అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today January 18th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: రామ్‌కి ముద్దు పెట్టేసిన సీత, కోడలికి చుక్కలు చూపించాలని చిన్న అత్తామామల ప్లాన్!

Seethe Ramudi Katnam Serial Today Episode ఇంటి పనులన్నీ చేస్తానని సీత ఒప్పుకోవడంతో అర్చన, గిరిధర్‌లు సీతతో ఇష్టమొచ్చినట్లు పనులు చేయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode: సీత టైలరింగ్ మానేస్తానని.. రామ్‌కి మాటిస్తుంది. అయితే కొంచెం పెండింగ్ వర్క్ ఉందని అది మాత్రం పూర్తిచేసేస్తాను అని చెప్తుంది. దానికి రామ్ ఒప్పుకుంటాడు. అయితే చాలా ఎక్కువ పని ఉండడంతో రామ్ సీతకు సాయం చేస్తాడు. సీత చెప్పినట్లు బ్లౌజ్‌కి ఉక్కులు వేస్తాడు. అది దూరం నుంచి గిరిధర్, అర్చనలు చూస్తారు.

అర్చన: వీడేంటండి సీతతో టైలరింగ్ మాన్పిస్తానని చెప్పి సీత పక్కన చేరి టైలరింగ్ నేర్చుకుంటున్నాడు. 
గిరిధర్: సీత రామ్‌ని చెడగొట్టేసింది. వెంటనే మనం ఆపకపోతే.. రామ్ కూడా సీతతో కలిసి టైలరింగ్ చేసేలా ఉన్నాడు.
అర్చన: సీత పని చెప్దాం పదండి.
చలపతి: మొగుడు పెళ్లాలు బెడ్ రూంలో ఉంటే దొంగ చాటుగా వినే దరిద్రపు అలవాటు మీ మొగుడు పెళ్లాలకి ఏంటి.
అర్చన: రూమ్‌లో రామ్ ఏం చేస్తున్నాడో తెలుసా..
గరిధర్: ఆడవారి బ్లౌజ్‌లకు ఉక్సులు కుడుతున్నాడు అసహ్యంగా..
చలపతి: వాళ్లిద్దరూ మొగుడు పెళ్లాలు బెడ్ రూంలో ఏదో ఒకటి చేసుకుంటారు. మధ్యలో మీరు అడ్డుపడతారు ఏంటి చండాలంగా..
అర్చన: రామ్ ఆడవారి పని చేయడం ఏంటి దరిద్రంగా..
చలపతి: ఏంటి చెల్లమ్మా.. బావగారు ఎప్పుడూ నీ పని చేయలేదా రొమాంటిక్‌గా..
గిరిధర్: ఛీ..ఛీ.. నేను తన పనులు చేయడం ఏంటి..
చలపతి: పెళ్లాం పనులు చేయడం కూడా తప్పు అంటావ్ ఏంటి దుర్మార్గంగా.. వెళ్లండి వాళ్ల పని వాళ్లు చేసుకుంటున్నారు. వెళ్లి మీ పని మీరు చేసుకోండి.
అర్చన: ఈ సీత మామూలుది కాదు మెల్లగా రామ్‌ని తన బుట్టలో వేసుకుంది.
గిరిధర్: తన పని చూద్దాం అంటే ఈ చలపతి మనకు అడ్డుపడ్డాడు. 
అర్చన: రేపు తెల్లారాక అంతుచూద్దాం. ఇంటి పని అంతా చెప్పి సీతకు చుక్కలు చూపిద్దాం.

సీత: అరే.. భలే కుట్టావ్ మామ.. మొదటిసారి సూపర్‌గా కుట్టావ్.. కంగ్రాట్స్.. సూపర్.. 
రామ్: హలో నేనేదో ఒలిపింక్ మెడల్ కొట్టినట్లు ఆ క్లాప్స్ ఏంటి.
సీత: మెడల్ కొడితేనే మెచ్చుకోవాలా మామ.. ఉదయం.. మామా.. లంచ్ రెడీ అయింది తీసుకెళ్లండి.
రామ్: మార్నింగ్ టిఫెన్ పెట్టావ్.. అప్పుడే లంచ్ కూడా చేసేశావా.. 
సీత: మరి ఇంటి బాధ్యతలు తీసుకున్నా కదా మామ. మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి కదా మామ. 
రామ్: నువ్వు నాకు ఎలాంటి ప్రాబ్లమ్ క్రియేట్ చేయకుండా పని చేసుకుంటూ పోతుంటే హ్యాపీగా నేను నా పని చేసుకుంటాను.
సీత: అది నా చేతిలో లేదు మామ. మీ వాళ్లు నాతో నడుచుకునే పద్ధతి బట్టి నా పని తీరు ఉంటుంది. వాళ్లు కామ్‌గా ఉంటే నేను కామ్‌గా ఉంటాను వాళ్లు రెచ్చిపోతే నేను రెచ్చిపోతా.. 
రామ్: నా మాట వినవే నువ్వు. 
సీత: మీ మాట విన్నందుకే పొద్దున లేచి ఇంటి పనులు అన్నీ చేశాను. అది సరే మరి నాకేం లేదా.. అదే మామ నువ్వు సినిమాలు చూడవా.. హీరో ఆఫీస్‌కు వెళ్తే హీరోయిన్ లంచ్ బాక్స్ ఇస్తుంది. అప్పుడు హీరో ప్రేమగా హీరోయిన్‌కి ఓ ముద్దు ఇచ్చి వెళ్తాడు. మన మధ్య అలాంటి సీన్ ఏం లేదా.. 
రామ్: అమ్మో నా వల్లకాదు నేను వెళ్తున్నా.. వదులు ఎవరైనా చూస్తారు. 
సీత: ఎవరు చూస్తే నాకేంటి నా ముద్దు నాకు ఇచ్చి వెళ్లండి. నాకు తెలుసు మామ నీ హీరోయిజం. పెళ్లాన్ని ముద్దు పెట్టుకోవడానికి కూడా నీకు మీ పిన్ని పర్మిషన్ కావాలి అంతేగా..
రామ్: పర్మిషన్ కాదు ఇంటి బయట అలా చేయకూడదు. ప్లీజ్ వదులు.
సీత: మీరు ఇవ్వకపోతే నేను ఇచ్చేస్తాను. 
రామ్: నువ్వు కిస్ చేస్తావా.. 
సీత: కిస్ చేయడానికి మీకు మీ పిన్ని పర్మిషన్ కావాలి నాకు కాదు. అంటూ ముద్దు పెట్టేస్తుంది. 
రామ్: రాక్షసివే నువ్వు నిన్ను చూస్తే భయం వేస్తుంది. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి మళ్లీ ఏం పంచాయితీ పెడుతుందో ఏంటో.. 

అర్చన: మన న్యూ ప్లాన్‌కి ముహుర్తం పెట్టాల్సిన టైం వచ్చేసింది మహా.
గిరిధర్: సీతకు చిన్నప్పుడు వాళ్ల అమ్మానాన్నలు చందమామ చూపించి గోరుముద్దలు తినిపించుంటారు. మనం చుక్కలు చూపించి షాకుల మీద షాకులు చూపిద్దాం. 
మహాభర్త: సీత నిద్ర లేచిందా..
రామ్‌చెల్లి: పొద్దున్నే లేచింది డాడీ అన్నయ్యకు టిఫిన్‌తో పాటు లంచ్‌కూడా ఇచ్చింది. 
మహాలక్ష్మి: రామ్ దగ్గర దాని పప్పులు ఉడికినా మన దగ్గర దాని ఆటలు సాగనివ్వకూడదు. ఈ కొత్త ప్లాన్‌లో నేను ఇన్వాల్వ్ అవ్వను. మీకు ఫుల్ ఫ్రీడం ఇస్తున్నా మీరు సీతని కబడ్డీ ఆడుకుంటారో.. కోకో ఆడుకుంటారో మీ ఇష్టం.
అర్చన: ఈ మాట కోసమే ఎదురుచూస్తున్నాం మహా. నువ్వు మాకు పవర్ ఇచ్చేశావ్ కదా.. ఇక సీతకు షాకుల్ని కేకుల్లా తినిపిస్తాం.
గిరిధర్: ఈ ఇళ్లు కన్నా చర్లపల్లి జైలే బెటర్ అనిపిస్తాం.
మహాభర్త: మీరేం చేసినా రామ్‌కి డౌట్ రాకుండా చేయండి.
మహాలక్ష్మి: అది వస్తున్నట్లు ఉంది ఆల్ ది బెస్ట్.

అర్చన, గిరిధర్‌, సీత ఆడబిడ్డలు గూడు పుటాని చేసి సీతకు చుక్కలు చూపించాలి అని అనుకుంటారు. అర్చన సీతని పిలిచి రామ్ పనులే చేస్తావా మా పనులు చేస్తావా అని అడుగుతుంది. సీత చేస్తాను అని చెప్పడంతో కాఫీ, టీ , జూస్, సలాడ్ ఇలా నలుగురు నాలుగు రకాలు చెప్తారు. సీత సరే అని చేసి తీసుకొస్తుంది. అయితే అవి బాలేదు అని సీతను మళ్లీ తీసుకురమ్మని చెప్తారు. ఇలా నాలుగు సార్లు సీతకు తిప్పుతారు. సీతకు అనుమానం వచ్చి చూస్తే వాళ్ల కావాలనే ఇబ్బంది పెడుతున్నట్లు తెలిసిపోతుంది. 

గిరిధర్: మన టీం వర్క్ ఇలానే ఉండాలి. సీతకు ఇంకా ఇంకా చుక్కలు కనిపించాలి. ఆ టార్చర్‌ భరించలేక సీత వద్దు బాబోయ్ అని రామాపురానికి పారిపోవాలి.
సీత: చిన్నమామ ఇదా మీ ప్లాన్ మీరు దొరక్కపోరు అప్పుడు ఉంటుంది. చెప్తా.. 

ఇక అందరూ అరటి పళ్లు తిని తొక్కలు అక్కడే పడేస్తారు. సీతకు క్లీన్ చేయమని అంటారు. సీత అంతా తీసి బయట పడేస్తుంది. ఇంతలో అక్కడ కొందరు రౌడీలు సీతని చూసి నవ్వుతారు. ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నారు అని సీత అడిగితే నీకు పిచ్చి అంట కదా మీ వాళ్లే చెప్పారు అని అంటారు. దీంతో సీత రాయి తీసుకొని వాళ్ల మీదకు విసురుతుంది. ఇక సీత తనను ఇంట్లో ఎవరూ పిచ్చిది అనరు అని తనని ఎవరైనా అలా అంటే చెప్పమని తన చిన్నమామయ్య అన్నారని గిరిధర్‌ని ఇరికించేస్తుంది. దీంతో రౌడీలు రెచ్చిపోయి ఆయన అంతు చూస్తాం అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  

Also Read: సత్యభామ సీరియల్ జనవరి 18th: సత్యభామకు అమ్మవారి కుంకుమతో ప్రేమ సందేశం పంపిన క్రిష్‌!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 13th:కేదార్‌ను కత్తితో పొడవబోయిన యువరాజు....అడ్డుపడిన కమలాకర్‌ చేతికి గాయం
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌ను కత్తితో పొడవబోయిన యువరాజు....అడ్డుపడిన కమలాకర్‌ చేతికి గాయం
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
Illu Illalu Pillalu Serial Today August 13th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
Godavari Serial Today August 13th: 'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget