Seethe Ramudi Katnam Serial Today January 10th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: ఖాళీ పేపర్ల మీద సంతకాలు.. ఇంట్లో ఇద్దరి పెళ్లాల రచ్చ!
Seethe Ramudi Katnam Today Episode మహా విద్యాదేవి సుమతి కాదని సంతకం పెట్టమంటే సీత మహాతో ఎప్పటికీ విద్యా జనా భార్యగా ఆ ఇంట్లోనే ఉంటుందని సంతకం పెట్టమని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Serial Today Episode సీత తల్లిదండ్రులు ఇంటికి వస్తారు. మా చెల్లిని పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అని శివకృష్ణ జనార్థన్‌తో అంటాడు. దాంతో అర్చన, గిరిలు మీ చెల్లి ఏంటి అని అడుగుతారు. దానికి లలిత టీచర్ తన భర్తని నోరారా అన్నయ్య అని పిలుస్తుందని అలా అన్నారని అంటుంది.
మహాలక్ష్మీ: అంతేనా లేక అప్పట్లో ఆవిడే సుమతి అని మీరు ఆడిన నాటకం మళ్లీ మొదలు పెట్టాలని అనుకుంటున్నారా. చూస్తుంటే వీళ్లు అందుకే వచ్చినట్లు ఉన్నారు జనా. నువ్వు ఆవిడను పెళ్లి చేసుకోవడం సంతోషం అన్నట్లు మాట్లాడుతున్నారు. పైగా ఈ శివకృష్ణ ఆవిడ సొంత చెల్లి అన్నట్లు మాట్లాడుతున్నారు. అప్పట్లో నేను జనా పక్కన ఉండగానే ఈవిడే సుమతి అని నిరూపించాలని తెగ ట్రై చేశారు. ఇప్పుడు నేను లేని టైం చూసి సీత ఈ పెళ్లి చేసింది. నేను రావగానే వీళ్లు వచ్చారని తెలుసుకొని రావడం వెనక నాకు అనుమానంగా ఉంది.
సీత: ఏంటి మీ అనుమానం అత్తయ్య.
మహాలక్ష్మీ: రేపు ఎప్పుడైనా ఈవిడే సుమతి అని చెప్పరు అని గ్యారెంటీ ఏంటి.
గిరిధర్: అవును వదినా ఇదంతా వాళ్ల ప్లానే.
చలపతి: సీతతో అలా మీరే చెప్పించేలా ఉన్నారు.
మహాలక్ష్మీ: ఈ విద్యాదేవి ఒక పని చేయాలి ఎవరు చెప్పినా ఆఖరికి నేను చెప్పినా నేను సుమతి కాదు విద్యాదేవినే అని ఒక తెల్ల పేపర్ మీద సంతకం చేసి ఇవ్వాలి. రేపు తను సుమతి అని ఎదురు తిరగకుండా సంతకం చేసిన ఆ పేపర్ సాక్ష్యంగా ఉంటుంది. వీళ్ల మనసులో ఎలాంటి దురుద్దేశం లేకపోతే సంతకం పెట్టి ఇవ్వమని చెప్పండి.
గిరిధర్, అర్చనలు మహాలక్ష్మీకి సపోర్ట్ చేస్తారు. ఇక రామ్ తన పిన్ని అడిగిన సంతకం పెట్టమని చెప్తాడు. విద్యాదేవి టీచర్ సంతకం చేస్తారని సీత అంటుంది. టీచర్, సీత తల్లిదండ్రులు షాక్ అవుతారు. మహాలక్ష్మీ విద్యాదేవికి పేపర్ ఇచ్చి సంతకం పెట్టమంటుంది. టీచర్ సంతకం పెట్టడానికి రెడీ అవుతుంది. సరిగ్గా సంతకం పెట్టే టైంకి సీత ఆపుతుంది. పేపర్ సగం మడవమని కింద మహాలక్ష్మీ సంతకం పెడుతుందని అంటుంది.
మహాలక్ష్మీ: నేను ఎందుకు పెడతాను.
సీత: ఆమె సుమతి కాదు విద్యాదేవి కాదు చెప్పి సంతకం పెట్టమని మీరు అన్నారు. అలాగే ఆవిడ జనార్థన్ మామయ్య భార్యగా ఎప్పటికీ ఈ ఇంట్లోనే ఉంటారని మీరు రాసి సంతకం పెట్టండి.
మహాలక్ష్మీ: నేను అలా ఎందుకు రాసి ఇవ్వాలి. దానికి దీనికి సంబంధం ఏంటి.
సీత: ఆవిడ సుమతి కాదు అని మీరు అంటున్నారు. మరి మామయ్య భార్యగా ఆవిడ ఇక్కడ ఉండాలి అంటే సెక్యూరిటీ ఉండాలి కదా.
చలపతి: కరెక్ట్‌గా అడిగావు సీత. రేపు నువ్వు ఆమెను ఇంట్లోనుంచు పంపవు అని గ్యారెంటీ ఉండాలి కదా.
గిరిధర్: అలా ఎలా కుదురుతుంది.
మహాలక్ష్మీ: నేను అలా రాసివ్వడం కుదరదు.
సీత: అయితే టీచర్ కూడా మీరు చెప్పినట్లు చేయరు అని పేపర్ చింపేస్తుంది.
మహాలక్ష్మీ: సీతా.. మీరు చెప్పినట్లు మీరు చేయాలా. నేను చెప్పినట్లు మీరు వినాలా.
జనార్థన్: ఇంక చాలు ఆపు మహా అనవసరంగా గొడవలు వద్దు. ఆవిడ ఎప్పటికీ విద్యాదేవినే. ఎవరు ఏం రాయొద్దు అందరూ వెళ్లండి.
సుమతి అత్తమ్మని ఇరికించాలని చాలా ప్రయత్నించారని నేను మీకు అడ్డుగా ఉంటానని సీత అంటుంది. ఎన్ని రోజులు అడ్డుగా ఉంటావో నేనూ చూస్తానని మహాలక్ష్మీ అంటుంది. సుమతిగానే మిగిలిపోతావేమో అని లలిత, శివలు టీచర్‌తో చెప్తారు. మీకే టైం పట్టిందని వీళ్లకు టైం పడుతుందని అంటుంది. మహాలక్ష్మీకి నిజం తెలిసి తన స్థానం పోతుందని భయంతో నన్ను తొక్కేయాలి అని చూస్తుందని అంటుంది. నా విషయం ఎలాగోలా తెలుస్తుంది కానీ నా టెన్షన్ అంతా సీత కోసమే అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.