అన్వేషించండి

Karthika Deepam 2 Serial Today February 6th: కార్తీకదీపం 2 సీరియల్: పుష్ప రేంజ్‌లో జ్యోత్స్నకి వార్నింగ్ ఇచ్చిన కార్తీక్.. తల్లి నగలు చెక్ చేసిన జ్యోత్స్న!

Karthika Deepam 2 Serial Today Episode జ్యోత్స్న కార్తీక్ ఇంటికి రావడం చూసిన కార్తీక్ మరదలికి మాస్ వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode శౌర్య ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. శౌర్యని చూడటానికి దీప, కార్తీక్ వెళ్తారు. పాప దీప, కార్తీక్‌లతో నాకు ఏమైంది అని అడుగుతుంది. ఇంటికి ఎప్పుడు వెళ్లిపోతాం అని అడుగుతుంది. ఇంతలో డాక్టర్ వచ్చి నువ్వు ఇంకా వారం ఇక్కడే ఉండాలి అని చెప్తాడు. కార్తీక్, దీప కూడా ఉంటాం అని చెప్పడంతో నేను ఉంటానని శౌర్య చెప్తుంది. డాక్టర్ పాపని చెక్ చేసి ఇక ఏ ప్రాబ్లమ్ లేదని చెప్తాడు. పాపని పడుకోమని చెప్తే కథ చెప్పమని కార్తీక్‌ని అడుగుతుంది. దాంతో కార్తీక్ కథ చెప్తాడు.

వారం తర్వాత కార్తీక్, దీపలు పాపని తీసుకొని ఇంటికి వెళ్తే అనసూయ దిష్టి తీస్తుంది. జ్యోత్స్న దూరం నుంచి అదంతా చూస్తుంది. అందరూ శౌర్యని ముద్దాడుతారు. అమ్మ చెప్పినట్లే వినాలి అని అందరూ శౌర్యకి చెప్తారు. జ్యోత్స్న వెళ్లిపోతుంటే కార్తీక్ చూస్తాడు. బయటకు వెళ్తాడు. జ్యోత్స్న కారుకి ఎదురుగా సైకిల్ విసురుతాడు. జ్యోత్స్న కారు ఆపితే వెళ్లి జ్యోత్న్సని బయటకు లాగుతాడు.

కార్తీక్: నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చావ్. డేంజర్ కంటే డేంజర్ నువ్వు. పురుగుల మందుని పిల్లలకు దూరంగా ఉంచండి అని రాసుంటుంది. నువ్వు అయితే పిల్లలకే కాదు పెద్దలకు కూడా దూరంగా ఉంచాలి. 
జ్యోత్స్న:  నా గురించి ఇంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నావ్ బావ.
కార్తీక్: మనిద్దరం కలిసి పెరిగాం  అని ఫ్రెండ్‌గా అనుకుంటే ఇంటి పరువు బజారున పెట్టావ్. నా టిఫెన్ బండి కాల్చావ్. నా కూతురి అనారోగ్యంతో నా భార్య మాంగల్యం రేటు కట్టావ్ నీ లాంటి దానికి ఎంత దూరం అంటే అంత మంచిది. 
జ్యోత్స్న: నేను నిన్ను ప్రేమిస్తున్నా బావ  నువ్వు నాకు కావాలి. నీ కోసం నా ఆస్తి మొత్తం రాసిస్తా బావ.
కార్తీక్: అది మీ తాత వింటే నా ఆస్తి ఎవరికి రాసిస్తావ్ అని రోడ్డు మీద తిప్పి కొడతాడు. 
జ్యోత్స్న: పుట్టినప్పటి నుంచి నేను నీ కోసం కలలు కంటున్నా నిన్ను వదలను బావ. నాకు నువ్వే కావాలి.
కార్తీక్: పెళ్లి అయిన మగాడి వెనక పడే ఆడదాన్ని బజారు దానిలా చూస్తారు. నువ్వు నన్ను టార్చర్ చేయకు జ్యోత్స్న.
జ్యోత్స్న: జ్యోత్స్న పుట్టింది కార్తీక్ కోసమే నేను బతికినా చచ్చినా నీ కోసమే.
కార్తీక్: దయచేసి నువ్వు నా ఫ్యామిలీ జోలికి రావొద్దు. ఎన్ని తప్పులు చేసినా నిన్ను క్షమిస్తున్నాను అంటే తల్లి లాంటి నా అత్తని చూసి మాత్రమే. కొట్టే అంత వరకు తెచ్చుకోకు.

దీపని రెస్ట్ తీసుకోమని అనసూయ చెప్పినా దీప వినదు. ఇక ఇంతలో కార్తీక్ ఇంటికి వస్తాడు. శాంతి హోమం చేయించాలని మొక్కుకున్నానని రేపే చేయిద్దామని కాంచన అంటుంది. దాంతో కార్తీక్ సరే అంటాడు. కావాల్సిన వాళ్లందరినీ హోమానికి పిలవమని కార్తీక్ దీపతో చెప్తాడు. అందరూ వెళ్లిన తర్వాత కాంచన ఏడుస్తుంది. అనసూయ ఏమైందని అడిగితే నా పుట్టిళ్లు గుర్తొచ్చిందని రెండిళ్లలో ఏం జరిగినా పుట్టింటి వాళ్లు బట్టలు పెట్టడం అనవాయితీగా ఉందని రేపు నాకు నా కొడుకుకి బట్టలు పెట్టడానికి నా పుట్టింటి వాళ్లు రారు కదా అని ఏడుస్తుంది. దీప ఆ మాటలు వింటుంది. అనసూయ  ఓదార్చుతుంది. 

జ్యోత్స్న శౌర్య ఆపరేషన్‌కి ఎవరు డబ్బు ఇచ్చారా అని తల్లి మీద అనుమానంతో నగలు తాకట్టు పెట్టి ఇచ్చిందేమో అని నగలు చెక్ చేస్తుంది. నగలు అక్కడే ఉండటంతో తల్లి కాదని అనుకుంటుంది. సుమిత్ర వచ్చి నేను డబ్బు ఇవ్వలేదు జ్యోత్స్న అంటుంది. ఈ ఇంట్రస్ట్ బిజినెస్ మీద పెడితే బెటర్ అంటుంది. ఇక దీప పిలుపు చేయడానికి జ్యోత్స్న ఇంటికి వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: బాలకి ప్రమాదం.. ప్రాణాలకు తెగించి కాపాడిన త్రిపుర.. గాయత్రీ మీద నింద!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 21st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి విహారి ఉద్యోగం ఇస్తాడా! క్రిష్ స్కూల్‌ కోసం పెద్ద గొడవ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి విహారి ఉద్యోగం ఇస్తాడా! క్రిష్ స్కూల్‌ కోసం పెద్ద గొడవ!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 21th:రాధపై హత్యాయత్నం చేసిన చిట్టినేనని తెలుసుకున్న విక్కీ...నిలదీసిన విక్కీకి సుందరి ఏం చెప్పింది...?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసిన చిట్టినేనని తెలుసుకున్న విక్కీ...నిలదీసిన విక్కీకి సుందరి ఏం చెప్పింది...?
Podarillu Serial Today August 21th:దుర్గాప్రసాద్‌ బారీ నుంచి తండ్రిని కాపాడుకున్న కొడుకులు...అన్నదమ్ములకు తెలిసిన నిజం ఏంటి..?
పొదరిల్లు:దుర్గాప్రసాద్‌ బారీ నుంచి తండ్రిని కాపాడుకున్న కొడుకులు...అన్నదమ్ములకు తెలిసిన నిజం ఏంటి..?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Embed widget