Seethe Ramudi Katnam Serial Today February 20th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: ఇదేం ట్విస్ట్‌రా బాబు.. సీతే పొడిచిందని చెప్పిన విద్యాదేవి.. సీత జీవితం జైలు పాలేనా!
Seethe Ramudi Katnam Today Episode విద్యాదేవిని చంపేయమని మహాలక్ష్మీ గౌతమ్‌ని పెంచిన డాక్టర్‌కి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode సీతే విద్యాదేవిని పొడిచేసిందని అందరూ నిందిస్తారు. సీత హాస్పిటల్‌కి రావడంతో మహాలక్ష్మీ, జనార్థన్ అందరూ సీతని వెళ్లిపోమని అంటారు. రామ్ కూడా సీతని వెళ్లిపోమని అంటాడు. సీత ఎంత బతిమాలినా వినకుండా మహాలక్ష్మీ సీత చేయి పట్టుకొని లాక్కొని బయటకు తీసుకెళ్లి తోసేస్తుంది. బయటే వెయిట్ చేయమని ఐసీయూ దగ్గరకు వస్తే మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇచ్చి మహాలక్ష్మీ వెళ్లిపోతుంది.
మహాలక్ష్మీని గౌతమ్‌ని పెంచిన డాక్టర్ చూసి మాట్లాడుతుంది. మహా నువ్వు ఏంటి ఇక్కడ అంటే మహాలక్ష్మీ ఆమెతో తన భర్త రెండో భార్యని గౌతమ్ పొడిచేశాడని సగం చంపి వదిలేశాడని ఇప్పుడు ఆమెను నువ్వే చంపేయాలని అంటుంది. డాక్టర్ తప్పుతుందా అని సరే అంటుంది. ఇక మహాలక్ష్మీకి గౌతమ్ కాల్ చేస్తాడు. సుమతి చనిపోలేదని సుమతి బతికితే మన ఇద్దరి పని అయిపోతుందని మహాలక్ష్మీ కొడుకుతో చెప్తుంది. దాంతో గౌతమ్ హాస్పిటల్‌కి వచ్చి చంపమంటావా అంటే వద్దురా బాబు అని మహాలక్ష్మీ చెప్తుంది. నువ్వే ఫోన్ చేసి అప్ డేట్ ఇస్తుండని చెప్పి గౌతమ్ ఫోన్ కట్ చేస్తాడు. సుమతితో పాటు సీతని చంపేసుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేదని అనుకుంటాడు. ఇక మహాలక్ష్మీ ఎలా అయినా సుమతిని చంపేయాలని అనుకుంటుంది.
సీత బయట కూర్చొని ఏడుస్తుంటే శివకృష్ణ, లలితలు హాస్పిటల్‌కి వస్తారు. బయట ఉన్న సీతని చూసి షాక్ అయిపోతారు. సీత దగ్గరకు వెళ్తే సీత తండ్రిని పట్టుకొని ఏడుస్తుంది. సీత తండ్రితో జరిగింది చెప్తుంది.
సీత: అత్తమ్మని చంపింది నేనే అంటున్నారు. చూడటానికి కూడా రానివ్వడం లేదు. రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాను నాన్న.
శివకృష్ణ: వాళ్లు మనుషులా కాదా. మేనత్తని సీత ఎందుకు చంపుతుంది.
లలిత: తను అందరి దృష్టిలో విద్యాదేవి కదండీ సుమతి అని మనం నిరూపించలేకపోయాం కదా.
సీత: అత్తమ్మ లేస్తేనే నిజం తెలుస్తుంది నాన్న.
శివకృష్ణ: పద సీత వెళ్తాం.
సీత: మీరు వెళ్లండి నాన్న నేను వస్తే మళ్లీ తిడతారు.
శివకృష్ణ: నేను ఉండగా నిన్ను తిట్టేది ఎవరు సీత రా నేను చూసుకుంటా. ఒక్కోక్కర్ని సెల్‌లో వేసి తోలు తీస్తా. విద్యాదేవికి ఎలా ఉంది బావ.
జనార్థన్: సీత చేసిన పనికి చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతుంది.
శివకృష్ణ: సీత కత్తితో పొడవటం చూశారా.. కత్తి తీయడం చూశారా.
జనార్థన్: సీతే విద్యాదేవిని పొడిచింది తనని ఏం చేయాలో అర్థం లేదు.
శివకృష్ణ: రామ్ నువ్వు కూడా నమ్ముతున్నావా. అయినా సీత నేరస్తురాలో కాదో చెప్పాల్సింది మీరు కాదు విద్యాదేవి.
మహాలక్ష్మీ: విద్యాదేవి నోరు మూయించాలనే సీత ఇలా చేయించింది.
శివకృష్ణ: తప్పుగా మాట్లాడొద్దు మహాలక్ష్మీ గారు విద్యాదేవి కాదు తను సుమతి. సీతకి మేనత్త, రామ్‌కి స్వయానా తల్లి.
శివకృష్ణ, మహాలక్ష్మీతో గొడవ పడతాడు. సీత ఏడుస్తుంటుంది. ఇంతలో విద్యాదేవికి మెలకువ వస్తుంది. గమనించిన నర్సు బయటకు వెళ్లి శివకృష్ణ వాళ్లతో చెప్తుంది. అందరూ వెళ్తారు. మహాలక్ష్మీ చాలా టెన్షన్ పడుతుంది. శివకృష్ణ విద్యాదేవితో చెల్లమ్మా నీకే ఎందుకు ఇలా అవుతుందని కష్టాలు నీకే వస్తున్నాయి. సీతే నిన్ను చంపాలని అనుకుందని నిందలు వేస్తున్నారు. నువ్వే నిజం చెప్పాలమ్మా అంటాడు. నీ మీద హత్యాప్రయత్నం చేసింది ఎవరు అని జనార్థన్ అడిగితే సీత కాదని విద్యాదేవి చెప్తుంది. మరి ఎవరు అని అడిగితే విద్యాదేవి సీత సీత అని చెప్పి సుమతి కన్ను మూస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

