Seethe Ramudi Katnam Serial Today January 6th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: చిన్నదో వైపు.. పెద్దదో వైపు.. ఆట మాత్రం సీతదే.. మహా తట్టాబుట్టా సర్దేయడమేనా!
Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మీని కాదని జనార్థన్ విద్యాదేవి గదిలో పడుకోవడం సీత మహా మీద సెటైర్లు వేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ ఇంటికి రావడం తనకి అన్యాయం చేశావని జనార్థన్‌ని నిలదీస్తుంది. దాంతో జనా చేసేది ఏమీ లేదని సర్దుకుపోమని మహాలక్ష్మీతో చెప్తాడు. మహా గదిలోకి వెళ్తే అక్కడికి సీత వెళ్తుంది.
సీత: వెల్ కమ్ బ్యాక్ అత్త. నువ్వు ఏదో ఒక రోజు తిరిగి వస్తావ్ అని నాకు తెలుసు.
మహాలక్ష్మీ: అంటే నేను బతికే ఉన్నానని నీకు తెలుసా.
సీత: నువ్వు చావవు అని నమ్మకం ఉండేది అత్త. ఎందుకంటే చెడ్డవాళ్లు అంత త్వరగా చావరు కదా.
మహాలక్ష్మీ: సీతా..
సీత: నువ్వు తిరిగి వచ్చి దాన్ని నిజం చేశావ్. కానీ మామయ్య మూడో పెళ్లి చేసుకుంటారని నువ్వు ఊహించలేదు కదా అత్త. మీరు ఏదో భారీ ప్లాన్ వేశారని అర్థమై ఇంట్లో అందరూ మీరు చనిపోయారని అనుకుంటే అది నేను నమ్మినట్లు నటించాను. మీరు లేరు అని మామయ్య దిగులు పడుతుంటే సుమతి అత్తమ్మని మామయ్యకి దగ్గర చేశాను కంపెనీకి సీఈవో చేశాను. అందరి దృష్టిలో అది మూడో పెళ్లి మీ దృష్టిలో నా దృష్టిలో ఇది మొదటి పెళ్లి. మీకు ఇంకో విషయం చెప్పాలి ఈ పెళ్లి చేసింది నేనే. ఇప్పుడు మీరు ఇంట్లో వాళ్లకి నిజం చెప్పలేక మామయ్య భార్యగా సుమతి అత్తమ్మని చూడలేక నరకం చూస్తారు. మీరు జైలుకి పంపాలి అనుకున్న సుమతి అత్తమ్మ మీ ముందే మామయ్య భార్యలా తిరుగుతుంటే మీ గుండె పిండేసినట్లుంటుంది కదా అత్తయ్యా. ఇక నుంచి మీకు పట్టపగలు ఇంట్లో చుక్కలు కనిపిస్తాయి. ఇక వెళ్లి రెస్ట్ తీసుకోండి బాయ్ అత్త.
మహాలక్ష్మీ: సీత చాలా రెచ్చి పోయావ్ త్వరలోనే నువ్వు చచ్చిపోయే ప్లాన్ వేస్తా.
అర్చన: మహా నీ జీవితం తెగిన గాలిపటం అయిపోయింది. నువ్వు తిరిగి వచ్చావ్ అని సంతోషపడాలో ఈ ఇంట్లో నీ స్థానం ఏంటా అని బాధ పడాలో అర్థం కావడం లేదు మహా. బావగారికి నువ్వు నెంబరు వన్ అయితే ఇప్పుడు నువ్వు నెంబరు 3 అయిపోయావ్. సుమతి అక్క నీ స్థానం తీసుకుంది. నువ్వు చేయడానికి ఈ ఇంట్లో ఆఫీస్‌లో ఏ పని లేదు మహా. నీ కష్టం పగ వాళ్లకి రావడం లేదు మహా. ఇలాంటి బతుకు బతకడం కంటే ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్లిపో మహా
మహాలక్ష్మీ: ఇంక ఆపుతావా నేను వచ్చింది తిరిగి వెళ్లిపోవడం కాదు ఆ సుమతినే వెళ్లగొడతా. ఇప్పుడు జనా నా వైపు వస్తాడు. నా ముందు ఆ సుమతి ఎంత నాకు అది దిష్టి తీయడానికి పనికి రాదు.
అర్చన: అని నువ్వు అనుకుంటే కాదు మహా బావగారు అనుకోవాలి కదా. ఈ మధ్య బావగారి మాటలు వేరేలా ఉన్నాయి.
మహాలక్ష్మీ: నేను వచ్చాను కాబట్టి జనా నా వైపు ఉంటాడు. మేం మా గదిలో ఉంటే ఆ సుమతి ఒంటరిగా ఉండాల్సిందే. చూస్తూ ఉండూ ఈ తులాభారంలో జనా నా వైపు ఉంటాడు.
మహాలక్ష్మీ అందంగా రెడీ అయి పాల గ్లాస్‌తో గదిలోకి వెళ్లి దుప్పటి కప్పుకొని ఉంటే జనార్థన్ అనుకొని ప్రేమగా మాట్లాడుతుంది. తీరా చూస్తే సీత అక్కడ దుప్పటి కప్పుకొని ఉంటుంది. సుమతి అత్తమ్మ ఉండగా మామయ్య మీ గదిలోకి ఎందుకు వస్తారు అని సీత అంటుంది. సీత మహాని అందంగా రెడీ అయ్యావు అత్త అని గ్లాస్‌లోని పాలు తీసుకొని తాగి మీకు సగం పాలు ఇవ్వాలా అని సెటైర్లు వేస్తుంది. కొత్తగా పెళ్లి అయిన భార్యని వదిలేసి మీ దగ్గరకు ఎలా వస్తారని సెటైర్లు వేస్తుంది. నేను వెళ్లి పిలుస్తా అని మహాలక్ష్మీ అంటే ఇద్దరూ పంతానికి పోతారు. మామయ్య వస్తే మీరు గెలిచినట్లు రాకపోతే మా అత్తమ్మ గెలిచినట్లు అని సీత అంటుంది. ఇక జనార్థన్ దగ్గరకు మహా వెళ్లే సరికి విద్యాదేవి జనార్థన్‌తో మహాలక్ష్మీ దగ్గరకు వెళ్తుంది. కానీ జనార్థన్ మహా గొప్పది అని అర్థం చేసుకుంటుందని పొగిడేస్తాడు.
దాంతో మహాలక్ష్మీ ఏం మాట్లాడకుండా అయిపోతుంది. జనార్థన్ మంచిగా ఆలోచిస్తున్నప్పుడు తర్వాత మాట్లాడుతా అని వెళ్లిపోతుంది. ఇంతలో పూల కుండీ తగిలి జనార్థన్ చూసి బయటకు వస్తాడు. సీత వచ్చి కావాలనే ఇరికిస్తుంది. మహా మనసులో ఇంతలా ఇరికిస్తున్నావే నిన్నేం చేసినా పాపం లేదు అని అనుకుంటుంది. ఇక జనార్థన్ గదిలోకి వెళ్లి డోర్ వేసేస్తాడు. సీత మహాలక్ష్మీకి సెటైర్లు వేస్తుంది. మీరు బయట ఉన్నారు మా అత్తమ్మ లోపల ఉన్నారు మామయ్య డోర్ వేశారు ఇక చూసుకోండి అని మహాని ఏడిపిస్తుంది. ఈ రోజు మీ గదిలో లేరు రేపు మీ జీవితంలో ఉండరు అని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.