Seethe Ramudi Katnam Serial Today February 19th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: కిరాతంగా విద్యాదేవిని కత్తితో పొడచిన గౌతమ్.. సీతే పొడిచిందంటోన్న ఫ్యామిలీ!
Seethe Ramudi Katnam Today Episode విద్యాదేవిని గౌతమ్ పొడిచేయడం సీత చేతిలో కత్తి ఉండటంతో అందరూ సీతే చంపాలనుకుందని సీత మీద నింద వేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode విద్యాదేవికి నిజం తెలిసిపోవడంతో మహాలక్ష్మీ తనని చంపమని కొడుకు గౌతమ్‌కి చెప్తాడు. గౌతమ్ పుష్ప సినిమాలోజాతర సీన్ వేషం వేసుకొని విద్యాదేవి వెంట పడతాడు. విద్యాదేవి పరుగెడుతూ తన ఇంటికి చేరుకుంటుంది. గౌతమ్ వెంటే పరుగులు తీస్తాడు. సీత హాయిగా పడుకుంటుంది. గౌతమ్ టీచర్ వెంటే ఇంటికి వచ్చేస్తాడు. తలుపు దగ్గర విద్యాదేవి ఎంత అడ్డుకోవాలని ప్రయత్నించినా డోర్ తీసి వచ్చేస్తాడు.
విద్యాదేవి కింద పడి పూల కుండీ తోసేసినా సీత లేవదు. ఓ మూలకు వెళ్లి విద్యాదేవి దాక్కుంటే గౌతమ్ చూసేస్తాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో విద్యాదేవిని పొడిచేస్తాడు. సీతకి శబ్దాలు వినిపించి లేచి బయటకు వస్తుంది. సీత బయట బాల్యానీలో చూస్తే అమ్మవారి ఊరేగింపు అవుతుంది. ఈ లోపు గౌతమ్ ఇంటిలోపల విద్యాదేవిని పొడిచేస్తాడు. సీత అని విద్యాదేవి అరుస్తుంది. అమ్మమ్మ వాయిస్ అని సీత పరుగులు తీస్తుంది. అప్పటికే గౌతమ్ విద్యాదేవిని ఇష్టం వచ్చినట్లు పొడిచేసి పారిపోతాడు.
మరోవైపు రామ్ వాళ్లు, మహాలక్ష్మీ అందరి అప్పుడే ఇంటికి చేరుకుంటారు. అందరూ ఇంటి లోపలికి వెళ్తారు. సీత కింద హాల్‌లో కత్తిపోట్లతో పడి ఉన్న సుమతిని చూసి షాక్ అయిపోయి అత్తమ్మా అని పరుగులు తీస్తుంది. విద్యాదేవిని ఒడిలోకి తీసుకొని ఏమైంది అత్తమ్మా అని ఏడుస్తుంది. ఎవరు పొడిచారు అత్తమ్మా అని అడుగుతుంది. విద్యాదేవి చెప్పబోతుంది కానీ చెప్పలేదు. ఇంతలో సీత కత్తి చూసి బయటకు తీస్తుంది. అదేం టైంలో రామ్, జనార్థన్, మహా అందరూ వచ్చి విద్యాదేవిని ఆ పరిస్థితిలో చూసి షాక్ అయిపోతారు. విద్యాదేవి దగ్గరకు పరుగులు తీస్తారు. విద్యాదేవి అందరినీ చూస్తుంది కానీ మాట్లాడలేదు. ఏం చెప్పకుండానే కళ్లు మూస్తుంది. సీత, జనార్థన్ గట్టిగా ఏడుస్తారు.
మహాలక్ష్మీ సీత చేతిలో కత్తి చూసి పొడిచావా సీత విద్యాదేవిని చంపేశావా నీ పగ తీర్చుకున్నావా.. నీ కడుపు మంట తగ్గిపోయిందా అని రివర్స్ అయిపోతుంది. నేను అత్తమ్మని చంపడం ఏంటి అని సీత బిత్తరపోతుంది. ఇంట్లో మేం ఎవరూ లేని టైం చూసి నువ్వే ఆవిడని పొడిచి హత్య చేశావని అంటుంది. సీత ఎందుకు అలా చేస్తుందని రామ్ అడిగితే ఈ మధ్య ఇద్దరికీ పడటం లేదు కదా ప్రతీ దానికి విద్యాదేవి సీతని కొడుతుందని సీత చంపేసిందని అంటుంది. అర్చన, గిరిలు సీతే చంపింది అని తిడతారు. జనార్థన్ ఏడుస్తూ సీత ఇంత దారుణంగా తనని ఎందుకు పొట్టన పెట్టుకున్నావ్ అని ఏడుస్తాడు. నేనే ఏం చేయలేదు మామయ్య అత్తమ్మ అరుపు వినిపించి కిందకి వచ్చి చూస్తే అత్తమ్మ కడుపులో కత్తి కనిపించి అత్తమ్మ పడిపోయిందని చెప్తుంది. మహాలక్ష్మీ మాత్రం సీత చెప్పింది మాత్రం అబద్ధం అని అంటుంది. పోలీసులకు ఫోన్ చేయమని జనార్థన్‌తో చెప్తుంది. రామ్ టీచర్ నాడి చూసి ఇంకా చనిపోలేదని హాస్పిటల్‌కి తీసుకెళ్దామని అంటుంది. కొంపమునిగిందని మహాలక్ష్మీ అనుకుంటుంది. సీతని హాస్పిటల్‌కి రావొద్దని చెప్పి వెళ్లిపోతుంది. సీత ఇంట్లోనే ఏడుస్తుంది.
మరోవైపు శివకృష్ణ ఇంట్లో ఉన్న సుమతి ఫొటో కింద పడిపోతుంది. శివకృష్ణ, లలితలు చూసి కంగారు పడతారు. లలిత అపశకునంలా ఉందని అంటుంది. ఏం కాదని శివకృష్ణ లలితకు ధైర్యం చెప్పి తీసుకెళ్తాడు. విద్యాదేవిని హాస్పిటల్‌లో చేర్పిస్తారు. ట్రీట్మెంట్ జరుగుతుంటుంది. సీత కూడా హాస్పిటల్‌కి వస్తుంది. జనార్థన్ సీతని ఆపేస్తాడు. రావొద్దంటే ఎందుకు వచ్చావ్ అని కోప్పడతాడు. నాకు దీనికి ఏం సంబంధం లేదు నన్ను నమ్మండి అని సీతఅంటుంది. రామ్‌ని కూడా నమ్మమని అంటే రామ్ కూడా సీతని వెళ్లిపోమని అంటాడు. నువ్వు కూడా నమ్మడం లేదా మామ అని ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఇంట్లో వరసగా అపశకునాలు.. లక్ష్మీ ఆందోళన నిజం అవుతుందా!!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

