Seethe Ramudi Katnam Serial Today December 5th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహాలక్ష్మీకి గన్ గురి పెట్టిన విద్యాదేవి.. సీత గెలిచింది నేను ఓడిపోయానని ఒప్పుకున్న మహా!
Seethe Ramudi Katnam Today Episode ముఖర్జీ బిజినెస్ విషయంలో మహాలక్ష్మీని తిట్టడం సీత గెలిచిందని మహాలక్ష్మీ ఒప్పుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Serial Today Episode ఉష పెళ్లి అయిపోవడంతో అర్చన ఏడుస్తుంది. మహాలక్ష్మీ అర్చన దగ్గరకు వెళ్తుంది. నా కూతురి జీవితం అన్యాయం చేసేశావని అర్చన అంటే దానికి మహాలక్ష్మీ నీ కూతురికి అంత కంటే మంచి సంబంధం తేగలవా.. వాళ్ల ఇంటి గుమ్మం తొక్కడానికి అయినా మీ బతుకు సరిపోతుందా. ఏదో అదృష్టం కొద్ది ఉషని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు దానికి సంతోషించక ఇలా అంటావా అని మహాలక్ష్మీ అంటుంది.
అర్చన: ఇదే నీ కూతురు అయితే ఇలా చేస్తావా మహా. నిన్ను నమ్మినందుకు ఇంత మోసం చేస్తావా.
మహాలక్ష్మీ: ఇందులో మోసం ఏముంది. ఒకప్పుడు ప్రీతికి రాకేశ్తో పెళ్లి చేయాలని నన్ను ప్రోత్సహించింది నువ్వే. అప్పుడు నువ్వు చేసింది కరెక్ట్ అయితే ఇప్పుడు నేను చేసింది కరెక్టే చెల్లుకు చెల్లని సరిపెట్టుకో.
అర్చన: రాకేశ్ మారకపోతే ఏం చేయాలి మహా.
మహాలక్ష్మీ: రాకేశ్ ఉష విషయంలో తప్పు చేస్తే తాట తీస్తా నువ్వు ఈ విషయం వదిలే మనిద్దరం ఒకటిగా లేకపోతే ఆ సీత చెలరేగిపోతుంది.
అర్చన: సరే మహా రాకేశ్ విషయంలో నువ్వు మాటిస్తున్నావ్ కాబట్టి కాంప్రమైజ్ అవుతున్నా రేపు వాడేం చేసినా నీదే బాధ్యత.
సీత: షభాష్ అత్తలు మీరిద్దరూ ఎక్కడ కొట్టుకొని విడిపోతారో అని ఫీలయ్యా కానీ వంకర బుద్ధులు ఉన్న మీరు కలిసిపోవడం చాలా సంతోషంగా ఉంది. ఆవిడ సవతి కూతురి జీవితం పణంగా పెడితే మీరు సొంత కూతురి జీవితమే నాశనం చేశారు. చీరలు బిజినెస్ అని అన్నారు. ముందు అది చూడండి మీరు ఓడిపోతే తార్ మార్ తక్కర్ మార్.
మహాలక్ష్మీ: మనం ఆ చీరలు అమ్మి సీతని ఇంటి నుంచి గెంటేయాలి అర్చన.
అర్చన: చీరల బాధ్యత నాది నా కూతురి బాధ్యత నీది.
ఇక మహాలక్ష్మీ, అర్చనలు మిడిల్ క్లాస్‌లా రెడీ అయి చీరలు ముందు వేసుకొని కూర్చొంటారు. ఇక ఇద్దరూ తోటికోడళ్లు చీరలమ్మా చీరలు రండి త్వరపడండి అని అంటారు. దాంతో చాలా మంది అక్కడికి వచ్చి చీరలు కొంటారు. ఇక అటుగా పోలీస్ త్రిలోక్ విద్యాదేవిని కోర్టుకు తీసుకెళ్తూ మహాలక్ష్మీని చూసి ఆగి చీరల వ్యాపారం బాగుంది కదా అంటాడు. ఇక విద్యాదేవి మహాలక్ష్మీతో మాట్లాడుతా అని అంటుంది. ఏంటీ ఈ దురదృష్టం మహాలక్ష్మీ నువ్వేంటి రోడ్డున పడ్డావ్ అంటుంది. దానికి మహాలక్ష్మీ ఇది నా దురదృష్టం కాదు సీతతో వేసిన పందెం అని చెప్తుంది. సీఐ విద్యాదేవిని మహాలక్ష్మీ చెప్పినట్లు వినమని అంటాడు. దానికి విద్యాదేవి అంత అవసరం లేదుని అంటుంది. ఇక మహాలక్ష్మీ నా కాళ్లు పట్టుకో నిన్ను వదిలేస్తా అంటే విద్యాదేవి సీఐ గన్ తీసుకొని అంత అవసరం వస్తే ఆమెను కాల్చేస్తా అంటుంది. సీత నా వెంట ఉండగా మీరేం చేయలేరని విద్యాదేవి అంటుంది.
మరోవైపు సీతకి తల్లిదండ్రులు కాల్ చేస్తే సీత లిఫ్ట్ చేయదు. ఇక రామ్‌కి కాల్ చేస్తే రామ్ సీత, మహాలక్ష్మీల పందెం గురించి చెప్తాడు. ఇంతలో సీత వచ్చి రామ్‌ని హగ్ చేసుకుంటుంది. ఓడిపోతే నన్ను వదిలి వెళ్లిపోతావ్ కదా సీత అంటే నేను ఎక్కడికీ వెళ్లను పందెంలో నేనే గెలుస్తానని సీత అంటుంది. రామ్‌కి ఒట్టు కూడా వేస్తుంది. ఇక ముఖర్జీ మహాలక్ష్మీతో మీటింగ్ పెట్టి అన్నీ దొంగ లెక్కలు చూపించారు.. ఫ్రాడ్ చేశారని సీత వల్ల విషయం తెలిసిందని అంటాడు. మహాలక్ష్మీ మీద ఫుల్ సీరియస్ అవుతాడు. ఇక ఇంట్లో అందరూ రేపు పందెం ముగిస్తుందని అందరూ ఎవరు గెలుస్తారా అని అనుకుంటారు. ఇక మహాలక్ష్మీ ఇంటికి వచ్చి సీత నెగ్గింది నేను ఓడిపోయానని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.