అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today July 12th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: ఆ ఊర్లో కూడా సీత, రామ్‌లు కలవకుండా ఆపేసిన మధు.. దట్ ఈజ్ మహాలక్ష్మి!

Seethe Ramudi Katnam Serial Today Episode సీత పుట్టింటిలో రామ్, సీతల తొలిరేయి ఏర్పాటు చేయగా అది తెలుసుకున్న మహాలక్ష్మి మధుని పంపించి ఫస్ట్ నైట్ జరగకుండా ఆపేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode రామ్‌ని ప్రమాదం నుంచి కాపాడి ఆపదలో పడింది విద్యాదేవి టీచరే అని సీత భర్తతో చెప్తుంది. సీత, రామ్‌లు విద్యాదేవిని కలవడానికి సీత పుట్టింటికి బయల్దేరుతారు. మహాలక్ష్మి రామ్‌ని పిలిస్తే రేవతి ఇద్దరూ సీత ఊరు వెళ్లారని చెప్తుంది. మహాలక్ష్మి తనతో చెప్పకుండా వెళ్లినందుకు కోప్పడుతుంది. విద్యాదేవిని కలవడానికి వెళ్లుంటారని అర్చన మహాలక్ష్మికి చెప్తుంది. శివకృష్ణ ఇంటి దగ్గర మహాలక్ష్మి సీత, రామ్‌లకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తుందేమో అని మహా టెన్షన్ పడుతుంది. ఇక మహాలక్ష్మి రామ్‌కి కాల్ చేస్తే సీత కాల్ లిఫ్ట్ చేసి అత్తతో ఓ ఆట ఆడుకుంటానని కాల్ వినపడనట్లూ మాట్లాడుతుంది. మహాలక్ష్మిని సీత విసిగిస్తుంది. ఈ రోజు రాత్రి ఇక్కడే ఉంటామని సీత అంటుంది. ఫోన్ స్విఛ్ ఆప్ చేస్తానని రాత్రి ఇద్దరం హ్యాపీగా ఉండబోతున్నామని అంటుంది. 

మహాలక్ష్మి: నువ్వు చెప్పింది నిజమే అర్చన ఈ రోజు వాళ్లిద్దరూ ఒకటి కాబోతున్నారు. స్వయానా సీతే ఆ మాట చెప్పింది.
అర్చన: మరెలా మహా ఇక్కడైతే మనం ఆపేవాళ్లం. ఇప్పుడేం చేద్దాం. ఈ సారి నువ్వు వాళ్లని ఆపలేం మహా. ఈ రాత్రికి వాళ్లు కలిసిపోవడం ఖాయం.
మహాలక్ష్మి: ఆరు నూరైనా నేను ఇక్కడున్నా. వాళ్లు అక్కడున్నా ఆ ఫస్ట్ నైట్ జరగడానికి వీల్లేదు. 
అర్చన: నువ్వేం చేయలేం మహా ఆ సీతకి సరెండర్ కావాల్సిందే.
మహాలక్ష్మి: ఆపుతావా నన్ను ఆలోచించుకోనివ్వు. వెళ్లు.

సీత రాత్రి రొమాంటిక్ సాంగ్ పెట్టుకొని చూస్తుంటుంది. రామ్ వస్తాడు. ఇంట్లో అందరూ ఏరి అని అడుగుతాడు. రేపు పొద్దున్న వస్తారని సీత చెప్తుంది. రాత్రికి ఇద్దరమే ఉంటామని నువ్వు త్వరగా రెడీ అయిరా అని సీత చెప్తుంది. రామ్ సరే అంటాడు. సీత రామ్ దగ్గరకు పాలు తీసుకొని వెళ్తుంది. ఇద్దరూ పాలు తాగుతారు. రామ్ సీతని హగ్ చేసుకుంటాడు. కిస్ చేసి దగ్గరకు తీసుకునే టైంకి ఎవరో డోర్ కొట్టారని ఆగిపోతారు. ఇద్దరూ ఎవరు వచ్చారా అని వెళ్లి  డోర్ తీస్తారు. చూస్తే మధుమిత వచ్చి సీరియస్‌గా వచ్చి హాల్‌లో కూర్చొంటారు.

సీత: అక్కా ఈ టైంలో వచ్చావేంటి.
మధు: సూర్యతో గొడవైంది. అక్కడుండలేక ప్రశాంతత కోసం ఇక్కడికి వచ్చాను. మీరు ఎప్పుడు వచ్చారు. అమ్మానాన్న ఎక్కడ. 
రామ్: బయటకి వెళ్లారు.
మధు: నేను ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటా.
సీత: ఇక్కడ పడుకుంటావా.
మధు: ఏ నీకు ఏమైనా ప్రాబ్లమా.. 
సీత: నేను మామ నీతో వస్తాం పద అక్క.
మధు: ఏదో మనస్శాంతి కోసం వస్తే నన్ను చంపేయాలి అని చూస్తున్నావా సీత.
రామ్: రిలాక్స్ మధు గారు మీరు ఇక్కడే రెస్ట్ తీసుకోండి.
సీత: లేదు మామ.
రామ్: మీ అక్క మనసు బాలేదు కదా నువ్వు ఆమెను ఓదార్చు నువ్వు అక్కతో పడుకో నేను వేరేగా పడుకుంటా. మధు ఇక మీకు ఏం భయం లేదు. సీత మీతోనే ఉంటుంది. ప్రశాంతంగా పడుకోండి.
సీత: ఫస్ట్ నైట్ ఆగిపోవడంతో సీత డిసప్పాయింట్ అయిపోతుంది. మధుతో.. నీకు ఎప్పుడూ బావతో గొడవ పడటమేనా పని. బావతో హ్యాపీగా ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావే. పానకంలో పుడకలా వచ్చావ్.
మధు: ఏంటి..
సీత: ఏం లేదు పడుకుందాం రా.
మధు: నువ్వు వెళ్లు నేను వాష్ రూమ్‌కి వెళ్లి వస్తా. అని బయటకు వెళ్లి డర్ లాక్ చేసి మహాలక్ష్మికి కాల్ చేసి ఇద్దరికీ దూరం పెట్టానని చెప్తుంది. నైట్ అంతా సీతకి కాపలా కాస్తానని మధు చెప్తుంది. ఇక మహాలక్ష్మి అర్చనతో మధు వల్ల సీత, రామ్‌లను కలవకుండా ఆపానని చెప్తుంది. అర్చన మహాలక్ష్మిని పొగిడేస్తుంది. విద్యాదేవి, శివకృష్ణలు కలిసుంటారని అందరూ సంతోషపడతారు. ఇంటికి వచ్చి మధుని చూసి షాక్ అయిపోతారు. మధు రాత్రి వచ్చిందని సీత చెప్తుంది. సీత, రామ్‌ల ఫస్ట్ నైట్ అవ్వలేదని విద్యాదేవి అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: గురువారమే కార్తీక్, జ్యోత్స్నల నిశ్చితార్థం.. పెద్ద కూతుర్ని పిలిచిన సుమిత్ర!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Embed widget