అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today June 12th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సుమతి బతికే ఉందన్న నిజం తెలుసుకొని షాక్ అయిన మహాలక్ష్మి.. తల్లిని అవమానించిన ప్రీతి!

Seethe Ramudi Katnam Serial Today Episode శివకృష్ణ, లలితలు మధు ఇంటికి వెళ్లి సూర్య, మధులకు అప్పుగా డబ్బు ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మి ఇంటికి ప్రీతి, ఉషల ఫ్రెండ్స్ ఇద్దరు అబ్బాయిలు వస్తారు. ఇద్దరు అబ్బాయిల్లో ఒకరు ప్రీతితో క్లోజ్‌గా మాట్లాడుతూ.. మీద చేయి వేసి పక్కన కూర్చొంటాడు. అది విద్యాదేవి చూసి ఆ అబ్బాయి మీద సీరియస్ అవుతుంది. ప్రీతి మీద చేయి తీయమని అంటుంది. దూరం జరగమని కోపమవుతుంది. సంస్కారం లేదా పద్ధతులు తెలీవా అని తిడుతుంది. ఇక ప్రీతి తన కన్న తల్లి అని తెలీక విద్యాదేవిని పని మనిషి అని చెప్పి కాఫీ తీసుకురమ్మని అంటుంది. 

విద్యాదేవి కాఫీ తీసుకొని వస్తుంది. ప్రీతి సైగ చేయడంతో ఉష విద్యాదేవి నడుస్తుంటే కాలు అడ్డంగా పెట్టేస్తుంది. దీంతో విద్యాదేవి కాఫీని ప్రీతి ఫ్రెండ్ మీద పడేస్తుంది. దీంతో ఆ అబ్బాయి విద్యాదేవిని తిడతాడు. కొట్టడానికి చేయి ఎత్తుతాడు. అప్పుడే సీత వచ్చి చైతూ చేయి పట్టుకొని తిప్పేస్తుంది. దీంతో చైతు నొప్పి అని విలవిల్లాడుతాడు. విద్యాదేవికి సారీ చెప్తేనే వదులుతాను అని అంటుంది. దాంతో చైతూ క్షమాపణ చెప్తాడు. ఇంతలో మహా, అర్చనలు అక్కడికి వస్తే ప్రీతి, ఉషలు తమ ఫ్రెండ్స్‌ని అవమానించారు అని చెప్తుంది. మహాలక్ష్మి సీతని తిడుతే సీత తిరగబడుతుంది. 

మహాలక్ష్మి: అసలు ఆ పిల్లలతో నువ్వు ఎందుకు గొడవపడ్డావు. 
విద్యాదేవి: ఆ పిల్లల పద్ధతి అస్సలు బాలేదు. వాళ్లు మన ఆడపిల్లలతో అతి చనువుగా ప్రవర్తించారు. 
మహాలక్ష్మి: వాళ్లు ఎలా ప్రవర్తిస్తే నీకు ఎందుకు. ఈ కాలం పిల్లలు అలాగే ఉంటారు. అడగటానికి నువ్వు ఎవరు.
సీత: మంచి చెడు చెప్పడానికి బంధాలు ఎందుకు.
మహాలక్ష్మి: మధ్యలో నువ్వు మాట్లాడకు.
ప్రీతి: పల్లెటూరి వాళ్లకు సిటీ కల్చర్ ఏం తెలుస్తుంది పిన్ని. తెలీకపోతే ఓ మూలన కూర్చొవాలి. ఒక్క డ్యాన్స్ వేస్తే సరిపోదు. లైఫ్ స్టైల్ తెలియాలి తెలియకపోతే నోరు మూసుకొని ఉండాలి.
రామ్: స్టాపిట్ ప్రీతి. టీచర్‌ గారితో అలాగేనా మాట్లాడేది.
అర్చన: ఈవిడ గారు ఏం చేశారా తెలుసా రామ్. అనవసరంగా ఇంట్లో ఉండనిచ్చావ్.
రామ్: నేను పై నుంచి అంతా చూస్తున్నాను. ప్రీతి, ఉషలదే తప్పు. ఆ అబ్బాయి ప్రీతితో క్లోజ్‌గా మూవ్ అయితే టీచర్ తిట్టారు. టీచర్ గారు చెప్పింది రైట్. ఫ్రెండ్స్ అయినా సరే హద్దులు దాటకూడదు. 

రామ్ మాటలకు మహా హర్ట్ అయి వెళ్లిపోతుంది. ప్రీతి, ఉషల ఫ్రెండ్స్ కూడా వెళ్లిపోతారు. విద్యాదేవి కింద పడిన  కప్పులు తీసుకొని కిచెన్‌లోకి వెళ్లిపోతుంది. ప్రీతి, ఉషలకు సీత క్లాస్ ఇస్తుంది. ముందు ముందు టీచరే మిమల్ని దారిలో పెడతారు అని సీత అంటుంది. మరోవైపు మధు దగ్గరకు శివకృష్ణ, లలితలు వస్తారు. మధుకి డబ్బులు ఇస్తారు. మధు వద్దు అని చెప్తుంది. ఇక మధుని సూర్య దగ్గర ఇరికించాలి అని జలజ మధు డబ్బు తీసుకొనేలా చేస్తుంది. సరిగ్గా మధు డబ్బు తీసుకొనే టైంకి సూర్య వస్తాడు. భిక్ష తీసుకుంటున్నావా అని సీరియస్ అవుతాడు. శివకృష్ణ, లలితలతో డబ్బు తమకు వద్దని అవసరం లేదని సీరియస్ అవుతాడు. కట్నంగా తీసుకోకపోతే కనీసం అప్పుగా అయినా తీసుకోమని చెప్తారు. సూర్య ఆలోచనలో పడతాడు. అప్పుగా తీసుకోవడానికి అంగీకరిస్తాడు. ఇక మాటల్లో సుమతి ఇంటికి వచ్చిందని చెప్తారు. మధు సంతోషంగా ఫీలవుతుంది. మధు డబ్బు తీసుకుంటుంది. 

సీతని ఏం చేయలేకపోతున్నాను అని మధు కూడా బాధలో ఉందని ఏదో ఒక విధంగా మధుని తన దారిలోకి తెచ్చుకుంటేనే సీతని ఇంటి నుంచి గెంటేయొచ్చని అనుకొని మహాలక్ష్మి మధుకి కాల్ చేస్తుంది. వద్దున్న తనకి పదే పదే ఎందుకు కాల్ చేస్తున్నారా అని అనుకుంటుంది. కాల్ లిఫ్ట్ చేసి నన్ను వదిలేయండి అని మధు అంటుంది. తనతో రిలేషన్‌ను కట్ చేసుకోమని అంటుంది. మహా మధుని నచ్చచెప్తుంది. ఇక డబ్బు, నగలు, ఆస్తి ఏం కావాలి అంటే అడగమని చెప్తుంది. మధు వద్దు అనేస్తుంది. కనీసం సూర్యకి జాబ్ ఇస్తాను బిజినెస్ చేయిస్తాను అని అంటే వద్దు అనేస్తుంది. ఇక మధు తన తల్లిదండ్రులు తమ పరువు కోసం డబ్బులు ఇచ్చారని అంటుంది. ఇక తన మేనత్త సుమతి అప్పుడెప్పుడో ప్రేమ పెళ్లి చేసుకొని వెళ్లిందని తిట్టాడని ఇప్పుడు ఆవిడ తిరిగి రావడంతో దగ్గరకు తీసుకొన్నాడని చెప్తుంది. సుమతి బతికి ఉందని తెలియడంతో మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.

Also Read: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: డ్రాయింగ్ కాల్చేసిన మనోహరి, ఘోరకు అమ్మును బలి ఇస్తానన్న మనోహరి

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 18th:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
జగద్ధాత్రి సీరియల్:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
Anu Sri Raj: సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget