అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today July 20th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సుమతి తన మేనత్తని చెప్పిన సీత.. నోట మాట రాక కుప్పకూలిపోయిన మహాలక్ష్మి!

Seethe Ramudi Katnam Serial Today Episode సుమతి తన మేనత్తని రామ్, ప్రీతిలు తన అత్త పిల్లలని సీత మహాలక్ష్మి ఇంట్లో అందరికీ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode నిజం తెలుసుకున్న సీత, రామ్‌లు పరుగున మధు దగ్గరికి వచ్చి రామ్ మన బావ అని మేనత్త సుమతి కొడుకు అని సీత మధుతో చెప్తుంది. మధు షాక్ అవుతుంది. నమ్మలేకపోతున్నాను అని అంటుంది. రామ్ మనకు బావ అవుతాడని చెప్తుంది. ఇక సూర్య గురించి అడుగుతుంది. సూర్య లేడని పక్క ఊరికి వెళ్లాడని చెప్తుంది. సూర్యకి తెలిస్తే కుళ్లుతో చస్తాడని మధు మనసులో అనుకుంటుంది. మధు తన జీవితంలో సుఖం సంతోషం లేదని బాధ పడుతుంది. ఇక సీత మధు ఎదురుగానే రామ్‌తో సరసాలాడుతుంది. మధు ఇబ్బంది పడినట్లు గొంతు సవరిస్తుంది. సీత వాళ్లు వెళ్తామని బయల్దేరుతారు. 

మహాలక్ష్మి ఇంటి బయట గన్ పట్టుకొని తిరుగుతుంటుంది. అందరూ షాక్ అయి నిల్చొంటారు. మహాలక్ష్మి రామ్, సీతలను షూట్ చేస్తానని అంటుంది. చిన్న విషయానికి ఎందుకు అంత హడావుడి అని విద్యాదేవి అంటుంది. రామ్ ఇది వరకు తనకు చెప్పకుండా ఒక్క పని చేసేవాడు కాదని ఇప్పుడు సీత రామ్‌ని మార్చేసిందని మహాలక్ష్మి అంటుంది. ఇక గిరిధర్, అర్చన, ప్రీతి ఇలా అందరూ రామ్ తప్పు దోవలో వెళ్తున్నాడని అంటారు. జనార్థన్‌ కూడా తాను మహాలక్ష్మికే సపోర్ట్ చేస్తున్నానని రామ్ సీత మాట వింటూ చెడిపోయాడని అంటారు. 

విద్యాదేవి: సీత రామ్‌లకు పెళ్లి అయింది. రామ్ సీతతో కాక మీతో ఉండాలి అనుకోవడం పట్టుపట్టడం తప్పు. 
మహాలక్ష్మి: మా ఇంట్లో నేను చెప్పిందే ఒప్పు రామ్ మాతో ఉండాలి. 
రేవతి: మరి మా అన్నయ్య నీతో ఎందుకు ఉన్నాడు వదినా. గిరిధర్ అన్నయ్య కూడా అర్చన వదినతోనే ఉన్నాడు కదా.  
చలపతి: మీరు మీ ఆవిడలతో కలిసి ఉండి వాళ్ల మాటలు వినాలి రామ్ మాత్రం వినకూడదా.
విద్యాదేవి: అడుగుతున్నారు కదా మీ భార్య మాట గుడ్డిగా వినకుండా న్యాయంగా మాట్లాడండి. మీరు మీ తమ్ముడు మీ భార్యల మాట వినిటప్పుడు రామ్ ఎందుకు సీత మాట వినకూడదు. 
మహాలక్ష్మి: ఇది నా ఇళ్లు అని మీరు మర్చిపోయినట్లు ఉన్నారు. ఇక్కడ నా మాటే వేదం.
విద్యాదేవి: ఇది మీ ఇళ్లు కాదు. సుమతి ఇళ్లు ఆవిడ తర్వాతే మీకు ఈ స్థానం దక్కింది. అలాంటి సుమతిని పక్కన పెట్టేశారు. 
మహాలక్ష్మి: మీరు ఈ ఇంటికి గెస్ట్ మాత్రమే. అది గుర్తు పెట్టుకొని ప్రవర్తించండి.

ఇంతలో సీత, రామ్‌లు వస్తారు. మహాలక్ష్మి చేతిలో గన్ చూసి రామ్ భయపడతాడు. అసలు విషయం చెప్తా అంటే సీత వద్దని తాను చూసుకుంటా అంటుంది. సీత మహాలక్ష్మి మీద సెటైర్లు వేస్తుంది. దాంతో మహాలక్ష్మి సీతకు గన్ గురి పెడుతుంది. అందరూ సీతని తలా ఒక మాట అంటారు. అత్తయ్యని మీరు క్షమించినట్లు ఏ భర్త తన భార్యని క్షమించడని జనార్థన్‌ని సీత అంటుంది. దాంతో రామ్ ఇక చాలు ఆపు అని అరుస్తూ వస్తాడు. సీత రామ్‌ని ఆపేస్తుంది. అందరూ సీతని కాల్చేయమని అంటారు. సీత బాలయ్య బాబులా పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్తుంది. సీత ఓవర్ యాక్షన్‌కి రామ్ వాటర్ తీసుకొచ్చి ఇస్తాడు. కామెడీ చేస్తావా అంటూ సీతని కాల్చాలని మహాలక్ష్మి గన్ పెడితే రామ్ ఎదురు వస్తాడు. దాంతో మహాలక్ష్మి రామ్ తప్పుకో లేదంటే ఇందులో ఉన్న తూటా మీ ఇద్దరిని తాకుతుందని అంటుంది. ఇక సీత వచ్చి ఇద్దర్ని కాల్చండని మహాలక్ష్మిని రెచ్చగొడుతుంది. ఇక సీత రామ్ తనకు పుట్టుకతోనే సొంతం అని రామ్ తన మేనత్త సుమతి కొడుకని చెప్తుంది. మహా కళ్లలో అగ్నిపర్వతం పేలుతుంది. జనార్థన్ ముందుకు రావడంతో సుమతి తన తండ్రి చెల్లి అని సీత రామ్‌లు చెప్తుంది. సీత ఈ విషయం తెలిసి తనని మామయ్య ఇంటికి తీసుకెళ్లిందని రామ్ అంటాడు. మహాలక్ష్మీ షాక్ అయిపోగా విద్యాదేవి సంతోషంతో పొంగిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: తల్లి పుట్టింటి గురించి తెలుసుకున్న రామ్.. అమ్మమ్మ, మామలను పట్టుకొని ఎమోషనల్..!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Embed widget