Seethe Ramudi Katnam Serial Today February 7th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: నాగు వల్ల మహాలక్ష్మీ, అర్చనలకు నానావస్థలు.. కాఫీ కప్పులతో సీత ఎంక్వైరీ!
Seethe Ramudi Katnam Today Episode నాగు అర్చన గదిలో ఉండగా సీతకి అనుమానం వచ్చి ఆ గదిలోకి రావడం మహా, అర్చన చాలా టెన్షన్ పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode సీత ఇద్దరు అత్తల దగ్గరకు వచ్చి ఆ రౌడీల దయ వల్ల నా మామ రోజు రోజుకి కృష్ణుడు అయిపోతున్నాడని ముద్దులు కావాలని అడుగుతున్నాడని చెప్తుంది. అర్చన మహాతో ఇంత చండాలంగా మాట్లాడుతుందేంటి మహా అని అంటే దీని సంగతి తర్వాత చెప్దాం ముందు నాగు సంగతి చూద్దాం పద అని మేడ మీదకు వెళ్తారు.
నాగు అర్చన బెడ్ మీద దర్జాగా పడుకొని ఉంటే మహాలక్ష్మీ వాళ్లు చూసి ఏంట్రా ఇంత దర్జాగా ఉన్నావ్ అని తిడతారు. దానికి నాగు పది లక్షలు ఇస్తే సరే సరి లేదంటే మొత్తం బయట పెట్టేస్తా అని అంటాడు. నాకు ఎలాగూ జైలు కొత్త కాదని మీరు మాత్రం జైలుకి రావడానికి రెడీగా ఉన్నారా అని అడుగుతాడు. సీత దగ్గరకు వెళ్లి నా ముఖం చూపిస్తా అని అంటాడు. ఇప్పుడు డబ్బులు లేవని తర్వాత ఇస్తానని మహాలక్ష్మీ అంటుంది. దాంతో నాగు ఒప్పుకోడు ఈరోజు ఇవ్వాలి లేదంటే ఇక్కడే ఉంటాను అని అంటాడు. మహాలక్ష్మీ గిరికి కాల్ చేసి బ్యాంక్‌కి వెళ్లి పది లక్షలు తీసుకురమ్మని చెప్తుంది. అరగంటలో గిరి తీసుకొస్తానని చెప్తాడు.
నాగు స్ట్రాంగ్ కాఫీ తీసుకురమ్మని చెప్తాడు. మహాలక్ష్మీ వెళ్తుంది. నాగు ఆపిల్ తింటూ అర్చనను చూస్తుంటే వీడి చూపు బాలేదని అర్చన కూడా మహాలక్ష్మీ వెనక వెళ్తుంది. మహాలక్ష్మీ, అర్చనలు కిచెక్‌కి వెళ్లి పనామెను పంపి కాఫీ పెడతారు. రెండు కప్పులు తీసుకెళ్తారు. సీత మీరు ఎవరి కోసం కాఫీ తీసుకెళ్తున్నారు అంటే మా కోసం మేం మా రూంలో కాఫీ తాగుతామని అంటారు. సీతకు ఇద్దరి మీద డౌట్ వస్తుంది. ఇక కిచెన్‌కి వెళ్లి కాఫీ టేస్ట్ చేస్తారు. అది చేదుగా ఉంటుంది. దాంతో సీత వాళ్లకి మంచి కాఫీ రుచి చూపిస్తాను అని అలాగే వాళ్లు రహస్యం ఏంటో చూసుకొస్తానని అనుకుంటుంది.
మహాలక్ష్మీ, అర్చనలు కాఫీ నాగుకి ఇస్తారు. బాలేదని మరో కాఫీ కావాలని నాగు అంటాడు. ఇంతలో సీత రెండు కాఫీ కప్పులు పట్టుకొని వస్తుంది. ఇద్దరు అత్తలు చూసి షాక్ అయి బిగుసుకుపోతారు. సీత వాళ్లతో మీరు కలిపిన కాఫీ చెండాలంగా ఉందని నేను తీసుకొచ్చానని అంటుంది. ఇక మహాలక్ష్మీ నాగు వైపు చూస్తే నాగు బెడ్ వెనక్కి వెళ్లి దాక్కుంటాడు. ఇద్దరూ కాఫీ తీసుకుంటారు. మీరు ఎందుకు కాఫీ పెట్టుకున్నారని అంటే నీ వల్లే అని అర్చన అంటుంది. నువ్వు కిడ్నాప్ అయిన నాటి నుంచి అని అంటుంది. ఇంతలో నాగు దగ్గుతాడు. దాన్ని కవర్ చేయడానికి మహాలక్ష్మీ, అర్చన ఇద్దరూ ఒకే సారి మాట్లాడుతారు. సీత కాఫీ ఇచ్చి వెళ్లిపోతుంది. వెళ్తూ వెళ్తూ ఇందాక మీరు తీసుకొచ్చిన కాఫీ కప్పులు ఏవి అంటే కంగారులో రకరకాల సమాధానాలు చెప్తారు. సీత వెళ్లిపోయిన తర్వాత అర్చన గది డోర్ లాక్ చేస్తుంది.
ఇక గిరి అర్చన తాగిన కాఫీ తాగి కాఫీ అద్భుతంగా ఉందని అంటాడు. నేను తాగిన కాఫీరా అంటే అయినా బాగుంది అంటాడు. ఇక మహాలక్ష్మీ అర్చనను కిందకి పంపి గిరి డబ్బులు తీసుకొస్తే తీసుకురమ్మని చెప్తుంది. అర్చన గేటు దగ్గరే వెయిట్ చేస్తుంది. ఇంతలో ఓ వ్యక్తితో గిరి డబ్బు పంపిస్తాడు. అర్చన తీసుకొని వెళ్తుంది. ఇద్దరూ నాగుకి డబ్బు ఇచ్చి వెళ్లమంటుంది. అర్చన ముందు వెళ్లి ఎవరైనా ఉన్నారా లేదా అని చెక్ చేస్తుంది. ఎవరి కంటా పడొద్దని చెప్పి మహా నాగుని వెళ్లమని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: ఫస్ట్ నైట్ ఆటల్లో సత్యకి అవమానం.. చివరి నిమిషంలో మెలిక.. సంజయ్ ఆశలు అడియాసలేనా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

