Seethe Ramudi Katnam Serial Today December 26th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహాలక్ష్మీని కుట్ర సాక్ష్యాలతో పట్టేసిన జనార్థన్, సుమతిలు - కోడలికే సపోర్ట్!
Seethe Ramudi Katnam Today Episode సీత తన షాప్‌ని మహాలక్ష్మీ కావాలనే మూయించేసిందని సుమతి, జనార్థన్ నిరూపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Serial Today Episode తన నోరు నొక్కేసినందుకు సీత విద్యాదేవిని ప్రశ్నిస్తుంది. దాంతో విద్యాదేవి దేవుడే అంతా చూసుకుంటాడు. నువ్వు రామ్ సంతోషంగా కలిసి ఉండటమే నాకు కావాలి అని అంటుంది. మాట అంటే మా గురించి అంటున్నారు మా విషయంలో మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అత్తమ్మ అని అడుగుతుంది.
విద్యాదేవి దీపం ఆరిపోయిన విషయం చెప్పకుండా దాపరికం ఏం లేదు నా కొడుకు కోడలు సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక అని చెప్తుంది. సీత అత్తమ్మని హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. ఇక ఉదయం సీత, విద్యాదేవి ఇద్దరూ చీరలు అమ్మతుంటారు. నాతో ఎందుకు వచ్చారు అత్తమ్మ అంత పెద్ద కంపెనీలకు అధికారిణి అయిన మీరు ఇలా నాతో బండిలో బట్టలు అమ్మడానికి రావడం ఏంటి అని అడుగుతుంది. దాంతో విద్యాదేవి మనసుకి నచ్చిన పని సంతృప్తి ఇస్తుందని అంటుంది. ఇక విద్యాదేవి, జనార్థన్‌ల ఫ్లెక్సీ ఫొటోలు ఉండటం అర్చన, మహాలక్ష్మీ చూసి కోపంతో రగిలిపోతారు. ఇద్దరూ ఆ ఫొటో గురించి మాట్లాడుకోవడం సీత చూసి అత్తకి చెప్తుంది.
ఇక కస్టమర్లు విద్యాదేవితో ఆ ఫొటోలో ఉన్నది మీరే కదా అని అడుగుతారు. మీ జంట బాగుంది మీరు మీ ఆయన చూడముచ్చటగా ఉన్నారని పొగుడుతారు. వాళ్లు మీకు ఏం అవుతారు అని కస్టమర్లు సీతని అడిగితే నేనేం మాట్లాడను అని మహాలక్ష్మీ వాళ్లు వినేలా సీత చెప్తుంది. సీత వెటకారం చేస్తుందని ఇన్‌డైరెక్ట్‌గా సుమతి అక్క గురించి మాట్లాడుతుందని అంటుంది. దానికి మహాలక్ష్మీ ఇంటికి వెళ్లి దాని సంగతి చెప్తా అని అంటుంది. ఇద్దరూ వెళ్లిపోతారు. మహాలక్ష్మీని ఎందుకు రెచ్చగొట్టావని సీతని టీచర్ అడుగుతుంది. దానికి సీత కచ్చితంగా గొడవ పెడుతుంది ఈలోపు మీరు ఒక పని చేయాలని తన ఐడియా సీత టీచర్‌కి చెప్తుంది. మహాలక్ష్మీ ఇంటికి వెళ్లి సీత పరువు తీస్తుందని అంటారు. ఇంతలో సీత వస్తుంది. ఇద్దరూ చీరలు అమ్ముతున్నారు విద్యాదేవి, జనార్థన్ల ఫొటో పట్టి పబ్లిసిటీ చేస్తుందని మాట తప్పిందని చెప్తుంది మహాలక్ష్మీ.
ఫ్లెక్సీని తగలబెట్టమని మహాలక్ష్మీ అంటే అందులో తప్పేముంది చీరల బిజినెస్‌కే కదా యాడ్ చేసింది అని రామ్ సపోర్ట్ చేస్తాడు. ఇక సీత మహాలక్ష్మీ తన షాప్‌ని కావాలనే తీయించేలా చేసింది అత్తమ్మ మామయ్య వస్తే అసలు విషయం తెలుస్తుందని అంటుంది. ఇంతలో టీచర్, జనార్థన్‌లు ఓ వ్యక్తిని తీసుకొస్తారు. ఫోటోలో తన కూడా ఉన్నందుకు నా వల్ల ఇబ్బంది కాకుండా ఉండాలని టీచర్‌తో కలిసి ఎంక్వైరీకి వెళ్లాలని చెప్తాడు. ఇక ఆధికారి మహాలక్ష్మీ గారే డబ్బు ఇచ్చి షాప్ కూలగొట్టించారని ఆయన చెప్పి వెళ్లిపోతారు. ఎందుకలా చేశావ్ అని జనా మహాలక్ష్మీని అడుగుతాడు. కోడలు పరువు పోకూడదనే ఇలా చేసిందని అర్చన అంటుంది. రామ్ కూడా ఈ వీధుల్లో తిరిగి అమ్మొద్దని అంటాడు. ఇక సీత సుమతి అత్తమ్మ పేరు పెడతా అంటుంది. అందరూ ఓకే చెప్తారు. మహాలక్ష్మీ కోపంగా వెళ్లిపోతుంది. ఇక సీత రామ్‌ని హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్తుంది. రేపటి నుంచి షాప్ తీస్తానని సీత అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: ఆ గదిలో నయని దేహం - అమ్మవారి సాక్షిగా పెద్ద రిస్క్, ఒక శరీరాన్ని అలా మరొకటి ఇలా!