అన్వేషించండి

Satyabhama Serial Today January 23rd: 'సత్యభామ' సీరియల్: శైలుతో క్రిష్‌ పెళ్లి ఫిక్స్, సత్యతో తన ప్రేమ విషయం తేల్చుకుంటానన్న క్రిష్‌

Satyabhama Serial Today Episode మినిస్టర్ కూతురు శైలజతో క్రిష్‌ పెళ్లి ఫిక్స్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode: భైరవి రుద్ర, రేణుకలకు వార్నింగ్ ఇస్తుంది. ఆరు నెలల్లో రేణుక గుడ్ న్యూస్ చెప్పకపోతే రుద్రకు వేరే పెళ్లి చేస్తానని భైరవి అంటుంది. భైరవి అన్న మాటలను గుర్తుచేసుకొని రేణుక ఒంటరిగా ఏడుస్తుంది. ఇక అప్పుడు అక్కడికి రుద్ర వస్తాడు. 

రుద్ర: ఎందుకే ఎందుకు ఏడుస్తున్నావ్.. ఏడుచ్చుకో కానీ ఇక్కడ కాదు నీ పుట్టింటికి పోయి ఏడ్చుకో.. నీ కనీళ్లకి ఇక్కడ ఇంట్లో అందరూ పోగు అయితే లేని పోని పంచాయితీ అవుతుంది.
రేణుక: కానీ.. 
రుద్ర: ఏంటే నోరు లేస్తుంది.
రేణుక: నీ అరాచకాలన్ని భరిస్తూ ఎంతకాలం నోరు మూసుకొని ఉండాలి.
రుద్ర: ఎంతకాలం అయినా భరించాలి. ఇది నా రాజ్యం.
రేణుక: నా ముందు బాగానే నోరు లేస్తుంది కదా అత్తమ్మ ముందు ఎందుకు లేవదు. బిడ్డల గురించి అడిగినప్పుడు నిజం ఎందుకు చెప్పరు. 
రుద్ర: ఇష్టంతో నీ మెడలో తాళి కట్టలే పెద్దొళ్లు చెప్తే తలవంచినా.. 
రేణుక: ఇష్టం లేక తాళి కట్టావా.. ఎందుకు అట్లా నాకేం తక్కువ. 
రుద్ర: నవ్వుతూ.. తక్కువ కాదు అన్నీ ఎక్కువేనే.. అవతారం చూడు.. సిగ్గులేకుండా ఎందుకే అడిగి తిట్టించుకుంటావ్.. చూడవే నువ్వేక్కడ నేనెక్కడ నీకు నాకు జోడీ కుదిరిందా.. ఇంట్లో పడున్నావ్ కాబట్టి వాడుకున్నా.. ఏడ్చిపోతావ్ అని పక్కన చోటిచ్చా.. ఏదో ఒకరోజు నిన్ను విడిచిపెట్టాలనే డిసైడ్ అయ్యా..  నా చేతికి మట్టి అంటకుండా ఇప్పుడు మా అమ్మే ఆ పని చేస్తుంది. ఆరు నెలలు పోయాక ఎలాగూ నీకు పిల్లలు పుట్టరు. నిన్ను మెడ పట్టుకొని బయటకు గెంటేస్తుంది. నాకు ఇంకో పెళ్లి చేస్తుంది. హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. సౌండ్ చేయకు.. 

మరోవైపు సత్య ఇంట్లో పెళ్లి చూపులకు ఏర్పాట్లు జరుగుతుంటాయి. మైత్రి పూలు గుచ్చుతూ ఉంటుంది. ఇక హర్ష ఎదురుగా కూర్చొని ఒకర్ని ఒకరు చూసుకుంటారు. ఇంతలో సంధ్య వచ్చి ఇద్దరూ ఒకదగ్గరకు చేరితే పనులు ఎలా అవుతాయి అని అడుగుతుంది. ఇక సత్యకు బామ్మ నగలుతో రెడీ చేయాలి అనుకుంటే సత్య తనకు సింపుల్‌గా ఉండటమే ఇష్టమని చెప్తుంది.  

భైరవి: మీరు అడిగితే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వను అంటాడా.. 
రుద్ర: మినిస్టర్ కదా అమ్మా రెచ్చిపోతున్నాడు.
భైరవి: ఏమయ్యా నువ్వేం చేస్తావో నాకు తెలీదు.. అన్న వాళ్లు నోరు మూసుకునేలా నువ్వు ఎమ్మెల్యే అయి చూపించాలి.
క్రిష్: అమ్మా నువ్వు ఊరుకో వాడు ఏదో అన్నాడు అని ఆవేశపడకు. ఆలోచించి ముందడుగు వేయాలి. 
రుద్ర: అంటే ఏంటి చిన్నా నువ్వు అనేది బాపుని అంతలా అవమానించినోడిని చూసి చూడనట్లు వదిలేయ్ మంటావా..
క్రిష్: అని నేను అన్నానా.. ఆవేశం పక్కన పెట్టి ఆలోచించమని అంటున్నా..
మహదేవయ్య: ఇక ఆలోచించేది ఏం లేదు.. బరిలోకి దిగాల్సిందే.. వాడికి పొగరు ఉంటే మనకు ఫవర్ ఉంది. మనల్ని ఎదురించి నామినేషన్ వేసేవాడు ఎవడో చూస్తాను.
క్రిష్: (మినిస్టర్ కూతురుతో కలిసి ఇంటికి వస్తాడు.) ఈ పిల్ల ఏంటి నన్ను చూసి సిగ్గు పడుతుంది. అయినా ఏంటిలే మనం ఇక్కడి నుంచి చెక్కేస్తే బెటర్.
మినిస్టర్: ఏంటి చిన్నా వెళ్లిపోతున్నావ్. చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఉండు బాబు.
క్రిష్‌: వీడికి నాతో పనేంటి. ఏదైనా సెటిల్ మెంట్ చేయాలేమో..
మినిస్టర్: మహదేవయ్య గారు అక్కడ కాదు అని ఇక్కడ కూతురుతో వచ్చాను అని ఆశ్చర్యంగా చూస్తున్నారా.. అంత కంటే ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని వచ్చాను. 
మహదేవయ్య: అవసరం రాగానే నా ఇల్లు గుర్తొచ్చిందా..
మినిస్టర్: ఆ అవసరం మీ ఇంట్లోనే ఉంది కాబట్టి. తిను మా అమ్మాయి శైలు. మా శైలు మీ అబ్బాయిని ప్రేమిస్తుంది. పిల్లల సంతోషం కంటే మనకు ఏదీ ముఖ్యం కాదు కదా అందుకే మీ దగ్గరకు వచ్చా.
భైరవి: నిన్ను చూస్తే చాలా గమ్మత్తుగా ఉంది ధర్మ. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి అడ్డొచ్చిన రౌడీయిజం పిల్లని ఇవ్వడానికి అడ్డురాలేదా.. 
మినిస్టర్: రాజకీయం జనాలకు సంబంధించినది. కానీ కూతురు ప్రేమకు సంబంధించినది అక్క.
భైరవి: పోనీలే నీ రాజకీయ బుద్ధులు కూతురు దగ్గర చూపించలేదు.
మహదేవయ్య: కూతురు ప్రేమ కోసం నువ్వు అంత ఆలోచించినప్పుడు కొడుకు జీవితం కోసం మేం కూడా ఆలోచించాలి కదా.. మాకు ఇష్టమే.. క్రిష్‌ షాక్ అయిపోతాడు. 
మినిస్టర్: మరి అబ్బాయికి.
మహదేవయ్య: క్రిష్ చెప్పబోతే.. వాడు నా రక్తం వాడి మాటే నా నోటి నుంచి వస్తుంది. 
క్రిష్‌: మనసులో బాపు నాతో కనీసం ఒక్క మాటకూడా అడగకుండా ఓకే అనేశాడు. ఇష్టం లేని పెళ్లి నేను చేసుకోలేను. అయినా ఇప్పుడు ఇష్టం లేదు అని చెప్తే ఎందుకు అని అడుగుతారు. అప్పుడు సంపంగిని ప్రేమించిన విషయం చెప్పాలి. తన వైపు నుంచి ఎటువంటి అంగీకారం లేకుండా అనవసరంగా నోరు జారుడు మంచిది కాదు ప్రస్తుతానికి సైలెంట్‌గా ఉండాలి. 
మినిస్టర్: అయితే నిశ్చితార్థం, పెళ్లికి ముహూర్తాలు పెట్టేద్దాం.
మహదేవయ్య: అంత తొందర ఎందుకు ఇంకా తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. 
క్రిష్: తొందర పడి బాపుని అపార్థం చేసుకున్నా అనుకుంటా ఇప్పుడు నన్ను అడుగుతాడు అనుకుంటా.. 
మహదేవయ్య: సముజ్జి అనేది కయ్యానికి వియ్యానికి ఉండాలి. నువ్వు అడిగావ్ నేను ఒప్పుకున్నాను. మరి నువ్వు దేనికి ఒప్పుకుంటున్నావ్.
మినిస్టర్: అర్థమైంది ఎమ్మెల్యే సీటు ఈ సారి మీకు ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాను. మీతో వియ్యం అందుకోవడానికి ఆ మాత్రం హౌకమాండ్‌ని చూసుకోలేనా..
భైరవి: అయితే మా ఆయన ఎమ్మెల్యే అయిన మరుక్షణం మీ ఇంటి అమ్మాయి ఈ ఇంటి కోడలు అవుతుంది. 
క్రిష్‌: బయటకు వచ్చి.. లాభం లేదు వెంటనే నా ప్రేమ విషయం సంపంగితో తేల్చుకోవాలి. క్రిష్‌కి బాబీ కాల్ చేస్తే జరిగిందంతా చెప్తాడు.  
బాబీ: అదేంటి అన్న వదిన గురించి ఇంట్లో చెప్పలేదా.
క్రిష్‌: ఏం చెప్పాలిరా. నేను వదినతో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఒకవేళ మా బాపూ ఆ అమ్మాయిని తీసుకొని రమ్మంటే నేను తీసుకొని రాగలనా.. నువ్వు చెప్పు ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఇంక ఆలస్యం చేయడం లాభం లేదురా.. అందుకే సక్కగా సంపంగితో విషయం చెప్పి నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని అడిగేస్తా.. ఇప్పుడు వాళ్ల ఇంటికే వెళ్తున్నా.. 
బాబీ: అన్నా నన్నూ రమ్మంటావా..
క్రిష్‌: ఏమ్ వద్దూ నువ్ ఫోన్ పెట్టు.
కాళీ: ఆ సత్య ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతున్నాయి. ఇప్పుడు కానీ ఆ క్రిష్ గాడు వాళ్ల ఇంటికి వెళ్తే మొత్తం చెడిపోతుంది. క్రిష్‌ గాడిని ఎలా అయినా ఆపాలి.

మరోవైపు సత్య చీర కట్టుకుంటుంది. క్రిష్ కూడా సత్య ఇంటికి బయల్దేరుతాడు. కుచ్చుళ్లతో హెల్ప్ చేయమని సంధ్యని అడిగితే సంధ్య సత్యకు సెటైర్లు వేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ జనవరి 23rd: ధాన్యలక్ష్మీ, అపర్ణ మధ్య గొడవ పెట్టిన రుద్రాణి - రుద్రాణిని వాయించిన స్వప్న

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Govt Good News ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం డబుల్ బొనాంజా! - గురువారం ప్రకటించే అవకాశం
ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం డబుల్ బొనాంజా! - గురువారం ప్రకటించే అవకాశం
New Year 2025: న్యూ ఇయర్ సందర్భంగా అమాంతం పెరిగిన కండోమ్ ఆర్డర్స్, ఇండియన్స్ ఇంకా ఏమేం కొన్నారంటే!
న్యూ ఇయర్ సందర్భంగా అమాంతం పెరిగిన కండోమ్ ఆర్డర్స్, ఇండియన్స్ ఇంకా ఏమేం కొన్నారంటే!
SSMB29: ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
Big Blow For Australia: ఆస్ట్రేలియాకు భారీ షాక్, ఐదో టెస్టుకు గాయంతో స్టార్ ప్లేయర్ దూరం! సిరీస్ సమమైతే ట్రోఫీ భారత్ వశం
ఆస్ట్రేలియాకు భారీ షాక్, ఐదో టెస్టుకు గాయంతో స్టార్ ప్లేయర్ దూరం! సిరీస్ సమమైతే ట్రోఫీ భారత్ వశం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Fishing in Yanam | చేపలు పట్టడంలో ఇదో కొత్త పంథాLorry Rushed in to Xerox Shop | విశాఖలో ప్రమాదం..జిరాక్సు షాపులోకి దూసుకెళ్లిన లారీ | ABP DesamVizag Dolphin Pool Cricket Ground | విశాఖలో డాల్ఫిన్ పూల్ క్రికెట్ గ్రౌండ్ తెలుసా.? | ABP DesamADR Report on Chief Ministers Assets | దేశంలోనే నిరుపేద ముఖ్యమంత్రి ఈమె

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Govt Good News ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం డబుల్ బొనాంజా! - గురువారం ప్రకటించే అవకాశం
ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం డబుల్ బొనాంజా! - గురువారం ప్రకటించే అవకాశం
New Year 2025: న్యూ ఇయర్ సందర్భంగా అమాంతం పెరిగిన కండోమ్ ఆర్డర్స్, ఇండియన్స్ ఇంకా ఏమేం కొన్నారంటే!
న్యూ ఇయర్ సందర్భంగా అమాంతం పెరిగిన కండోమ్ ఆర్డర్స్, ఇండియన్స్ ఇంకా ఏమేం కొన్నారంటే!
SSMB29: ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
Big Blow For Australia: ఆస్ట్రేలియాకు భారీ షాక్, ఐదో టెస్టుకు గాయంతో స్టార్ ప్లేయర్ దూరం! సిరీస్ సమమైతే ట్రోఫీ భారత్ వశం
ఆస్ట్రేలియాకు భారీ షాక్, ఐదో టెస్టుకు గాయంతో స్టార్ ప్లేయర్ దూరం! సిరీస్ సమమైతే ట్రోఫీ భారత్ వశం
First Flight Experience : మొదటిసారి విమానంలో ప్రయాణిస్తుంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే.. ఆ విషయం అస్సలు మరచిపోకండి
మొదటిసారి విమానంలో ప్రయాణిస్తుంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే.. ఆ విషయం అస్సలు మరచిపోకండి
Perni Nani Wife: బియ్యం మాయం కేసు- పేర్ని నాని సతీమణికి మరోసారి పోలీసుల నోటీసులు
బియ్యం మాయం కేసు- పేర్ని నాని సతీమణికి మరోసారి పోలీసుల నోటీసులు
LPG Cylinder Price Cut: న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
Hyderabad Drunk And Drive Cases: మందుబాబుల జోరు - హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
మందుబాబుల జోరు - హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
Embed widget