Seethe Ramudi Katnam Serial Today July 5th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: టీచర్ కోసం రామ్‌ని నిలదీసిన సీత ఒంటరైపోయిందిగా.. పుట్టింటికి చేరిన విద్యాదేవి!
Seethe Ramudi Katnam Serial Today Episode ఒంటరిగా ఉన్న విద్యాదేవి దగ్గరకు శివకృష్ణ వచ్చి విద్యాదేవిని ఒప్పించి తనతో పాటు వాళ్ల ఇంటికి తీసుకెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Today Episode విద్యాదేవి బస్‌స్టాండ్ దగ్గర ఉంటే శివకృష్ణ చూసి దగ్గరకు వెళ్తాడు. ఇక్కడెందుకు ఉన్నారు ఏమైందని అడుగుతాడు. దాంతో విద్యాదేవి మహాలక్ష్మి ఇంట్లో జరిగిన విషయాలు అన్నీ చెప్తుంది. ఇక ఎక్కడికి వెళ్తారు డ్రాప్ చేస్తాను అని శివకృష్ణ అడిగితే తనకు ఎవరూ లేరని ఒంటరిగా ఆలోచిస్తున్నాను ఎక్కడికి వెళ్లాలో అని అంటుంది. దాంతో శివకృష్ణ విద్యాదేవిని తన ఇంటికి రమ్మని పిలుస్తాడు. తనని అన్నయ్య అనుకోమని తన దగ్గరకు రమ్మని పిలుస్తాడు. విద్యాదేవి మనసులో ఒంటరిగా ఉన్న చెల్లికి నువ్వు తోడుగా నిలిచావా అన్నయ్య అని అనుకుంటూ శివకృష్ణతో వెళ్తుంది.
సీత, రామ్‌లు ఇంటికి వస్తారు. అందరూ హాల్‌లో ఉంటారు. ఇంత లేట్ ఎందుకు అయిందని అడిగితే షాపింగ్ అయ్యాక కాస్త తిరిగి వచ్చామ్ అని రామ్ అంటాడు. ఇక అర్చన మహాకు ఎలాంటి చీర కొన్నారో చూపించమని అంటే సీత చీర చూపిస్తుంది. అయితే అది మామూలు నేత చీర పెద్ద వాళ్లు కట్టుకునేదిలా ఉంటుంది. దాంతో మహా నేను ఇలాంటి చీర కట్టుకుంటానా నా గురించి తెలీదా అని అడుగుతుంది. రామ్ కూడా చీర చూసి షాక్ అవుతాడు. మహా కోపంతో ఆ చీరని విసిరేస్తుంది. అది సమతి ఫొటో దగ్గర పడుతుంది.
సీత: మీరు విసిరేసిన ఈ చీర మా అత్తమ్మ ఫొటో దగ్గర పడింది. ఇది కట్టుకోవడం మీకు ఇష్టం లేకపోతే ఏదో ఒక రోజు మా అత్తమ్మే కట్టుకుంటుంది అప్పటి వరకు ఈ చీర దాచి ఉంచుతాను. అవును టీచర్ కనిపించడం లేదు ఏంటి. టీచర్.. టీచర్.. సమాధానం లేదు ఏంటి.
అర్చన: ఆవిడ ఇక్కడ లేదు.
ప్రీతి: ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.
సీత: టీచర్ వెళ్లిపోయిందా.
మహాలక్ష్మి: అవును నేను పంపేశాను.
రామ్: ఎందుకు పిన్ని.
గిరిధర్: టీచర్ వల్ల ప్రీతి సూసైడ్ చేసుకోబోయింది.
మహాలక్ష్మి: ఆ టీచర్ వచ్చినప్పటి నుంచి మన ఇంటి విషయాల్లో ఓవర్ గా రియాక్ట్ అవుతుంది. ఈ రోజు అలాగే చేసింది.
అర్చన: కాస్త ఆలస్యం అయింటే ప్రీతి చనిపోయేది.
ప్రీతి: ఆ టీచర్ ఇంట్లో ఉంటే నేను నిజంగానే సూసైడ్ చేసుకునేదాన్ని.
మహాలక్ష్మి: నేను ఉండగా నీకు అంత ఖర్మ ఏంటి ప్రీతి. నాకు రామ్ నువ్వు రెండు కళ్లలాంటి వాళ్లు. మీకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు అని అనుకుంటాను. అలాంటిది ప్రీతిని ఇబ్బంది పెట్టిన ఆ విద్యాదేవిని ఎలా క్షమిస్తాను. అందుకే ఇంటి నుంచి పంపించేశాను.
సీత: ఇంత చిన్న విషయానికి టీచర్‌ని ఇంటి నుంచి పంపేశారా.
అర్చన: ఇది చిన్న విషయం ఏంటి సీత. ఆ టీచర్ వల్ల ప్రీతి చనిపోయేది. ప్రీతి ప్రాణం నీకు చిన్న విషయమా.
మహాలక్ష్మి: ఎవరో అంటే నా పిల్లలు పడాలా. నా పిల్లల జోలికి ఎవరు వచ్చినా నేను ఊరుకోను.
సీత: టీచర్ మంచి విషయమే చెప్పారు. కదా నువ్వు చెప్పు మామ మీ పిన్ని చేసింది న్యాయమేనా.
రామ్: మా పిన్ని ఏం చేసినా ఆలోచించే చేస్తుంది. నేను ఈ విషయంలో పిన్నిని తప్పు పట్టలేను.
అందరూ మహాలక్ష్మికే సపోర్ట్ చేస్తారు. మహాలక్ష్మి ఏం చేసినా తమ మంచికే చేస్తుందని అంటారు. చివరకు జనార్థన్ కూడా మహాలక్ష్మి మంచే చేస్తుందని తన మాటే మా మాట అని అంటాడు. ఇక మహాలక్ష్మి తనని కాదు అని ఇంట్లో ఎవరూ నీకు సపోర్ట్ చేయరు అని అంటుంది. ఫ్యామిలీ మొత్తం తన వైపు ఉందని నువ్వు ఏం చేయలేవు అని మహాలక్ష్మి సీతతో అంటుంది. టీచర్ ఇక ఎప్పటికి ఇంటికి తిరిగి రాదు అని అంటుంది. ఎవరు ఎన్ని చేసినా తనని తన భర్తని వేరు చేయలేరు అని సీత అంటుంది. ఇక సీత రామ్ దగ్గరకు ఆవేశంగా వెళ్లి మీ పిన్ని చేసింది తప్పు అని వాదిస్తుంది. రామ్ తన పిన్నిని సపోర్ట్ చేస్తాడు. కారణం లేకుండా తన పిన్ని ఏం చేయదని అంటాడు. ఇక సీత టీచర్‌ని మనమే ఇంటికి తీసుకొచ్చాం అని మనం మర్యాదగా పంపాలి కానీ ఇలా అవమానించి పంపకూడదు అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.