అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today January 23rd: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహాలక్ష్మికే ఎదురు తిరిగిన సీత - రామ్ సీరియస్

Seethe Ramudi Katnam Serial Today Episode: మహాలక్ష్మితో సీత గొడవ పడటం చూసి సీత మీద రామ్ సీరియస్ అవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode:  అర్చన సీతని కిందకు పిలుస్తుంది. సీత రాగానే మహాలక్ష్మి ఫుల్ ఫైర్ అవుతుంది. ఫొటోలు ఎందుకు కట్ చేశావని.. అసలు లాక్ చేసిన బీరువా నుంచి అల్బమ్ ఎలా తీసుకున్నావని ప్రశ్నిస్తుంది. దొంగలా తీశావా సిగ్గులేదా అని మహాలక్ష్మి సీతని తిడుతుంది.

సీత: సిగ్గు పడాల్సింది నేను కాదు మీరు.. సభ్యత సంస్కారం పక్కన పెట్టి మీరు చేస్తున్న పనులకు మీరే సిగ్గుతో తలదించుకోవాలి. 
గరిధర్: ఏం మాట్లాడుతున్నావ్.. మతి ఉండే మాట్లాడుతున్నావా.. మతి తప్పి మాట్లాడుతున్నావా..
సీత: మతి తప్పింది నాకు కాదు మీకు. మీ అందరి మతి చలించి బుద్ధి లేని పనులు చేస్తున్నావ్.. బుద్ధి ఉన్నవాళ్లు అయితే ఇలాంటి నీతి మాలిన పనులు చేస్తారా.. నా భర్త పక్కన మా అక్క మధుమిత ఉన్న ఫొటోలు తీయించి ఆల్బమ్ చేయిస్తారా.. పెద్ద మనుషులు అని చెప్పుకుంటున్న మీకు ఈ చిన్న బుద్ధులు ఏంటి.. ఈ సిగ్గులేని తనం ఏంటి..
మహాలక్ష్మి: మాటలు జాగ్రత్త.. నోరు జారావంటే మర్యాదగా ఉండదు.
సీత: అవును మీరు మర్యాదస్తులు అందుకే మీరంతా జంటగా ఫొటోలు దిగారు. ఎవరి భర్త పక్కన వారి భార్య ఉంది. నా భర్త పక్కన మాత్రం మా అక్క ఉన్న ఫొటోలు పెడతారా.. మర్యాద అంటే ఇదేనా.. నా భర్త పక్కన నేను కాకుండా వేరే అమ్మాయి ఉంటే ఎంత బాధగా ఉంటుంది. ఆ ఫొటోలను మా అక్క చూస్తే తను ఎంత బాధ పడుతుంది. ఈ విషయం మా ఆయనకు తెలిస్తే ఎంత ఫీలవుతారు. 
మహాలక్ష్మి: రిసెప్షన్‌లో ఏం చేశావ్.. రామ్ పక్కన ఉండకుండా ఎక్కడికి పోయావ్.. పిచ్చిదానిలా ప్రవర్తించి మా పరువు తీసిందే కాక మమల్నే అంటున్నావా.. ఆ రోజు నిన్ను అలా అందరూ నిన్ను పిచ్చిదానివి అనుకున్నారు. రామ్ పక్కన మీ అక్కని చూసి వాళ్లిద్దరే జంట అనుకున్నారు. ఫొటో గ్రాఫర్ ఫొటోలు తీసుంటాడు. అది మా తప్పా..
సీత: తప్పు చేసింది ఆ ఫొటో గ్రాఫర్ కాదు మీరు కావాలనే నాతో మత్తు మందు కలిపిన జ్యూస్ తాగించి నన్ను పిచ్చిదాన్ని చేశారు. నేను లేని టైంలో మా అక్కని ఆయన పక్కన నిల్చొపెట్టి ఫొటోలు తీయించారు. అందుకే ఆ ఆల్బమ్ నా కంట పడకుండా చేయాలి అనుకున్నారు. ఇది ఫొటో గ్రాఫర్ పొరపాటే అయితే ఎందుకు మీకు ఈ ఉలికిపాటు. ఆల్బమ్ నా కంట పడకుండా ఎందుకు దాచారు.. అంటే ఆ ఆల్బమ్‌లో ఏముందో మీకు తెలుసు.. కావాలనే అలా చేయించారు. ఎంత నీచమైన పని చేశారు అత్తయ్య.
మహాలక్ష్మి: ఏమన్నావ్.. 
సీత: మా ఆయన పక్కన మా అక్క ఫొటో ఎలా పెట్టారు అంటున్నాను. అదే మీ పక్కన ఏ వాచ్ మాన్ ఫొటో పెడితే మీకు ఎలా ఉంటుంది. 
మహాలక్ష్మి: నన్నే అంత మాట అంటావా.. ఎంత ధైర్యమే నీకు.. అని మహాలక్ష్మి కొట్టడానికి చేయి ఎత్తితే సీత చేయి పట్టుకొని ఆపుతుంది. అప్పుడే రామ్ ఇంటికి వచ్చి ఆ సీన్ చూసి షాక్ అయి గుమ్మం దగ్గరే నిలబడిపోతాడు. రామ్‌ని చూసిన మహాలక్ష్మి.. నా మీదే చేయి ఎత్తుతావా.. అమ్మలాంటి అత్తమీదే చేయి ఎత్తుతావా.. 
సీత: కూతురు లాంటి కోడలు మీద చేయి ఎత్తింది మీరు మీ చేయి పట్టుకుంది నేను..
రామ్: ఫస్ట్ పిన్ని చేయి వదులు సీత.. వదులు.. ఏం జరిగింది పిన్ని.. ఎందుకు గొడవ పడుతున్నారు.. 
మహాలక్ష్మి: చూడు రామ్ తనేం చేసిందో.. రిసెప్షన్ ఆల్బమ్ వచ్చింది నీ పక్కన మధుమిత ఉందని.. అందుకు కారణం నేను అని సీత నా మీద సీరియస్ అవుతుంది. ఆ ఫొటోలను కట్ చేయడమే కాకుండా అలా ఎందుకు చేశావని అడిగిన అర్చనను కత్తిరతో పొడిచి చంపేస్తానని బెదిరించింది. 
సీత: నేను అలా బెదిరించ లేదు.. చీర కత్తిరిస్తానని మాత్రమే అన్నాను..
మహాలక్ష్మి: చూడు రామ్ తను ఎలా మాట్లాడుతుందో.. నీ పక్కన మధుమిత ఉండటం... నా పక్కన వాచ్‌మాన్‌ని పెడతాను అనడం ఒకటేనా... ఫొటో గ్రాఫర్ పొరపాటు చేస్తే నాదా తప్పు.
సీత: అది ఫొటో గ్రాఫర్ తప్పు కాదు ముమ్మాటికీ మీదే.. 
రామ్: నోర్ముయ్ సీత.. నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. కాసేపు కామ్‌గా ఉండు.. జరిగిన గొడవకు సారీ పిన్ని. తన తరుఫున నేను సారీ చెప్తున్నాను.. తనతో నేను మాట్లాడుతాను పిన్ని మీరు కూల్‌గా ఉండండి.. నువ్వు నాతో రా.. నీ బిహేవియర్‌ నాకు ఏం అర్థం కావడం లేదు సీత.. పెళ్లి అయినప్పుటి నుంచి ఎప్పుడు నీ వల్ల ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంది. మా పిన్ని నీతో మంచిగా ఉంటున్నా నువ్వే పిన్నితో బ్యాడ్‌గా బిహేవ్ చేస్తున్నావు.
సీత: నీకు అర్థమైంది ఇంతేనా మామ.. వాళ్లు నీ ముందు ఒకలా మీ వెనక ఇంకోలా ప్రవర్తిస్తున్నారు. అందరూ కలిసి నాటకం ఆడుతున్నారు. నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు. ఈ విషయం నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు. 
రామ్: నువ్వే వాళ్లని సరిగా అర్థం చేసుకోవడం లేదు.. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో రోజూ నేను చూస్తున్నాను కదా.. 
సీత: ఏం చూస్తున్నావ్ మామ నువ్వు నువ్వు చూస్తున్నది వేరు ఇక్కడ జరుగుతున్నది వేరు. మన రిసెప్షన్‌లో నీ పక్కన మా అక్క ఎందుకు ఉంది.  ఆ ఫొటోలనే ఆల్బమ్‌గా ఎందుకు చేయించారు. ఇందంతా నువ్వు ఆలోచించావా.. ఇదంతా మీ పిన్నే చేసింది.
రామ్: అర్థం లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావ్‌ మా పిన్ని ఎందుకు చేయిస్తుంది. మీ అక్క నేను పక్క పక్కన ఉన్నప్పుడు ఫొటోలు తీసుంటారు. అంతే కానీ నువ్వు అనుకున్నట్లు కాదు. 
సీత: సరే కాసేపు అలానే అనుకుందాం.. ఫంక్షన్‌లో అందరి ఫొటోలు తీస్తారు మరి నా ఫొటోలు తీయలేదు ఎందుకు.. నువ్వు నేను కలిసి ఉన్న ఫొటో ఒక్కటి కూడా ఎందుకు తీయలేదు.. 
రామ్: ఎందుకు అంటే నువ్వు నా పక్కన ఎక్కువ సేపులేవు..
సీత: నేను పక్కన లేకపోతే మీ పక్కన ఎవరు ఉంటే వాళ్లకి తీస్తారు. అందరూ మిమల్నే జంట అనుకోరా.. నాకు ఎంత బాధగా ఉంటుంది. ఒకసారి నా స్థానంలో ఉండి ఆలోచించు మామ. ఒక్క ఫొటో అలా వస్తే ఒకే అన్ని ఫొటోల్లో మీరే ఉంటే ఏం అనుకోవాలి చెప్పు.
రామ్: సారీ సీత నాకు నీ బాధ అర్థమైంది. కానీ ఇది అనుకోకుండా జరిగిన పొరపాటు. ఎవరూ కావాలని చేయరు..
సీత: కావాలనే చేశారు.. మీ పిన్నే చేశారు. 
రామ్: మళ్లీ మా పిన్నిని బ్లేమ్ చేస్తున్నావ్.. ఇది కరెక్ట్ కాదు.. మా పిన్ని ఎప్పటికి అలాంటి తప్పు చేయదు.. 
సీత: అది మీ గుడ్డి నమ్మకం.. ఆవిడ మిమల్ని కూడా మోసం చేస్తుంది. 
రామ్: అనవసరంగా మా పిన్ని మీద నిందలు వేయకు. మా పిన్ని ఫీలైతే నేను హర్ట్ అవుతాను. అందరి ముందు నువ్వు హర్ట్‌ అవ్వకూడదు అని ఇక్కడికి తీసుకొచ్చి నీతో మాట్లాడుతున్నా.. అయినా మీ అక్క పక్కన ఉన్న ఫొటోలకు నేనే ఫీలవడం లేదు.. నువ్వేందుకు ఫీలవుతున్నావ్.. తప్పు నీలోనే ఉంది సీత.. నువ్వే తప్పుగా అర్థం చేసుకోని నన్ను మీ అక్కని అవమానిస్తున్నావ్. 

మహాలక్ష్మి: నా చేయి పట్టే ఆపుతావా.. నీ చేయి నరక్కపోతే నేను మహాలక్ష్మినే కాదు.. నన్ను ఆ వాచ్‌మ్యాన్‌తో కలిపి ఫొటో తీయిస్తుంది అంట ఆ సీత దానికి నేను ఎలా కనిపిస్తున్నాను.
గిరిధర్: సీత టూమచ్ చేస్తుంది వదినా ఇలానే వదిలేస్తే చాలా కష్టం.
అర్చన: ఫొటోల్లో రామ్ పక్కన మధుమిత ఉంటేనే సీత అంత హడావుడి చేసింది అంటే మన అసలు ప్లాన్ తెలిస్తే ఇంకెంత చేస్తుందో.. రామ్ కూడా సీత వైపు వెళ్లాడంటే మనం ఏం చేయలేం.. 
మహాలక్ష్మి: నేను ఇదంతా ఆలోచించకుండా ఏం చేయను.. ఆల్రెడీ ప్లాన్ చేశా.. మధుమిత, రామ్ విషయంలో గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. ఏం చేయాలో అదే చేస్తున్నా.. అది ఇప్పుడే చెప్తున్నా.. 
అర్చన: సీతకు నీ ప్లాన్ తెలిసిపోతే ఎలా మహా.. 
మహాలక్ష్మి: నా స్కెచ్ ఏంటో మీకే తెలీదు దానికి ఏం తెలుస్తుందో.. సీత నాకు స్ట్రాంగ్‌ అపోజిషన్‌లా మారుతోంది. సీతని చావు దెబ్బ కొడతాను. మధుమితని నా కోడలిగా తెచ్చుకుంటాను అని మహాలక్ష్మి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.

Also Read: 'సత్యభామ' సీరియల్ జనవరి 23rd: శైలుతో క్రిష్‌ పెళ్లి ఫిక్స్, సత్యతో తన ప్రేమ విషయం తేల్చుకుంటానన్న క్రిష్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fastest Developing Cities: 2033 నాటికి ప్రపంచంలోని టాప్ 5 నగరాలలో హైదరాబాద్‌కు చోటు, సర్వేలో భారత్ డామినేషన్
2033 నాటికి ప్రపంచంలోని టాప్ 5 నగరాలలో హైదరాబాద్‌కు చోటు, సర్వేలో భారత్ డామినేషన్
Russia Ukraine War :  ముగింపునకు రష్యా - ఉక్రెయిన్ వార్ - జెలెన్‌స్కీ చేతులెత్తేస్తున్నారా ?
ముగింపునకు రష్యా - ఉక్రెయిన్ వార్ - జెలెన్‌స్కీ చేతులెత్తేస్తున్నారా ?
Rains in AP and Telangana: తీరం దాటిన ఫెంగల్ తుపాను- నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు - IMD రెడ్ అలర్ట్
తీరం దాటిన ఫెంగల్ తుపాను- నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు - IMD రెడ్ అలర్ట్
HYDRA Demolitions: హైడ్రా మిగిల్చిన ఆర్థిక  నష్టాల బాధ్యత  ఎవరిది? కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
హైడ్రా మిగిల్చిన ఆర్థిక  నష్టాల బాధ్యత  ఎవరిది? కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP DesamRishiteswari Case: Guntur Court Final Verdict | 9 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు ఏంటి? | ABP DesamPawan Kalyan Seize the Ship | డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ నౌకను సీజ్ చేయగలరా? | ABPPushpa 2 Ticket Booking Rates | అల్లు అర్జున్ సినిమా చూడాలంటే ఆ మాత్రం ఉండాలి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fastest Developing Cities: 2033 నాటికి ప్రపంచంలోని టాప్ 5 నగరాలలో హైదరాబాద్‌కు చోటు, సర్వేలో భారత్ డామినేషన్
2033 నాటికి ప్రపంచంలోని టాప్ 5 నగరాలలో హైదరాబాద్‌కు చోటు, సర్వేలో భారత్ డామినేషన్
Russia Ukraine War :  ముగింపునకు రష్యా - ఉక్రెయిన్ వార్ - జెలెన్‌స్కీ చేతులెత్తేస్తున్నారా ?
ముగింపునకు రష్యా - ఉక్రెయిన్ వార్ - జెలెన్‌స్కీ చేతులెత్తేస్తున్నారా ?
Rains in AP and Telangana: తీరం దాటిన ఫెంగల్ తుపాను- నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు - IMD రెడ్ అలర్ట్
తీరం దాటిన ఫెంగల్ తుపాను- నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు - IMD రెడ్ అలర్ట్
HYDRA Demolitions: హైడ్రా మిగిల్చిన ఆర్థిక  నష్టాల బాధ్యత  ఎవరిది? కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
హైడ్రా మిగిల్చిన ఆర్థిక  నష్టాల బాధ్యత  ఎవరిది? కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
YSRCP Kannababu: పవన్‌ కల్యాణ్‌ను షిప్‌లోకి వెళ్ల‌కుండా ఆపిందెవ‌రు? చంద్రబాబే బాధ్యత వహించాలి: కన్నబాబు
పవన్‌ కల్యాణ్‌ను షిప్‌లోకి వెళ్ల‌కుండా ఆపిందెవ‌రు? చంద్రబాబే బాధ్యత వహించాలి: కన్నబాబు
TV Movies: సలార్, సమరసింహా రెడ్డి to టిల్లు స్క్వేర్, బలగం - ఈ ఆదివారం టీవీలలో ఏయే సినిమాలు వస్తున్నాయంటే?
సలార్, సమరసింహా రెడ్డి to టిల్లు స్క్వేర్, బలగం - ఈ ఆదివారం టీవీలలో ఏయే సినిమాలు వస్తున్నాయంటే?
Hydra News: హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై ఎన్ని వేల కోట్ల రుణభారం పడింది, పరిష్కారం ఏంటి? ABP Desam Exclusive
హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై ఎన్ని వేల కోట్ల రుణభారం పడింది, పరిష్కారం ఏంటి? ABP Desam Exclusive
Bigg Boss Telugu Season 8: డబుల్ ఎలిమినేషన్‌లో తేజ, పృథ్వీ - గోల్డెన్ టికెట్‌తో లక్కీ ఛాన్స్... టైటిల్ గెలిచే దమ్ము ఎవరికి?
డబుల్ ఎలిమినేషన్‌లో తేజ, పృథ్వీ - గోల్డెన్ టికెట్‌తో లక్కీ ఛాన్స్... టైటిల్ గెలిచే దమ్ము ఎవరికి?
Embed widget