హెల్త్ బెనిఫిట్స్

యాలకులను నానబెట్టి ఆ నీటిని తాగితే కలిగే లాభాలివే

Published by: Geddam Vijaya Madhuri

వంటింట్లో దొరికే మసాలాలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఇస్తాయి. వాటిలో యాలకులు కూడా ఒకటి.

వీటిని రోజూ రాత్రి నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చట.

కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలను ఇది దూరం చేస్తుంది. తీసుకున్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయడంలో హెల్ప్ చేస్తుంది.

దగ్గు, జలుబు సమస్యలను సహజంగా తగ్గిస్తుంది. దీనిలోని యాంటీఇన్​ఫ్లమేటరీ లక్షణాలు మెరుగైన శ్వాసను అందిస్తాయి.

యాలకుల్లోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు నోటిలోని బ్యాక్టిరియాను చంపేస్తాయి. ఫ్రెష్ బ్రీత్ ఇస్తాయి.

అంతేకాకుండా యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు చిగుళ్ల సమస్యలను తగ్గించడంతో పాటు దూరం చేయడంలో కూడా హెల్ప్ చేస్తాయి.

బీపిని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. రోజూ ఈ నీటిని తాగితే రక్తపోటు అదుపులోకి వస్తుంది.

యాంటీఆక్సిడెంట్లు పెరిగి.. శరీరాన్ని ఫ్రీరాడికల్స్ నుంచి రక్షించడంలో హెల్ప్ చేస్తాయి.

బరువు తగ్గడంలో కూడా ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. మెటబాలీజం పెంచి.. కేలరీలు బర్న్ చేస్తుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.