Seethe Ramudi Katnam Serial Today January 11th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: విద్యాదేవిని ఘోరంగా అవమానించేలా చేసిన మహాలక్ష్మీ.. తలదించుకున్న సీత!
Seethe Ramudi Katnam Today Episode విద్యాదేవి తన భర్తని మోసం చేసి పెళ్లి చేసుకుందని మహాలక్ష్మీ అందరి ముందు విద్యాదేవి పరువు తీసేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode విద్యాదేవి లలిత, శివకృష్ణలతో సీత పెట్టిన దీపం ఆరిపోయిన విషయం చెప్తుంది. శివకృష్ణ, లలిత షాక్ అయిపోతారు. ఆ దోషం పోవాలి అనే పూజ పెట్టించానని చెప్తుంది. ఇంతలో సీత అక్కడికి రావడంతో ముగ్గురు షాక్ అయిపోతారు. సీత రాగానే టాపిక్ మార్చేస్తారు. సీత మహాలక్ష్మీతో ఇంకా ఇంకా ఆడుకుంటానని అంటుంది. అత్తాకోడళ్లకి జాగ్రత్తలు చెప్పి సీత తల్లిదండ్రులు బయల్దేరుతారు. మహాలక్ష్మీ సీఐని కలుస్తుంది. మెకానిక్ పారిపోయాడని అసిస్టెంట్ ద్వారా మొత్తం తెలుసుకున్నానని అంటాడు.
మహాలక్ష్మీ: వాడి వల్ల నా ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది. జైలులో ఉండాల్సిన సుమతి నాకు సవతి అయి కూర్చొంది. ఇప్పుడు సీత, సుమతిలు కలిసి నాతో ఆడుకుంటున్నారు. ఆ మెకానిక్ గాడు ఎక్కడికి వెళ్లినా సరే వాడిని నా దగ్గరకు తీసుకురండి.
త్రిలోక్: వాడి తప్పు ఏం లేదు మహాలక్ష్మీ గారు వాడికి తెలీకుండా కారు డెలివరీ ఇచ్చేశారు. వాడు మీకు కాల్ చేస్తే ఫోన్ స్విఛ్ ఆఫ్ వచ్చింది.
మహాలక్ష్మీ: తప్పొప్పులు అన్నీ తర్వాత చూద్దాం ముందు వాడు వస్తే నా దగ్గరకు తీసుకురండి. అప్పుడు ఏం చేయాలో నేను చెప్తా సీఐ గారు. రేపటి నా ప్లాన్‌లో తప్పు ఉండదు. ఆ సీతని ఎవరూ కాపాడలేరు.
ఇంటికి ఇద్దరు ఆడవాళ్లు వచ్చి సీతని పిలుస్తారు. సీత తన అత్తమ్మని పిలుస్తానని చెప్పి విద్యాదేవిని పిలుస్తుంది. వాళ్ల కూతురు సీమంతం అని వచ్చారని సీత విద్యాదేవితో చెప్తుంది. ఇక వాళ్లతో ఈవిడే మా అత్తమ్మ జనార్థన్ మామయ్య పెళ్లి చేసుకున్నారు ఈవిడను పిలవండి అని చెప్తుంది. వాళ్లు విద్యాదేవిని పిలిచి బొట్టు పెట్టే టైంకి మహా ఆపుతుంది. మీరు చనిపోయారు అని అన్నారు బతికే ఉన్నారా అని వాళ్లు అంటారు. ఈవిడను మీ భర్త పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు జనార్థన్ భార్య ఈవిడే అంట కదా అని అంటుంది.
మహాలక్ష్మీ: ఎవరెన్ని చెప్పినా జనా భార్యని నేనే. ఈవిడ మా ఆయన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది.
మహిళ: ఏంటి మోసం చేసి పెళ్లి చేసుకుందా.
మహాలక్ష్మీ: అవును కొంత మంది అవకాశావాదులు ఉంటారు ఎప్పుడు ఏ చిన్న అవకాశం దొరికినా తమ స్వార్థానికి వాడుకుంటారు. అలా నేను లేనప్పుడు ఈవిడ నా భర్తకి దగ్గరైంది మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుంది. ఇలాంటి వారికి మీరు గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ ఇంటి శుభకార్యానికి ఇలాంటి మనిషికి పిలవాల్సిన అవసరం లేదు అనుకుంటా.
సీత: ఆపండి అత్తయ్య బంగారం లాంటి టీచర్ గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు. ఎందుకు ఆవిడ వ్యక్తిత్వాన్ని పాడు చేస్తున్నారు.
మహాలక్ష్మీ: పరాయి మగాడి మీద మనసు పడిన ఆమెకి గౌరవం ఇవ్వాలా.
సీత: మీరు సుమతి అత్తయ్య చనిపోతే పెళ్లి చేసుకున్నట్లు ఈవిడ మీరు చనిపోయారని చేసుకున్నారు. చూడండి ఈవిడ చాలా మంచి వాళ్లు. నా మాట నమ్మండి.
మహిళ: సారీ సీత మాకు మహాలక్ష్మీ గారు ఎప్పటి నుంచో తెలుసు ఆవిడనే మేం నమ్ముతాం అయినా బాధలో జనార్థన్ గారు ఉంటే ఈవిడ ఆయన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి. మహాలక్ష్మీ గారు వచ్చిన తర్వాత కూడా ఈవిడ ఇంట్లో ఉండటం ఏంటి. ఇలాంటి వాళ్లని మేం చచ్చినా పిలవం. ఈవిడ వస్తే అది అశుభం అవుతుంది. మహాలక్ష్మీ గారు బతికే ఉన్నారని తెలిస్తే ముందు ఆవిడనే పిలిచేవాళ్లం. మీరు మాత్రమే సీమంతానికి రండి మహాలక్ష్మీ గారు కొంపలు కాపురాలు కూల్చేవారు మాకు వద్దు.
మహాలక్ష్మీ: వాళ్లు ఏమన్నారో విన్నావా సీత కొంపలు కాపురాలు కూల్చే వాళ్లు వాళ్లకి వద్దు అర్థమైంది అనుకుంటా.
సీత: ఎవరి కాపురాన్ని ఎవరు కాల్చారు అత్తయ్య.
మహాలక్ష్మీ: ఈవిడకు ఏ గుర్తింపు లేకుండా చేస్తాను ఎవరూ ఈవిడకు విలువ ఇవ్వకుండా చేస్తా ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నానా అని ఏడ్చేలా చేస్తాను.
అర్చన: ఈ ఇంట్లో ఎప్పటికీ మహాదే పై చేయి. అనవసరంగా మహాతో పెట్టుకున్నారు. మీ ఇద్దరికీ బతికుండగానే నరకం చూపిస్తుంది. సీత విద్యాదేవికి ధైర్యం చెప్పి వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: అదిరిపోయిన ట్విస్ట్.. బంటీతోనే రాజు, రూపలు.. మందారం, రాఘవని చూసేసిన తల్లీకొడుకులు!





















