అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today January 27th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: రౌడీలను చితక్కొట్టి తప్పించుకున్న సీత.. ప్రీతి, ఉషల మీద రామ్ సీరియస్! 

Seethe Ramudi Katnam Today Episode సీతని చంపాలని రౌడీలు ప్రయత్నించడం సీత వాళ్లని చితక్కొట్టి తప్పించుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ, అర్చనలు ప్రీతి, ఉషలకు కాల్ చేస్తారు. సీతని ఎవరో కిడ్నాప్ చేశారని పోలీసులు ఇంటికి వచ్చారని మీ ముగ్గురు కలిసి గుడికి వెళ్లారని సీతని వదిలేశారని రామ్ కోపంగా ఉన్నాడని చెప్పి ఇంటికి రమ్మని ఏం చేయాలో పోలీసులతో ఏం చెప్పాలో మహాలక్ష్మీ వాళ్లతో చెప్తుంది. ఇద్దరూ భయపడుతూ ఇంటికి బయల్దేరుతారు. పిల్లలు ఏం సమాధానం చెప్తారో అని అర్చన తెగ కంగారు పడుతుంది.

ఇక అర్చన ఎలాగూ ఫోన్ మన దగ్గరే ఉంది కదా నాగుకి కాల్ చేసి మనకు కాల్ చేయొద్దని చెప్పమని చెప్తుంది. ఇక త్రిలోక్ మహాలక్ష్మీ వాళ్ల దగ్గరకు వస్తాడు. దాంతో మహాలక్ష్మీ ఫోన్ కట్ చేసేస్తుంది. త్రిలోక్ ఫోన్ తీసుకొని వెళ్లిపోతాడు. నాగు ఇంకా ఫోన్ చేయలేదు అంటే వాడికి ఇప్పటికే పోలీస్‌ల గురించి తెలిసిపోయింటుందని అంటుంది. త్రిలోక్ మహాలక్ష్మీ వాళ్లని రమ్మని పిలుస్తాడు. సీత కట్లు విప్పుకోవడానికి తెగ ప్రయత్నిస్తుంది. కట్లు వీడిపోతాయి. సీతని చంపేయాలని రౌడీలు అనుకుంటారు. నాగు సరే అని సీత దగ్గరకు వెళ్తాడు. అందరూ సీత చుట్టు ముట్టి చంపేస్తామని సీతతోనే చెప్తారు. ఇక సాంబ రేవతికి కాల్ చేసి విషయం చెప్తే రేవతి ఇంటికి వస్తుంది. 

మహాలక్ష్మీ: ఆగు నువ్వు ఎందుకు వచ్చావ్.
రేవతి: సీత విషయం తెలిసే వచ్చాను.
మహాలక్ష్మీ: నువ్వు ఇక్కడికి రావడమే వేస్ట్.
రేవతి: సీత మీకు ఎంత ముఖ్యమో మాకు అంతే.
మహాలక్ష్మీ: నువ్వు వచ్చినా రాకపోయినా ఇక్కడ ఎవరికీ ఒరిగేది ఏంలేదు. 
రేవతి: నేను రామ్‌ని ఓదార్చడానికి వచ్చాను.
మహాలక్ష్మీ: నీ ఓదార్పు ఎవరికీ అవసరం లేదు మొసలి కన్నీళ్లు కార్చడానికి వచ్చావ్.
జనార్థన్: మహా ఆగు ఈ టైంలో గొడవలు ఎందుకు.
రేవతి: సీతకి ఏం కాదు రామ్ ధైర్యంగా ఉండు. ఇది బయటవాళ్ల పని కాదు. ఇంట్లో వాళ్ల పనే.
మహాలక్ష్మీ: ఏం మాట్లాడుతున్నావ్ రేవతి ఇంట్లో వాళ్లు అంటే ఏంటి నీ ఉద్దేశం.
అర్చన: నువ్వు మాకు శత్రువు అయ్యావ్ అని సీత అవుతుందని అనుకుంటున్నావా.
గిరిధర్: అయినా వాళ్లని శత్రువులు అనుకోవడం నీకు అలవాటు మాకు కాదు. 
ఏసీపీ: ఏంటయ్యా ఈ ఫ్యామిలీ బయట నుంచి చూస్తే డీసెంట్ అనుకున్నా కానీ ఇంట్లో ఇన్ని గొడవలా. 
త్రిలోక్: దూరపు కొండలు నునుపు అని ఊరికే అన్నారా సార్ ఈ మధ్య పెద్ద వాళ్ల ఇళ్లల్లో పెద్ద పెద్ద గొడవలే జరుగుతున్నాయ్. మీడియాలో చూస్తున్నాం కదా సార్.

పోలీసుల మాటలు విన్న జనార్థన్ అందరినీ డీసెంట్‌గా ఉండమని చెప్తాడు. రేవతి వల్లే ఇదంతా అని మహాలక్ష్మీ అంటే రేవతిని ఏం అనొద్దని రామ్ అంటాడు. సీత వస్తే అందరి పని అయిపోతుందని రేవతి అంటుంది. ప్రీతి, ఉషలు వస్తే ఎవరూ మాట్లాడొద్దని నేనే మాట్లాడుతా అని రామ్ 
సీరియస్‌గా చెప్తారు. సీతని చంపడానికి రౌడీలు వెళ్తే సీత వాళ్లని కొట్టేసి పారిపోతుంది. ఇక ప్రీతి, ఉషలు ఇంటికి వస్తారు. 

రామ్: సీతని ఎందుకు వదిలేశారు చెప్పండి. 
మహాలక్ష్మీ: వాళ్లు నీ చెల్లెళ్లు రామ్ ఎందుకు అలా వాళ్లు మీద అరుస్తున్నావ్. 
రేవతి: మీరు వదిలేయడం వల్లే సీత కిడ్నాప్ అయింది. 
ఏసీపీ: మీరు ఆగండి మేం అడుగుతాం. చూడండి అమ్మా ఏం జరిగిందో చెప్పండి.
త్రిలోక్: మీరు ఏం దాచినా మాకు తెలుస్తుంది. నిజాలు మాత్రమే చెప్పండి.

ప్రీతి, ఉషలు మహాలక్ష్మీ కోసం అమ్మవారి గుడికి వెళ్లామని సీత నీటి కోసం వెళ్లి ఎంతకీ రాకపోవడంతో గుడికి వెళ్లి మొక్కు చెల్లించామని సీత వదిన ఇంటికి వచ్చేసుంటుందని వచ్చామని ఇంతలో అమ్మ కాల్ చేస్తే వచ్చామని అంటారు. ఇదే జరిగిందని ఏదీ దాయలేదని ప్రీతి, ఉషలు అంటారు. దాంతో ప్రీతి, ఉషలకు సంబంధం లేదని అంటాడు. సీత కిడ్నాప్ చేసిన వాళ్లు డబ్బు కోసం కాల్ చేయలేదని బంగారం కోసమే అయితే సీత బంగారం వేసుకోలేదని చలపతి చెప్తాడు. దాంతో ఏసీపీ ఇదంతా పర్సనల్ గ్రజ్‌తో చేశారని అంటారు. ఇక రేవతి ఇదంతా ఇంటి వాళ్ల పనే అని అంటుంది. దాంతో మహాలక్ష్మీ అనవసరంగా మా మీద ఇలాంటి నిందలు వేయొద్దని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్ జనవరి 27: దీపకి నిజం చెప్పేసిన జ్యోత్స్న..పుట్టగతులు లేకుండా పోతావ్ నాన్న.. కాంచన ఉగ్రరూపం!

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 19th: కార్తీకదీపం 2 సీరియల్: అందరి ముందు సూరజ్‌కి ప్రపోజ్ చేసిన జ్యోత్స్న! ఓకే చెప్పేసిన సూరజ్! క్లైమాక్స్ లెక్కుంది ఎపిసోడ్!
కార్తీకదీపం 2 సీరియల్: అందరి ముందు సూరజ్‌కి ప్రపోజ్ చేసిన జ్యోత్స్న! ఓకే చెప్పేసిన సూరజ్! క్లైమాక్స్ లెక్కుంది ఎపిసోడ్!
Jagadhatri Serial Today August 18th:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
జగద్ధాత్రి సీరియల్:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget