అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today January 29th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: కొన ఊపిరితో సీత.. డ్రమ్‌లో కుక్కేసిన రౌడీలు.. లొకేషన్‌కి చేరుకున్న రామ్, పోలీసులు!

Seethe Ramudi Katnam Today Episode సీత కొన ఊపిరితో ఉందని తెలుసుకున్న రౌడీలు సీతని ఓ డ్రమ్‌లో పెట్టేసి వదిలేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode సీత క్షేమం కోసం విద్యాదేవి అమ్మవారి ఆలయంలో పంతులు చెప్పినట్లు చల్లని నీటిలో తల స్నానం చేసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. ఇక నాగు సీత చనిపోయిందని గోయ్యి తీసి పాతేద్దామని అందుకు గొయ్యి తీయమని అంటాడు. ఇంతలో సీతలో కదలికలు వస్తాయి. సీత చావలేదని కొన ఊరితో ఉందని అనుకుంటారు. ఎవరి కోసమో దీని గుండె ఇంకా కొట్టుకుంటుందని నాగు అంటాడు. 

సీతని అలా వదిలేసి వెళ్లిపోకూడదని అనుకుంటారు. ఇక ఓ రౌడీ సీత ఫోన్ చూస్తాడు. సీత ఫోన్ అమ్ముకోవాలని అనుకొని ఎవరీకీ తెలీకుండా ఫోన్ నొక్కేస్తాడు. ఫోన్ స్విచ్ ఆన్ చేస్తాడు. మరోవైపు విద్యాదేవి ప్రదక్షిణలు చేస్తుంటుంది. రామ్ గదిలో సీత గురించి ఆలోస్తూ టెన్షన్ పడుతుంటాడు. ఇంతలో రామ్‌కి సీత ఫోన్ ఆన్ అయినట్లు మెసేజ్ వస్తుంది. మరోవైపు సీత ఫోన్ ఆన్ అయిందని సిగ్నల్ ట్రేస్ చేసిన పోలీస్ గుర్తు పడతాడు. లొకేషన్ ట్రేస్ చేస్తారు. పోలీసులు అందరూ అలర్ట్ అయిపోతారు. మహాలక్ష్మీ టెన్షన్ పడుతుంది. రామ్ కూడా పరుగున వచ్చి సీత సెల్ అన్ అయిందని చెప్తాడు. దాంతో త్రిలోక్ లొకేషన్ ట్రేస్ చేస్తున్నామని చెప్తాడు. సీత ఫోన్ ఓ కన్‌స్ట్రక్షన్ లొకేషన్ చూపిస్తుందని చెప్తారు. త్రిలోక్ ఆ ఏరియా పోలీస్‌కి కాల్ చేసి విషయం చెప్తాడు. ఆయనకు లొకేషన్ పంపిస్తారు. రామ్ ఆ లొకేషన్ తనకు పంపమని తాను వెళ్తానని అంటాడు. దాంతో రామ్‌కి లొకేషన్ షేర్ చేస్తారు. రామ్, చలపతి ఇద్దరూ లొకేషన్‌కి బయల్దేరుతారు. సీత కాసేపట్లో దొరుకుతుందని అందరి పని అయిపోతుందని రేవతి అంటుంది. 

మరోవైపు సీతని నాగు సిటీ చివరకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి కాల్చేద్దామని అంటాడు. ఇలా తీసుకెళ్లి దొరికిపోతామని రౌడీలు అంటే దానికి నాగు సీతని ఓ పెద్ద డ్రమ్‌లో పెడదామని అంటాడు. ఇక మరో రౌడీ మళ్లీ ఫోన్ ఆన్ చేయడం నాగు చూస్తాడు. సీత నోటికి ప్లాస్టర్ వేసి డ్రమ్‌లో పెడతారు. డ్రమ్ తీసుకెళ్తుండగా రామ్, చలపతి ఆ లొకేషన్‌కి రావడం నాగు చూస్తాడు. షాక్ అయిపోతాడు. దాంతో డ్రమ్‌ని వదిలేసి వాళ్లు పారిపోతారు. సీత ఉన్న డ్రమ్‌ని మెట్ల మీద నుంచి కిందకి వదిలేయడంతో సీత చీర కొంగు బయటకు వచ్చేస్తుంది. రామ్ సీత నెంబర్కి కాల్ చేసి అటు వైపు పరుగులు తీస్తారు. నాగు వాళ్లు బిల్డింగ్ వర్కర్స్‌లా బస్తాలు చేత పట్టి వెళ్లిపోతారు. రామ్‌కి సీత పోన్ దొరుకుతుంది.

సీత కోసం మొత్తం వెతుకుతారు. ఈ లోపు రామ్ నాగు వాళ్లని చూసి ఆపుతాడు. మీరు ఎవరు అని అడిగితే కూలీలం అని చెప్తారు. రామ్‌కి అనుమానం వచ్చి ముసుగులు తీయమని అంటాడు. దగ్గరకు వెళ్లి ముసుగు తీయబోతే రౌడీలు రామ్ వాళ్లు మీద బస్తాలు విసిరేసి పారిపోతారు. రౌడీల వెంట పోలీసులు పరుగులు తీస్తారు. ఇక సీత ఉన్న డ్రమ్ బిల్డింగ్ పై నుంచి కింద పడిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. రామ్ సీత చెప్పులు చూసి చాలా టెన్షన్తో సీత సీత అని పిలుస్తూ అరుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కూతురి పరిస్థితికి కుమిలి కుమిలి ఏడుస్తున్న దీప.. జ్యోత్స్న బుద్ధి ఇంత దారుణమా!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 18th:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
జగద్ధాత్రి సీరియల్:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
Anu Sri Raj: సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget