Seethe Ramudi Katnam Serial Today February 6th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహాలక్ష్మీ ఇంట్లో రౌడీ నాగు.. ప్రశ్నించిన రామ్.. సీత గుర్తు పట్టేస్తుందా!
Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మికి డబ్బులు డిమాండ్ చేస్తూ నాగు ఇంటికి రావడం రామ్ నాగుని నిలదీయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode రౌడీలు దొరికిపోయాని సీత కావాలనే అర్చనకు చెప్తుంది. దాంతో అర్చన భయపడి మహాలక్ష్మీ దగ్గరకు పరుగులు తీస్తుంది. నాగు వాళ్ల గురించి శివకృష్ణకు తెలిసిపోయిందని సీత చెప్పిందని అర్చన చెప్తుంది. దాంతో మహాలక్ష్మీ సీతకు నిజంగానే నిజం తెలిస్తే మన ఇద్దరిని ఓ ఆట ఆడించేది అలా లేదు కాబట్టే తాపీగా ఉందని నువ్వు ఇలా మాటి మాటికి భయపడితే మనం దొరికిపోతామని మహాలక్ష్మీ అర్చనతో అంటుంది. ఇంతలో నాగు అర్చనకు కాల్ చేస్తాడు.
మహాలక్ష్మీ: మాకు ఫోన్ చేయొద్దని నీకు ఎన్ని సార్లు చెప్పాలి.
నాగు: పేమెంట్ కోసం చేశాను మేడం.
మహాలక్ష్మీ: మేం చెప్పిన పని చేయలేదు కానీ డబ్బులు కావాలంటా. ఎంతో కొంత ఇస్తానని చెప్పాను కదా.
నాగు: మా కోసం పోలీసులు వెతుకుతున్నారు. అండర్ గ్రౌండ్‌లో దాక్కోవాలి. దానికి చాలా ఖర్చు అవుతుంది.
మహాలక్ష్మీ: ఇంకా కొన్నాళ్లు అక్కడే ఉండండి బయటకు వస్తే డబ్బులు ఇస్తా.
నాగు: బయటకు కాదు మీ ఇంటి ముందు నుంచే మాట్లాడుతున్నా. ఇప్పుడే మీ ఇంటి లోపలికి వచ్చి మీ గుట్టు మొత్తం బయట పెడతా.
అర్చన మేడ మీద నుంచి చూస్తే బయట నాగు ఉంటాడు. మహాలక్ష్మీకి నాగు వచ్చాడని చెప్పి చాలా భయపడుతుంది. వాడిని ఏం చేయాలో నాకు తెలుసు అని మహాలక్ష్మీ అర్చనను తీసుకొని బయటకు వెళ్తుంది. ఇక సీత రౌడీలు దొరికిపోయారు అని చెప్పినప్పుడు అర్చన భయపడిన విషయం విద్యాదేవితో చెప్తుంది. కంగారుగా ఆరాలు తీసిందని అంటుంది. మహాలక్ష్మీ, అర్చనలు కావాలనే తనని ప్రీతి, ఉషలతో పంపారని మధ్యలో వదిలేయడం.. వెంటనే రౌడీలు కిడ్నాప్ చేయడం వెనక వీళ్లే ఉన్నారని సీత అంటుంది. మెయిన్ రౌడీ ఇంకా తనకు బాగా గుర్తున్నాడని చెప్తుంది సీత.
విద్యాదేవి తనలో తాను మహాలక్ష్మీ నీ పాపం పండే రోజు దగ్గర పడింది నువ్వు ఎంత చెడ్డదానివో త్వరలోనే అందరికీ తెలుస్తుంది అని అనుకుంటుంది. ఇక రౌడీ నాగు గేటు తీసుకొని వస్తుంటే సాంబ ఆపుతాడు. దాంతో నాగు సాంబని కొడతాడు. ఆఫీస్‌కి వెళ్తున్న రామ్ ఎవరని అడిగితే మహాలక్ష్మీ అమ్మగారు తనకు తెలుసని తోసుకుంటూ లోపలికి వచ్చాడని సాంబ చెప్తాడు.
రామ్: మర్యాదగా చెప్పు ఎవరు నువ్వు మా పిన్ని నీకు ఎలా తెలుసు. చెప్పరా మా పిన్ని నీకు తెలుసా.
మహాలక్ష్మీ: రామ్ నాకు వాడు తెలుసు. ప్లంబర్ రామ్ అర్చన బెడ్ రూమ్‌లో వాష్ రూం పని చేయడం లేదు. అందుకే పిలిచా.
రామ్: నిన్ను ఎక్కడో చూశాను. ఎక్కడ చూశాను. అయినా మీరు ఏంటి పిన్ని ప్లంబర్‌ని చూసి అంత కంగారు పడుతున్నారు.
మహాలక్ష్మీ: సీత కిడ్నాప్ అయినప్పటి నుంచి ఎవరిని చూసినా భయంగా ఉంది రామ్.
సాంబ: ఈ ప్లంబర్ మీకు తెలుసు కదా మేడం. భయం ఎందుకు.
మహాలక్ష్మీ: మనసులో ఆఖరికి వాచ్ మెన్ కూడా లాజిక్‌లు అడుగుతున్నాడు.
సీత రామ్‌ని వెతుక్కుంటూ వస్తుంటుంది. సీత వాడిని చూస్తే గుర్తు పడుతుందని అర్చన అంటుంది. దాంతో మహాలక్ష్మీ అర్చన చేయి గిచ్చేసి సీతని అయింట్ మెంట్ తీసుకురమ్మని చెప్తుంది. సీత వెళ్లగానే నాగుని అర్చన గదికి పంపుతుంది. అర్చన సీత నాగుని చూడకుండా మధ్యలో వెయిట్ చేస్తూ నాగుని పైకి పంపి సీతని బయటకు పంపిస్తుంది. సీత బయటకు వెళ్లి రామ్ సీత ఒకరికి ఒకరు ముద్దులు పెట్టుకొని ఐలవ్‌యూలు చెప్పుకుంటారు. అది మహాలక్ష్మీ, అర్చనలు చిరాకు పడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

