Seethe Ramudi Katnam Serial Today March 20th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: అదిరిపోయిన ట్విస్ట్.. సీత ప్రెగ్నెంట్, కళ్లు తిరిగి పడిపోయిన మహాలక్ష్మి!
Seethe Ramudi Katnam Serial Today Episode: సీత, రామ్‌లు అన్యోన్యంగా లేరని మధు అందరి ముందు సీతని ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Telugu Serial Today Episode: సీత, రామ్‌లు బయటకు వెళ్తారు. ఇక సీత హనీమూన్‌కి వెళ్లాలి అంటే దానికి ఇంకా టైం ఉందని రామ్ అంటాడు. దీంతో సీత మీ పిన్ని సెలవిస్తే వెళ్తాం కదా అంటుంది సీత. దీంతో రామ్ తమ పిన్ని గురించి మాట్లాడొద్దని అంటాడు. మనం బయటకు వచ్చినట్లు మీ పిన్నికి తెలిస్తే ఎలా అని సీత అడిగితే.. పిన్నికి తెలీదు కదా అని రామ్ అంటాడు.
సీత: మీ పిన్నికి తెలుసుగా..
రామ్: ఎలా..
సీత: మీరు నన్ను ఎత్తుకొని రావడం మీ పిన్ని చూసేసింది. మీ పిన్నికి నేను చేయి ఊపి బాయ్ కూడా చెప్పాను.
రామ్: నా కొంప ముంచేశావ్ సీత. ఇంటికి వెళ్లాక పిన్ని ఏమంటుందో..
సీత: ఊరికే అన్నాను మామ మనల్ని ఎవరూ చూడలేదు.. సరదాగా అన్నాను.
రామ్: ఇంకెప్పుడు ఇలాంటి బాంబులు పేల్చకు. సరదాకి కూడా నీకు హ్యాపీగా ఉండాలి ఉని నేను నిన్ను బయటకు తీసుకొస్తే నువ్వు మాత్రం నాకు కోపం తెప్పిస్తున్నావు. ఇక రామ్ సీతకు చాలా పుల్ల ఐస్ క్రీమ్‌లు తినిపిస్తాడు.
అర్చన: నిన్న సీతకు బ్యాడ్‌టైం మహా లైఫ్‌లో మర్చిపోలేదు.
గిరిధర్: రామ్ మధుమితలు కలిసి వెళ్లారని సీత పిచ్చి ఎక్కిపోయింది.
మహాలక్ష్మి: మనసులో.. సీత రామ్‌తో బయటకు వెళ్లింది ఆ విషయం వీళ్లకు తెలీదు. ఈరోజు ఏదో విధంగా దాన్ని ఏడ్పించి నాకు నైట్ బాయ్ చెప్పినందుకు ఏడిపించాలి. ఇంతలో మధుమిత, రేవతి, చలపతిలు వస్తారు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొంటే పనిమనిషి రాజ్యానికి పిలిచిన మహాలక్ష్మి మధుమితకు వడ్డించమని చెప్తుంది.
రేవతి: నీ పెంపుడు కూతురు ప్రీతి మీద కూడా నువ్వు అంత ప్రేమ చూపించడం లేదు వదిన.
ప్రీతి: నేనేం పిన్ని పెంపుడు కూతుర్ని కాదు సొంత కూతుర్ని.
చలపతి: రేవతి గారు కూడా అదే చెప్తున్నారమ్మ నీ మీద చూపించాల్సిన ప్రేమ మీ పిన్ని మధుమిత మీద చూపిస్తుంది అని.
మహాలక్ష్మి: నోరు మూసుకొని టిఫిన్ తింటావా అన్నయ్య. లేదా లేచి వెళ్లిపోతావా..
ఇంతలో సీత వచ్చి టిఫెన్ వేసుకుంటుంది. మహాలక్ష్మి మధుతో సీక్రెట్‌గా నిన్ను నీతో చెప్పిన విషయం సీతని అడుగు అని అంటుంది.
మధు: సీత నిన్ను ఒక విషయం అడగనా.. రామ్ గారు మీరు సఖ్యతగా ఉండరు అని వీళ్లు చెప్తున్నారు. అది నిజమేనా.. మీరిద్దరు ఎప్పుడూ గొడవలు పడుతూ ఉంటారు అంట ఎందుకు.
అర్చన: ఏముంది మధు సీత ఎప్పుడు తింగరి పనులు చేస్తుంది. రామ్ తిడతాడు.
జనార్థన్: వీళ్ల పెళ్లి జరిగిన నాటి నుంచి వీళ్ల మధ్య రోజూ గొడవే అమ్మ ఒక్కరోజు ప్రశాంతంగా ఉన్నది లేదు.
గిరిధర్: అసలు భార్య భర్తల్లా వాళ్ల మధ్య అన్యోన్యతే లేదు.
మహాలక్ష్మి: చెప్పాను కదా మధు నువ్వు బాధ పడతావు అని నీకు కొన్ని విషయాలు చెప్పడం లేదు కానీ నీ చెల్లిలి కాపురం సుఖంగా లేదు. కాపురం చేసేది ఎప్పుడో పిల్లల్ని కనేది ఎప్పుడో..
మధు: ఎందుకు ఇలా చేస్తున్నావు సీత. ఇక్కడ నీకు ఏం తక్కువ అయింది. ప్రేమించే భర్త. అమ్మానాన్నల లాంటి అత్తమామలు ఫ్రెండ్లీగా ఉండు బంధువులు ఉన్నారు కదా..
రేవతి: ఇక్కడ జరిగేది ఒకటి నీకు తెలిసింది ఒకటి నీకు అర్థం కాదులే మధు.
మహాలక్ష్మి: అయితే మధుకి అర్థమయ్యేలా సీతకు చెప్పమని చెప్పు. ఏం సీత నువ్వు రామ్‌తో ప్రేమగా ఉండి ఎన్ని రోజులు అయింది. నేను చెప్పకూడదు కానీ మీ పడకలు వేరు వేరు కదా.
దీంతో సీత వాంతులు చేసుకుంటుంది. మహాలక్ష్మిలో టెన్షన్ మొదలవుతుంది. అందరూ ఏమైందా అని షాక్ అవుతారు. సీత సిగ్గుపడుతుంది. ఇక సీత తాను ప్రెగ్నెంట్ అని చెప్తుంది. రేవతి, చలపతి గుడ్ న్యూస్ చెప్పావు అని సందడి చేస్తారు. మహాలక్ష్మి బ్యాచ్ షాక్ అయిపోతారు. ఇంతలో రామ్ వస్తాడు. ఏమైంది అని రామ్ అడిగితే..
సీత: చిలిపి మీకు తెలీకుండా జరిగిందా మామ అంతా మీరే చేశారు కదా.
రామ్: సీత చెవిలో.. నేనేం చేశాను.
సీత: చిన్నగా రాత్రి నన్ను బయటకు తీసుకెళ్లారు కదా.
మహాలక్ష్మి: రామ్ సీత ఏదేదో అంటుంది.
రామ్: అంటే పిన్ని అది.. సారీ పిన్ని అనుకోకుండా చేయాల్సి వచ్చింది.
జనార్థన్: మాతో ఒక్క మాట అయినా చెప్పాలి కదా రామ్.
రామ్: చెప్పాలి అనుకున్నా కానీ అంత టైం లేకుండే నాన్న.
అర్చన: నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు రామ్.
రామ్: భర్యాభర్తలు అన్నాక ఇలాంటి చిన్న చిన్న విషయాలు జరుగుతాయి కదా పిన్ని.
గిరిధర్: ఇది చిన్న విషయమా..
రామ్: ఇంకో సారి ఇలా జరగకుండా చూసుకుంటాను. చాలా కేర్ ఫుల్‌గా ఉండాలి సీత. పద నువ్వు రూమ్‌కి వెళ్లి రెస్ట్ తీసుకుందువు గాని.
మహాలక్ష్మికి సీత ఇచ్చిన షాక్‌కు కళ్లు తిరుగుతాయి. సీత మహాలక్ష్మి మీద సెటైర్లు వేస్తుంది. ఇక రామ్ సీతని తీసుకొని గదికి వెళ్తాడు. మహాలక్ష్మి కూడా కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మహాలక్ష్మికి ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుంది. దీంతో ఇన్‌హెల్లర్ పెడతారు. అర్చన మహాని ప్రశాంతంగా ఉండమని చెప్తుంది.
మహాలక్ష్మి: ఎలా ప్రశాంతంగా ఉండమని అంటావ్ అర్చన. నేను ఆ సీతని ఏడిపిద్దాం అంటే అది నన్ను ప్రయాసపడేలా చేస్తుంది.
జనార్థన్: ఇందులో మన రామ్ తప్పు కూడా ఉంది కదా మహా. నిగ్రహంగా ఉంటాడు అనుకుంటే మన నమ్మకాన్ని ఒమ్ము చేశాడు.
గిరిధర్: ఆ సీతే మామ మామ అని రామ్‌ని ఇబ్బంది పెట్టుంటుంది.
అర్చన: మన మాట వినే రామ్ దాని మాట వినడం ఏంటి మహా.
మహాలక్ష్మి: ఇలా జరుగుతుంది అని ముందే ఊహించుంటే వాళ్లిద్దరినీ దూరం పెట్టుండేదాన్ని. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అని మహా టెన్షన్ అవుతుంది. తల పట్టుకుంటుంది.
జనార్థన్: రామ్ ఇలా చేస్తాడు అని తెలియక మధుని మన ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాం. ఇప్పుడేం చేస్తాం.
అర్చన: మధు ఇక తన చెల్లి వైపే వెళ్లిపోతుంది. సీతకు సపోర్ట్‌గా ఉంటుంది.
మహాలక్ష్మి: అలా జరగకూడదు జరగడానికి వీళ్లేదు. మధుమిత మన వైపే ఉండాలి.
గిరిధర్: ప్రెగ్నెంట్ అయిన తన చెల్లిన కాదని మన వైపు ఎందుకు వస్తుంది.
మహాలక్ష్మి: మధుమిత మన వైపే ఉండాలి.
ఇక రామ్ కూడా మహాలక్ష్మిని పట్టించుకోకుండా సీతని పట్టించుకున్నాడని అంటారు. నీకు ఇంత జరిగినా ట్యాబ్లెట్ వేసుకో అని చెప్పాడు కానీ దగ్గరకు రాలేదు అని అంటారు. దీంతో మహాలక్ష్మి తనని ఇరిటేట్ చేయొద్దని అరుస్తుంది. వెంటనే తమ డాక్టర్‌ని పిలవమని అర్చనకు చెప్తుంది. మరోవైపు సీతకు రామ్ ఐస్‌క్రీమ్‌లు ఎక్కవ తినడం వల్లే ఇలా అయిందని జాగ్రత్తలు చెప్తాడు. ఇక మధుమిత, రేవతి, చలపతిలు వచ్చి రామ్ జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.