అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today February 2nd: సీతే రాముడి కట్నం సీరియల్: మహాలక్ష్మికి కౌంటర్లతో చెక్ పెట్టిన సీత.. పాపం రామ్ బుక్కైపోయాడుగా!

Seethe Ramudi Katnam Serial Today Episode: సూర్య, మధులు క్లోజ్‌గా ఉండటం చూసి మళ్లీ వాళ్లని విడగొట్టేలా సూర్యవదిన మాట్లాడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారంది.

Seethe Ramudi Katnam Today Episode: డోర్ ఎందుకు తీయలేదు అని మహాలక్ష్మి సీతను అడిగితే సేల్స్ వాళ్లు అనుకొని తీయలేదు అని సీత వెటకారంగా సమాధానం చెప్తుంది. సీత తన మాటలతో మహా వాళల్ని విసిగిస్తుంది. ఇక మహా అయితే అరగంట నన్ను కావాలనే బయట ఉంచావని సీతని తిట్టి నువ్వేం చేస్తున్నావ్ అని రామ్‌ని అడుగుతుంది. ఇద్దరం కలిసి భోజనం చేశామని సీత చెప్తుంది. 

మహాభర్త: మహాను బయట వెయిట్ చేయించి చాలా పెద్ద తప్పు చేశావ్.
గిరిధర్: వదిన ఇప్పటి వరకు దేని కోసం వెయిట్ చేయలేదు.. మొదటి సారి నువ్వు వెయిట్ చేయించావ్..
చలపతి: ఇంతకీ మీరు సీతని పొగిడారా.. తిట్టారా..
మహాలక్ష్మి: భార్య మోజులో పడి బయట ఏం జరుగుతుందో నీకు తెలీకుండా పోతుంది రామ్.. ఈ సీత మాయలో పడి కన్నతల్లిలాంటి నన్ను కష్టపెట్టావ్..  అరగంట సేపు బయట నిల్చొని నా కాళ్లు.. బెల్ కొట్టి కొట్టి నా చేతులు నొప్పులు పుట్టాయ్..
రామ్: సారీ పిన్ని.. మీరు వచ్చారు అని తెలియక జరిగిన పొరపాటు ఇది. 
మహాలక్ష్మి: ఇంకోసారి ఇలా జరిగితే నేను సహించను రామ్. అలా చేసింది సీత అయినా నువ్వు అయినా క్షమించను.

సీత: అత్తయ్య నిల్చొని నిల్చొని మీ కాళ్లు నొప్పులు పుట్టాయా ఆ నొప్పులు పోయేలా మీ కాళ్లు పట్టనా.. అంటూ వంగి.. వద్దులే అత్తయ్య మళ్లీ మీ ఒంటి మీద చేయి వేశాను అని ఫీలవుతారు.
మహాలక్ష్మి: ఏంటే నాతోనే వెటకారం అడుతున్నావా.. 
సీత: అయ్యో లేదు అత్తయ్య పెళ్లికి ముందు నా చేయి మీ చెంపను జస్ట్ అలా తాకినందుకే నా మీద పగ పెంచుకున్నారు కదా.. అది గుర్తొచ్చి ఆగిపోయాను. 
మహాలక్ష్మి: ఆ ఒక్క తప్పు వల్ల నీ జీవితం తలకిందుల కాబోతుంది. నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ముందు ముందు నువ్వే చూస్తావ్..
సీత: మీరు ఎప్పుడో చూపించడం కాదు అత్తయ్య నేను ఇప్పుడే మీకు చుక్కలు చూపిస్తున్నాను. మొదటి సారి బెల్ మోగినప్పుడే వచ్చింది మీరు అని నాకు తెలుసు. 
మహాలక్ష్మి: అంటే నిజంగానే కావాలని చేశావా.. ఎందుకే ఎందుకు నన్ను అరగంట సేపు బయట నిల్చొపెట్టావ్ ఎందుకు..
సీత: అరగంట బయట నిల్చొపెట్టినందుకే మీకు ఇంత బాధగా ఉంటే నన్ను ఒకరోజు అంతా బయట నిల్చొపెట్టారు. అది కూడా వర్షంలో.. అప్పుడు నేను ఎంత ఫీలయ్యానో తెలుసా.. ఇందాక మామని నా బుట్టలో వేసుకున్నాను అన్నారు. అంటే మీరు కూడా మామయ్యను మీ బుట్టలో వేసుకున్నారా అత్తయ్య.
మహాలక్ష్మి: హద్దులు దాటి మాట్లాడుతున్నావ్.. 
సీత: నా సహనపు హద్దులను ముందు చెరిపేసింది మీరే అత్తయ్య. మీరు మంచిగా నేను మంచిగానే ఉన్నాను. మీద నటన అని తెలిశాక నేను నటించడం మొదలు పెట్టాను. మీరు నాకు ఏదైతే చేస్తారో మీకు నేను అదే చేస్తాను.. 
మహాలక్ష్మి: సీత వెళ్లిపోయిన తర్వాత.. నా గురించి తెలీక నాతో పెట్టుకుంటున్నావ్.. అతి త్వరలోనే నిన్ను ఈ ఇంటి నుంచి గెంటేసి మీ అక్క మధుమితను నా కోడలిగా తెచ్చుకుంటాను. 

సూర్య: మధు నీకో గుడ్ న్యూస్. నేను ఇప్పుడే ఓ ఇంటర్వ్యూకి వెళ్లి వస్తున్నాను. గ్యారెంటీగా జాబ్ వస్తుంది. 
మధు: నిజమా సూర్య..
సూర్య: ఇక మన కష్టాలు తీరిపోయినట్లే మధు. నెలనెల జీతం వస్తుంది. ఖర్చులకోసం అన్నయ్య వదినల దగ్గర చేయి చాచాల్సిన అవసరం లేదు. నేను జాబ్‌లో జాయిన్‌ అవ్వగానే శాలరీ అడ్వాన్స్‌గా తీసుకుంటా.. వేరే ఇళ్లు తీసుకుందాం. అన్నయ్య వదినలకు ఇంకా ఎంత కాలం భారం అవుతామ్. 
మధు: అవును సూర్య ఇప్పటికే వాళ్లకు మనం చాలా భారం అయ్యాం. ఇంకా ఇబ్బంది పెట్టకూడదు. 
సూర్య: జాబ్ రాలేదు అన్న బాధలో నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను సారీ మధు. 
సూర్యవదిన: చాటుగా మొత్తం విని.. ఇద్దరూ కలిసి హ్యాపీగా ఉంటారా.. మీరు సంతోషంగా ఉండకూడదు అని గొడవలు పడి విడిపోవాలి అని మహాలక్ష్మి మేడమ్ చెప్పింది. మిమల్ని ఎలా ఆనందంగా ఉండనిస్తాను. ఫోన్‌ వచ్చినట్లు కావాలనే.. ఏంటి మీరు మాట్లాడేది.. దయచేసి ఇంకోసారి అలా మాట్లాడొద్దు. అవును పేపర్‌లో ఆ ఫొటో పడింది. అది మా తోడు కోడలు మధుమిత, వాళ్ల చెల్లెలు భర్త రామ్‌తో కలిసి ఉన్న ఫొటోనే అయితే ఏంటి అంట. ఆ ఫొటో గురించి మాట్లాడొడ్డు. మీకు అసలు విషయం తెలుసా మధుమిత మా మరిది సూర్యను పెళ్లి చేసుకోవడానికి మందు మధు ఆ రామ్‌నే పెళ్లి చేసుకోవల్సింది. కానీ ఆ పెళ్లి జరగలేదు. అది అనుకోకుండా తీసిన ఫొటో అండి.. అంత మాత్రానా రామ్‌కు మధుకు ఎఫైర్ పెట్టేస్తారు. అవును సూర్య కంటే రామ్ అన్నివిధాలుగా గొప్పొడు.. అంత మాత్రానా మధుమిత సూర్యని వదిలేసి రామ్ దగ్గరకు వెళ్లిపోతుందా. ఏం మాట్లాడుతున్నారు మీరు ఇలాంటి మాటలు చెప్పడానికే అయితే మళ్లీ ఫొన్ చేయకండి.. 
మధు: ఎవరో ఫోన్‌లో తప్పుగా మాట్లాడుతున్నారు నువ్వు ఆ మాటలు పట్టించుకోకు సూర్య. 
సూర్య: ఎంత మర్చిపోదాం అనుకున్నా ఎవరో ఒకరు పదే పదే గుర్తు చేస్తున్నారు మధు. ఆ ఫొటో బాగా స్ప్రెడ్ అయింది. అందరూ దాని గురించే మాట్లాడుతున్నారు ఎదురు పడితే అడుగుతున్నారు. ఏం చెప్పాలి. నువ్వు ఇంట్లోనే ఉంటావ్ నీకు ఏం కాదు. కానీ నేను బయట తిరుగుతున్నాను. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. 
సూర్యవదిన: మధు అందరూ నువ్వు అనవసరంగా సూర్యను పెళ్లి చేసుకున్నావు. రామ్‌ని పెళ్లి చేసుకొని ఉంటే బాగుండు అంటున్నారు. నువ్వు ఆ ఇంటి కోడలివి అయి ఉంటే బాగుండేది. ఏం చేస్తాం నీకు ఆ అదృష్టం లేదు అనుకోవాలి అంతే..

మహాలక్ష్మి ఇంట్లో అందరూ భోజనాలకు కూర్చొంటారు. ఎందుకు ఇంకా తినడం లేదు అని సీత అడిగితే మహా వచ్చే వరకు తినమని అందరూ అంటారు. కానీ సీత నాకు ఆకలి వేస్తుంది నేను తినేస్తా అంటుంది. రామ్ వద్దని సైగ చేసినా పట్టించుకోకుండా వడ్డించుకొని తినేస్తుంది. ఇక ఉష పిన్ని వచ్చే వరకు ఆగలేవా అని అడుగుతుంది. ఇంతలో మహా వస్తుంది. ఇంటిలో అందర్ని నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను అని మహా అంటుంది దీంతో ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తవుతుంది.  

Also Read: సత్యభామ సీరియల్ ఫిబ్రవరి 1st: రేపే మాధవ్, సత్యల నిశ్చితార్థం.. రెస్టారెంట్‌లో క్రిష్‌ రివాల్వర్ పేల్చిన కాళీ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget