Seethe Ramudi Katnam Serial Today July 31st: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సీత తల్లిదండ్రుల్ని ఘోరంగా అవమానించి పంపేసిన జనార్థన్, మహాలక్ష్మి.. నిజం తెలుసుకున్న సీత!
Seethe Ramudi Katnam Serial Today Episode జనార్థన్‌కి లేనిపోనివి ఎక్కించి సీత తల్లిదండ్రుల్ని మహాలక్ష్మి తిట్టించి ఇంటి నుంచి పంపేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode సీత తల్లిదండ్రులు మహాలక్ష్మి ఇంటికి వస్తే జనార్థన్ వాళ్లతో గొడవ పడతాడు. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న సుమతిని అన్నగా చాలా ఇబ్బంది పెట్టావని అంటాడు. మహాలక్ష్మి జనార్థన్ వైపు మాట్లాడుతుంది. ఇక విద్యాదేవి ఆవేశంగా వచ్చి మహాలక్ష్మికి ఎదురు తిరుగుతుంది. నీకు ఏంటి సంబంధం అని అడిగితే శివకృష్ణ తన అన్నయ్య అని తాను సుమతి అని చెప్పబోతే శివకృష్ణ అడ్డుకొని తన కోసం గొడవ పడొద్దని చెప్తాడు. ఇక జనాతో సుమతి పెళ్లి చేసుకొని వెళ్లిపోయిన తర్వాత తాను చెల్లి కోసం చాలా బాధ పడ్డానని మీరే బావగారు అని తెలీదని చెప్తాడు.
శివకృష్ణ: నాలాంటి అన్నయ్య ఏ చెల్లికి ఉండకూడదని మీరు ఇందాక అన్నారు కదా బావగారు ఆ మాట నాకు నేను సుమతి దూరం అయ్యాక చాలా సార్లు అనుకున్నా. సుమతి మీద కోపం నేను మధు మీద చూపించను అన్నాను కానీ అది కోపం కాదు బావ భయం. సుమతి మిమల్ని పెళ్లి చేసుకున్న తర్వాత చాలా కాలం సుమతి కనిపించలేదు. సుమతిలా మధు పెళ్లి చేసుకోగానే తను కూడా ఎక్కడ దూరం అయిపోతుందా అని భయపడ్డాను. ఇప్పుడు ఇక్కడ సుమతి లేదు కాబట్టి మేం ఏం చెప్పినా మీరు నమ్మరు. మీరు వెళ్లిపోమని చెప్పకపోయినా మేం వెళ్లిపోతాం మా చెల్లి తిరిగి వస్తేనే ఈ ఇంటికి వస్తాం. పద లలిత.
లలిత: ఒక్క నిమిషం అండి. సుమతి మిమల్ని పెళ్లి చేసుకుందని తెలిసిన తర్వాత మొదటి సారి మీ ఇంటికి వచ్చాం అన్నయ్య. మా మేనల్లుడు రామ్, మా మేనకోడలు ప్రీతి కోసం స్వీట్స్ తీసుకొచ్చాం మేం రావడం మీకు చేదుగా ఉన్నా నోరు తీపి చేసుకోండి.
మహాలక్ష్మి: ఆగండి..రామ్ స్వీట్స్ తీసుకోబోతే మహా అడ్డుకుంటుంది. ఆ స్వీట్స్‌లో విషం కలిపి ఉంటే అవి తిని రామ్, ప్రీతిలకు ఏమైనా అయితే, సుమతినే వెళ్లగొట్టిన మీరు ఆమె పిల్లల్ని ఏమైనా చేస్తే అయినా రామ్ ప్రీతిలు ఇప్పుడు నా పిల్లలు వాళ్లు ఏం తినాలో తినకూడదో నేను డిసైడ్ చేస్తా. ప్రీతి ఆ విషాన్ని తీసుకెళ్లి బయట పడేయ్. ప్రీతి నిన్నే డూ వాట్ ఐ సే.
ప్రీతి స్వీట్స్ బయట విసిరేస్తుంది. సీత చాలా బాధపడుతుంది. మా అమ్మనాన్నలు తెచ్చిన స్వీట్స్ విసిరేస్తారా అని అంటుంది. దానికి జనార్థన్ శివకృష్ణ, లలితల్ని వెళ్లిపోమంటాడు. ఇంకెప్పుడు తన ఇంటికి రావొద్దని అంటాడు. అందరూ చాలా బాధ పడతారు. సీత తల్లిదండ్రులు బాధతో వెళ్లిపోతారు. వాళ్ల వెనకాలే సీత, రామ్, విద్యాదేవిలు వస్తారు. సీత, రామ్‌లు సారీ చెప్తారు. సుమతి కనిపించకుండా పోవడం వల్ల ఇదంతా జరిగిందని అంటాడు శివకృష్ణ. ఇక మహాలక్ష్మి జనార్థన్‌తో సీత తల్లిదండ్రులతో భలే మాట్లాడావని చెప్తుంది. జనార్థన్, మహాలక్ష్మిలు మాట్లాడుకోవడం సీత వింటుంది.
ఇక జనార్థన్‌కి మహాలక్ష్మి సుమతిని శివకృష్ణ కొట్టి తిట్టి అవమానించి ఇంటి నుంచి పంపేసినట్లు శివకృష్ణ బ్యాడ్ అని జనాకి మహా చెప్తుంది. మహాలక్ష్మి మాటల్ని జనార్థన్ పూర్తిగా నమ్మేశాడని సీత అనుకుంటుంది. ఇక మహాలక్ష్మి సుమతి చివరి సారిగా శివకృష్ణ ఇంటికి వెళ్లింది కాబట్టి తానే సుమతిని ఏమైనా చేసుంటాడని భర్తకి ఎక్కిస్తుంది. దానికి ఆవేశంతో జనార్థన్ అదే నిజం అయితే శివని చంపేస్తానని అంటాడు. మరోవైపు మధు జలజ అక్క మహాలక్ష్మి మనిషా తనని ఇరికించాలని చూస్తుందా అనుకుంటుంది. ఇక జలజ బట్టలు తానే ఉతికి మడతపెట్టాల్సి వస్తుందని తాను అసలు జలజకు తోటికోడలినో పని మనిషినో తెలీడం లేదని మధు అనుకుంటూ బట్టలు జలజ బీరువాలో పెట్టడానికి వెళ్తుంది. అక్కడ జలజ బట్టల్లో మహా లక్ష్మి బంగారు నగ చూస్తుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్రకు బురిడీ కొట్టించిన సంయుక్త.. మిత్ర నోట లక్ష్మీ మాట!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

