Seethe Ramudi Katnam Serial Today February 16th: సీతే రాముడి కట్నం సీరియల్: మహా ఎదురుగానే సీతకు ప్రపోజ్ చేసిన రామ్.. అత్తకి వార్నింగ్ ఇచ్చిన కోడలు!
Seethe Ramudi Katnam Serial Today Episode తాను మహాతో ఛాలెంజ్ చేసినట్లు సీత రామ్‌తో ఐలవ్‌యూ చెప్పించుకోవడంతో ఇవాళ్టి ఎసిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Today Episode రామ్ చేత సీతకు ఐలవ్‌యూ చెప్పించండి అని భజరంగ్‌దళ్ కార్యకర్తలు మహాలక్ష్మికి చెప్తారు. ప్రేమికుల రోజు కానుక ఇప్పించమని చెప్తారు. దీంతో మహాలక్ష్మి అలాంటి చెండాలమైన పని నేనే కాదు ఈ ఇంట్లో ఎవరూ ఒప్పుకోరు అని అంటుంది. ఇళ్లు అనుకున్నారా పార్క్ అనుకున్నారా అని రామ్ తండ్రి ప్రశ్నిస్తాడు.
అర్చన: ఇది పద్ధతి గల కుటుంబం ఇలాంటివన్నీ ఇక్కడ కుదరవు.
గిరిధర్: మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లకపోతే పోలీసుల్ని పిలుస్తాం.
భజరంగ్: మీరు పోలీసుల్ని పిలిస్తే మేం మీడియాను పిలుస్తాం. లైవ్ టెలికాస్ట్ చేసి మీ పరువు తీస్తాం.
రామ్: నేను సీతకి ఐలవ్‌యూ చెప్పాలి అంతే కదా.. దానికి ఎందుకు ఇంత పెద్ద సీన్ చేస్తున్నారు.
సీత: మీరు నాకు ఐలవ్యూ చెప్పడం మీ పిన్నికి ఇష్టం లేదు కదండి.
రామ్: అదేం లేదు. మా పిన్నిని నువ్వు అపార్థం చేసుకుంటున్నావ్.
సీత: ఆ మాట మీ పిన్నినే చెప్పమని అనండి. మీరు నాకు ఐలవ్యూ చెప్పాలని మీ పిన్నికి చెప్పమని చెప్పండి.
రామ్: పిన్ని చెప్పు పిన్ని..
సీత: మా అత్తయ్య చెప్పదు కానీ మీరు మీడియాను పిలవండి.
మహాలక్ష్మి: అవసరం లేదు. ఒకే రామ్ సీతకి ఐలవ్యూ చెప్పు.
రామ్ సీతకు పువ్వు ఇచ్చి ఐలవ్యూ చెప్తే చలపతి బెలూన్లు వేస్తాడు. మహా వాళ్లు రగిలిపోతారు. ఇక రేవతి సీతకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వమని చెప్తుంది. దీంతో రామ్ తన చేతికి ఉన్న రింగ్ తీసి సీత చేతికి పెడతాడు.
రేవతి: ప్రేమికుల రోజున ఇద్దరు ప్రేమికులు ఒక్కటయ్యారు.
చలపతి: బొమ్మ అదిరి పోయింది అనుకున్న దానికంటే పెద్ద హిట్ అయింది. మహాలక్ష్మి బెలూన్లు తన్నేసి సీరియస్‌గా వెళ్లిపోతుంది.
మరోవైపు మధు తల్లిదండ్రులు బయటకు వెళ్తారు. మధు తల్లి మధు ఎదురు పడితే బాగున్ను అనుకుంటుంది. మరోవైపు రామూర్తి, అతని భార్య ఏడుస్తూ వస్తారు. శివకృష్ణ ఆపి ఏమైంది అని అడిగితే కూతురు ప్రేమ పెళ్లి చేసుకుంది అని తనని అప్పటి నుంచి దూరం పెట్టామని దీంతో ఆ అమ్మాయి చనిపోయింది అని అల్లుడు ఫోన్ చేశాడని చివరి చూపు చూసుకుందామని వెళ్తున్నాం అని చెప్తారు. దీంతో కూతురు బతికినన్నాళ్లు దూరం పెట్టి కూతురు లేదని తెలిసి ఏడుస్తున్నారు అని మధు తల్లి శివకు చెప్తుంది. దీంతో శివ ఆలోచినలో పడతాడు. మధు మనకి శాశ్వతంగా దూరం అయితే అని అది తలచుకోవడానికే భయం వేస్తుంది అని ఏడుస్తుంది. ఒక్కసారి మధుని చూద్దాం అని అడుగుతుంది. దీంతో శివ ఓకే అంటాడు.
సీత: నేనే గెలిచాను కదా అత్తయ్య. ప్రేమికుల రోజుని నేను మామ సెలబ్రేట్ చేసుకున్నాం.
మహాలక్ష్మి: ముందుంది ముసళ్ల పండుగ. ఇది పల్లెటూరిది అనుకున్నా సిటీలో జరిగినవి దీనికి ఎలా తెలుసు..
సీత: పల్లెటూరి దానికి ఇవన్నీ ఎలా తెలుసు అనుకుంటున్నారా.. టీవీలో చూడటం లేదా ఏంటి.. ఇక మా జోలికి వస్తే బాగోదు అని అత్తని వార్నింగ్ ఇస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.