Seethe Ramudi Katnam Serial Today February 21st : 'సీతే రాముడి కట్నం' సీరియల్: కన్నకొడుకుతో తలకొరివి పెట్టించండని కన్నీరు పెట్టించేసిన సీత..!
Seethe Ramudi Katnam Today Episode విద్యాదేవి శవం తాకొద్దని మహాలక్ష్మీ సీతని దూరం పెట్టడం రామ్ మామతో తలకొరివి పెట్టించండి అని సీత ఏడ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode విద్యాదేవిని శివకృష్ణ నిన్ను పొడిచింది ఎవరమ్మా అంటే విద్యాదేవి సీత అని చెప్పబోయి కన్ను మూస్తుంది. అందరూ డాక్టర్‌ని పిలిస్తే డాక్టర్ వచ్చి విద్యాదేవి చనిపోయిందని చెప్తారు. సుమతి సుమతి అని లలిత, శివకృష్ణ ఏడుస్తారు. సీతే తనని చంపాలని చూసిందని చెప్పి మరీ సుమతి చనిపోయిందని మహాలక్ష్మీ అంటుంది. దాంతో శివకృష్ణ మహాలక్ష్మీ గొంతు పట్టుకొని ఓసేయ్ రాక్షసి నువ్వే నా చెల్లిని చంపేశావే నీకు బతికే అర్హత లేదు అని మహాలక్ష్మీ గొంతు పట్టి నలిపేస్తాడు.
జనార్థన్: ఆగు శివకృష్ణ ఒకసారి నువ్వు నా సుమతిని చంపేశావు. ఇప్పుడు నీ కూతురు విద్యాని చంపేసింది. మీరు మమల్ని బతకనివ్వరా. మీరు అసలు మనుషులా క్రూర మృగాలా.
శివ: ఆ మాట అడగాల్సింది నేను. మహాలక్ష్మీ మాయలో నీ కళ్లు మూసుకుపోయావి. అన్యాయంగా నా చెల్లిని పొట్టనపెట్టుకున్నారు. నా కూతురిని దోషిని చేశారు. మనిషి రూపంలో ఉన్న మృగాలు మీరయ్యా.
రామ్: చాలు మామయ్య. ఇంతకు మించి ఇంకొక్క మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. ఆయన్ను బయటకు తీసుకెళ్లండి అత్తయ్య.
శివ: నువ్వు కూడా నిజాలు తెలుసుకోవడం లేదు రామ్. అంతా ఈ మహాలక్ష్మీ ఆడుతున్న నాటకం.
రామ్: అత్తయ్య ప్లీజ్ తనని బయటకు తీసుకెళ్లండి. జనార్థన్: విద్యా.. విద్యా..
మహాలక్ష్మీ: సుమతి చచ్చింది పోతూ సీత పేరు చెప్పింది నా కొడుకు సేఫ్ వాడికి ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పాలి.
సీత: నాన్న ఏమైంది అత్తమ్మకి ఎలా ఉంది మీతో మాట్లాడిందా.. అమ్మా
లలిత: అంతా అయిపోయింది సీత సుమతి వెళ్లిపోయింది.
సీత: అత్తమ్మా అని సీత కుప్పుకూలిపోయి చాలా ఏడుస్తుంది. జనార్థన్, లలిత అందరూ వెక్కి వెక్కి ఏడుస్తారు. నేను అత్తమ్మని చూడాలి నాన్న నేను అత్తమ్మ చూడాలి.
లలిత: నువ్వు చూడటానికి మీ అత్తమ్మ లేదే నీ పేరే తలచుకుంటూ చనిపోయింది.
సీత: అత్తమ్మ నా పేరు తలచుకుందా..
శివ: తనని పొడిచింది నువ్వు కాదు అని చెప్పడానికి ప్రయత్నించి నీ పేరు పలికి చనిపోయింది.
లలిత: చనిపోతూ కూడా నీ కోసం తాపత్రయం పడింది. నిన్ను చూడాలని అనుకుంది. నిన్ను చూడకుండా వెళ్లిపోయింది.
శివ: ఈ చేతులతో పెంచుకున్న నా చెల్లి ఎన్నో జీవితం ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఇలా మిగిలిపోయింది. మన అందరితో బంధం తెంచుకొని తను ఎవరో తన వాళ్లకి తెలీకుండా వెళ్లిపోయింది. అయిన వాళ్ల మధ్య అనామకురాలుగా మిగిలిపోయింది.
లలిత: మొన్న ఫోన్ చేసినప్పుడు కూడా తన గురించి తెలీకుండానే చనిపోతా అని భయపడింది ఇప్పుడు అదే జరిగింది.
సీత: అందరి ముందు చనిపోతూ నా పేరు చెప్పింది అంటే నేను నేరస్తురాలిగా మిగిలిపోతానేమో నాన్న. అత్తమ్మని చంపిన దానిలా నా మీద ముద్ర పడుతుంది ఏమో నాన్న. ఒక్క సారి లోపలికి వెళ్లి అత్తమ్మని చూసొస్తా నాన్న.
పెద్ద గొడవ అయిందని లలిత సీతని వెళ్లొద్దని చెప్తుంది. సుమతి శవం ఇంటికి తీసుకొస్తారు. ఆరు బయట శవం పెట్టి ఫొటో పెట్టి దీపం వెలిగిస్తారు. అందరూ సీతే చంపిందని అందరూ మాట్లాడుకుంటారు. సీత అత్తమ్మా అని విద్యాదేవి శవం దగ్గరకు వెళ్లబోతే మహాలక్ష్మీ అడ్డుకుంటుంది.. తనని తాకే అర్హత నీకు లేదని జనార్థన్ అంటాడు. అర్చన, గిరిలు కూడా తలో మాట అంటారు. నేను హంతకురాలు కాదని సీత చాలా ఏడుస్తుంది. తన నా మేనత్త అని ఏడుస్తుంది. ఇంతలో పంతులు వచ్చి సూర్యస్తమయం అవ్వకుండా కార్యక్రమం చూడాలి ఆమెకు కొడుకు ఉన్నారా అంటే ఎవరూ లేరని మహాలక్ష్మీ అంటుంది. దాంతో సీత ఏడుస్తూ పెద్దగా అరుస్తూ ఆమె సుమతి అత్తమ్మ తనకు కొడుకు కూతురు ఉన్నారు.. బతికున్నప్పుడు నమ్మలేదు కనీసం చనిపోయినప్పుడైనా నమ్మండి అని ఏడుస్తుంది. ఆవిడ కన్న కొడుకు రామ్‌తో తల కొరివి పెట్టిస్తే ఆవిడ ఆత్మకు శాంతి కలుగుతుందని అంటుంది. డ్రామాలు మొదలు పెట్టావా సీత అని మహాలక్ష్మీ అంటుంది. తనే సుమతి అనడానికి ఆధారాలు ఏంటి అని అర్చన అడుగుతుంది.
లలిత: నిరూపించడానికి ఆధారాలు లేవు కానీ తనే సుమతి నమ్మండి అన్నయ్యా.
జనార్థన్: సుమతి ఎప్పుడో చనిపోయింది అమ్మా. విద్యా కూడా నా భార్యే తన అంతిమ సంస్కారాలు నేనే చేస్తా.
సీత: చేయండి మామయ్య పుణ్య స్త్రీగా అత్తమ్మకి గౌరవం దొరుకుతుంది. అలాగే రామ్ మామతో తలకొరివి పెట్టించండి. అత్తమ్మ ఆఖరి కోరిక తీరుతుంది. తను ఎవరో మీకు తెలియాలి అని అత్తమ్మ చివరి వరకు ప్రయత్నించింది.
రామ్: ప్లీజ్ సీత ఇలాంటి టైంలో ఆవిడ మా అమ్మ అని చెప్పి నీ మీద ఉన్న కొంత నమ్మకం కూడా పొగొట్టుకోకు.
గిరి: మీరు ఎంత ప్రయత్నించినా నీకు శిక్ష పడుతుంది.
సీత: కావాలి అంటే నన్ను ఉరి తీయండి కానీ ఆవిడ సుమతి అత్తమ్మ అని నమ్మండి ఆవిడకి కొడుకుతో తల కొరివి పెట్టించండి. ఇన్నాళ్లు సొంత ఇంట్లోనే పరాయిదానిలా బతికింది. కనీసం తన అంతిమ క్రియలు అయినా సొంత కొడుకుతో చేయించండి.
ఇంతలో ఓ కానిస్టేబుల్ వచ్చి విద్యాదేవి గురించి ఎంక్వైరీ చేశామని తను ఎవరో తెలిసిందని వీడియో చూపిస్తాడు. అందరూ వీడియో చూస్తారు. సుమతి రామ్‌ని కాపాడటం.. తర్వాత రామ్ హాస్పిటల్‌లో జాయిన్ చేయడం.. సుమతి ముఖం మారిపోయి విద్యాదేవిగా మారడం అన్నీ ఆ వీడియోలో ఉంటాయి. అందరూ షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఇంట్లో వరసగా అపశకునాలు.. లక్ష్మీ ఆందోళన నిజం అవుతుందా!!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

