Seethe Ramudi Katnam Serial Today July 27th; 'సీతే రాముడి కట్నం' సీరియల్: పోలీస్ ఆఫీసర్‌గా ఎంట్రీ ఇచ్చిన సీత.. మహాలక్ష్మికి నెల రోజులు గడువు!
Seethe Ramudi Katnam Serial Today Episode కిరణ్, రేవతిల పెళ్లి చేయడానికి సీత ఇంట్లో వాళ్లకి నెల రోజుల గడువు ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Today Episode కిరణ్, రేవతిలకు పెళ్లి చేస్తానని సీత తాళి బొట్టు పట్టుకొని వస్తుంది. మహాలక్ష్మీ జనార్థన్‌తో సీత తన ఇష్టానికి ప్రవర్తిస్తుందని నువ్వేమీ అనవా అని అడుగుతుంది. పెళ్లి జరగకూడదని జనార్థన్ సీతతో చెప్తాడు. కిరణ్ గారు రేవతి పిన్నిని లేపుకెళ్లకుండా మీ మాట కోసం ఆగి డబ్బు సంపాదించుకొని వచ్చారని అంటుంది.
సీత: మీ మాట కోసం వీళ్లు ఇంత నిజాయితీగా ఉంటే మీరు వాళ్లని విడదీయాలి అనుకోవడం న్యాయమేనా. మీరు ఇంకా వీళ్లని దూరం చేయాలి అనుకుంటున్నారు. మీరు మనుషుల్ని దూరం చేయగలరు కానీ మనసుల్ని కాదు. మీ కళ్ల ముందే వీళ్ల పెళ్లి చేస్తాను. ఎవరు ఆపుతారో చూస్తాను. మీకు ఏం అభ్యంతరం లేదు కదా. రేవతి కిరణ్‌లు తమకు ఏ అభ్యంతరం లేదని అంటారు. సీత కిరణ్‌కి తాళి ఇచ్చి కట్టమని చెప్తుంది. క్షమించండి కిరణ్ గారు మీ పెళ్లి ఇక్కడ జరగడం లేదు. చూశారు కదా వీళ్లు ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు. అది మీకు చెప్పాలనే ఇలా చేశాను. ఈ క్షణం తాళి ఇచ్చేస్తే వీళ్ల పెళ్లి జరిగిపోతుంది. మా అత్తమ్మ ఉండి ఉంటే అంగరంగ వైభవంగా జరిపించేది. ఇప్పుడు అత్తమ్మ లేకపోయినా రేవతి పిన్ని పెళ్లి అలా జరగాలి అని కోరిక. ఆమె మేనకోడలిగా నేను ఈ పెళ్లి చేస్తాను.
జనార్థన్: పెళ్లి జరగదు సీత. నువ్వు బెదిరిస్తే బెదిరిపోను. మమల్ని ఇప్పుడు సైలెంట్‌గా ఉంటాం అనుకున్నావా ఈ పెళ్లి జరగనివ్వం.
గిరిధర్: మమల్ని కాదు అని ఈ పెళ్లి చేస్తే ఊరుకోం.
సీత: మీకు ఒక్క నెల టైం ఇస్తున్నాం ఈలోపు మీరు ఒకే అంటే మీ చేతుల మీద ఈ పెళ్లి జరుగుతుంది. మీరు కాదు అన్నా మీ చేతుల మీదే పెళ్లి జరుగుతుంది. ఇదే నా శపథం.
చలపతి: ఇంత కచ్చితంగా చెప్తుంది అంటే సీతే గెలుస్తుంది
మహాలక్ష్మి: ఎలా గెలుస్తుందో మేం చూస్తాం.
కిరణ్, రేవతిలు సీతకు థ్యాంక్స్ చెప్తారు. విద్యాదేవి సీతని పొగుడుతుంది. ఇక విద్యాదేవి తను నా మేనకోడలు అని అంటుంది. మీ మేనకోడలా అని చలపతి అడిగితే విద్యాదేవి కవర్ చేస్తుంది. సీత ఛాలెంజ్‌కి మహాలక్ష్మి రగిలిపోతుంది. తనని కాదని సీత ఎలా పెళ్లి చేస్తుందని అనుకుంటుంది. ఇంతలో సీత వచ్చి తాను ఇచ్చిన షాక్‌కి నిద్ర పట్టడం లేదా అని అంటుంది. ప్రేమించిన వారిని విడగొట్టడం పెళ్లయిన జంటని విడగొట్టడం తప్ప మీకు వేరే పని లేదా అని అంటుంది. అది మీకు జబ్బులా ఉందని ఎవరికైనా చూపించుకోమని అంటుంది. తనతో పెట్టుకోవద్దని మహాలక్ష్మి అంటుంది. మీ గురించి నాకు మొత్తం తెలుసని సీత అంటే నా గురించి నీకు తెలీదే నా విశ్వరూపం నీకు తెలీదని నీ చావు దగ్గర పడిందని అప్పుడు నా అసలు రూపం నీకు తెలుస్తుందని మహాలక్ష్మి అంటుంది. ఇక సుమతి హత్య వెనకు మీరు ఉన్నారని డౌట్ అని ఆ విషయం తేల్చి జైలు పాలు చేస్తానని అంటుంది.
ఉదయం పోలీస్ కారు మహాలక్ష్మి ఇంటి ముందు వచ్చి ఆగుతుంది. సాంబ మహాలక్ష్మికి విషయం చెప్తాడు. సీత చెప్పిన విషయం గుర్తు చేసుకొని మహాలక్ష్మి వణికిపోతుంది. అందరూ వస్తే అర్చన మన ఇంటికి ఎవరో పోలీస్ వచ్చారని చెప్తుంది. ఇంతలో సీత పోలీస్ ఆఫీసర్‌గా ఎంట్రీ ఇస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.