడ అలా చెప్తుంటే నువ్వు ఎందుకు కామ్‌గా ఉన్నావ్ అక్క నిజం చెప్పాలి కదా.
మహాలక్ష్మి: ఏం చెప్పాలి మధు.. పేపర్‌లో ఫొటో తప్పు అని చెప్పాలా. సూర్య జైలులో ఉన్నాడు అని చెప్పాలా..
సీత: నేను అడుగుతున్నది మిమల్ని కాదు మా అక్కని.
మధు: నా సమాధానం కూడా అదే సీత. బాధ పెట్టే నిజాలు కన్నా ఆనంద పెట్టే అబద్ధాలు మంచివి.
సీత: అంటే నువ్వు అబద్ధంలో బతకాలి అనుకుంటున్నావా..
మధు: నువ్వు అనుమానంతో బతకడం లేదా.. అందర్ని నువ్వు అపార్థం చేసుకుంటున్నావ్.
మహాలక్ష్మి: ఇప్పటి నుంచి నా మాటే మీ అక్క మాట. నేను ఏం చెప్తే తను అదే చెప్తుంది.
సీత: మా అక్కని మీరు మోసం చేస్తున్నారు.
మహాలక్ష్మి: కాదు మధుని మా ఇంటి కోడల్ని చేయబోతున్నాను. నా వాళ్లు ఇదే నిజం అనుకుంటున్నారు. ఇప్పుడు మధు తరఫు వాళ్లు అదే అనుకుంటున్నారు. త్వరలో నువ్వు కూడా మధు నాకోడలు అనుకొని ఈ ఇంటి నుంచి వెళ్లిపోతావు. రెడీగా ఉండు.
శివకృష్ణ తల్లి సుమతి ఫొటో పట్టుకొని ఏడుస్తుంది. ఇంతలో అరబిందో ఆశ్రమం దగ్గర సుమతికి ట్రీట్మెంట్ జరుతుంటుంది. 20 ఏళ్ల క్రితం ఈ ఆశ్రమం ఎదుట ఒంటి నిండా గాయాలతో పడి ఉంటే వైద్యం చేస్తున్నాను అని ఒకాయన అంటారు. మరోవైపు సీత జరిగింది చలపతి, రేవతిలకు చెప్తుంది. సీతకి వాళ్లు జాగ్రత్తలు చెప్తారు. రామ్ మధుమితలు కావాలని నీకు అన్యాయం చేయరు అని కానీ మహాలక్ష్మి చెప్తే చేయకుండా ఉండరని అంటారు. ఏదో ఒకటి చేయాలి అని సీతకు చెప్తారు. దీంతో సీత ప్లాన్ ఆలోచించాను అని మహా చేతనే తనని తన భర్త గదిలో ఉండమనేలా చేస్తాను అని సీత అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: సెట్స్‌లో విజయశాంతి అలా ఉండేవారు, కడుపు నొప్పి వచ్చినా ఫైట్స్ ఆపలేదు - కస్తూరి కామెంట్స్