Seethe Ramudi Katnam Serial August 8th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: అత్తాకోడళ్ల ఛాలెంజ్ అదుర్స్.. సీతని మహా కోడలిగా ఒప్పుకుంటుందా.. సీత రామ్‌ని వదిలేస్తుందా!
Seethe Ramudi Katnam Serial Today Episode నెల రోజుల్లో మహా తనని కోడలిగా ఒప్పుకోకపోతే రామ్‌ని శాశ్వతంగా వదిలేసి వెళ్లిపోతానని సీత అత్తతో ఛాలెంజ్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మితో జలజ మాట్లాడటం మధుమిత వినేస్తుంది. జలజ మధుని చూసి షాక్ అయిపోతుంది. నేను ఫోన్‌లో మాట్లాడినది దొంగ చాటుగా వినడానికి సిగ్గులేదా అని జలజ మధుని అంటే మధు తోటికోడల్ని ఒక్కటిస్తుంది. నన్నే కొడతావా అని జలజ అడిగితే నా జీవితాన్ని నాశనం చేసినందుకు ఒకటి అని మరో చెంప వాయించి నా చెల్లి జీవితం నాశనం అవ్వాలి అని కోరుకున్నందుకు రెండో దెబ్బ కొట్టానని అంటుంది.
జలజ: తోడి కోడల్ని వయసులో పెద్దదాన్ని అని చూడకుండా నన్ను పదే పదే కొడతావా మా ఆయన రాని నీ పని చెప్తా.
మధు: చెప్పు నువ్వు ఇంకా మహాలక్ష్మీ గారితో టచ్‌లో ఉన్నావని చెప్తాను.
ఇంతలో జలజ భర్త వచ్చి మధుతో మళ్లీ గొడవ పడుతున్నావా అని అడుగుతాడు. మధు తనని కొట్టిందని జలజ చెప్పబోతే మధు వంట చేయడం గురించి మాట్లాడుకుంటున్నామని అంటుంది. ఇక జలజతో మధు ఇక ముందు నా ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుందని అంటుంది. ఇంకోసారి తన, తన చెల్లి జోలికి వస్తే గొంతు పిసికి చంపేస్తానని వార్నింగ్ ఇస్తుంది. జలజ షాక్ అయిపోతుంది.
మహాలక్ష్మి, అర్చనలు తమ భర్తలతో కలిసి కూర్చొని కాఫీ తాగుతూ సీత లేకపోవడం వల్ల ఇళ్లంతా చాలా సంతోషంగా ఉందని అనుకుంటారు. రేవతి, చలపతిలు వచ్చి సీత లేకపోవడం ఇళ్లంతా సందడి పోయిందని అంటుంది. రెండు బ్యాచ్‌లు మాటలతో కొట్టుకుంటారు. ఇంతలో రామ్ అక్కడికి వస్తాడు. రామ్ డల్‌గా ఉంటే సీత లేకపోవడం వల్ల రామ్ డల్‌గా ఉన్నాడని సీతని మిస్ అవుతున్నాడని రేవతి, చలపతిలు అంటారు. రామ్‌ని సీత ఊరు వెళ్లమని అంటారు. మహాలక్ష్మీ వెళ్లొద్దని అంటుంది. పెద్దగా పాట వినిపిస్తుంది. పొద్దుపొద్దున్న ఇలా మైక్‌లో ఎవరు అరుస్తున్నారని అనుకుంటారు. సాంబని పిలిచి అడిగితే పక్కింటి నుంచి సౌండ్ వస్తుందని చెప్తాడు. ఎవరో చూద్దామని మహాలక్ష్మి వాళ్లు బయటకు వెళ్తారు. అక్కడ సీత ముగ్గు వేస్తూ గట్టిగా పాట పాడుతూ ఉంటుంది. మహా వాళ్లు సీతని చూసి షాక్ అయిపోతారు. నువ్వు ఏంటి ఇక్కడున్నావని అడిగితే పక్కిళ్లు నెల రోజుల పాటు అద్దెకి తీసుకున్నానని చెప్తుంది.
మీ ఊరిలో ఉండకుండా ఇక్కడ ఉండటం ఏంటని అర్చన అడిగితే ఇక్కడైతే మామని చూసుకోవచ్చని అంటుంది. అసలు నీకు ఇల్లు అద్దెకి ఇచ్చారని సీత అడిగితే ఇంటి ఓనర్లు వచ్చి మీ ఇంట్లో ఉండే అమ్మాయి కాబట్టి పైగా మా ఆవిడ చీరలు కుడతానని చెప్పడంతో అద్దెకు ఇచ్చామని అంటారు. ఇక మహా సీతని పంపేయమని ఒంటరి ఆడపిల్లకి సిటీలో చాలా ఇబ్బందులు వస్తాయని తన సేఫ్టీ ఆలోచించి సీతని పంపేయమని అంటారు. రామ్ సీతని వెళ్లిపోమని చెప్తే తాను ఒంటరిగా లేను అని సీత చెప్తుంది. తనతో పాటు మరో ఇద్దరు ఉన్నారని సీత చెప్పడంతో సీత తల్లిదండ్రులు ఎంట్రీ ఇస్తారు. వాళ్లని చూసి రామ్ సంతోషిస్తాడు. నెల రోజులు సీతకు తోడుగా ఆ ఇంట్లోనే ఉంటామని చెప్తారు. మహాలక్ష్మీ కోపంతో వెళ్లిపోతుంది. ఇక లలిత భర్తతో మనం సీతతో ఇక్కడ ఉండటం కరెక్టేనా అంటే శివకృష్ణ మనం మన కూతురికి సపోర్ట్ చేస్తున్నామని మహాలక్ష్మి లాంటి దానికి సీతే కరెక్ట్ అని సీత నెలరోజులు మహాకు సినిమా చూపిస్తుందని అంటాడు.
సీత మహాని అత్త అత్త అని పిలిస్తే మహాలక్ష్మీ తనని పదే పదే అత్త అని పిలవొద్దని అంటుంది. ఇక ఇద్దరూ మధ్య మాట మాట పెరిగి ఇద్దరూ ఛాలెంజ్ చేసుకుంటారు. నెల రోజుల్లో తనని కోడలు అని ఒప్పుకునేలా చేస్తానని మీ నోటితో మీరే సీత నా కోడలు అని అనేలా చేస్తానని సీత అంటుంది. దానికి మహాలక్ష్మి నిన్ను నా కోడలిగా ఒప్పుకోక పోతే శాశ్వతంగా రామ్‌ని వదిలేసి వెళ్లిపోమని అంటుంది. సీత అత్తతో పోటీకి సిద్ధమవుతుంది. మహాలక్ష్మీ వెళ్లిపోగానే విద్యాదేవి సీతకి కాల్ చేస్తుంది. విద్యాదేవి మాటలు మహాలక్ష్మి వింటుంది. బాల్యానీ నుంచి మొత్తం విన్నానని విద్యాదేవి చెప్తుంది. మీ అత్తని బాగా ఆడుకుంటున్నావని అస్సలు తగ్గొద్దని రెచ్చిపోమని అంటుంది. ఇంతలో రామ్ సీత దగ్గరకు రావడంతో సీత ఫోన్ పెట్టేస్తానని అంటే ఎవరు వచ్చారా అని విద్యాదేవి అంటుంది. దాంతో రామ్ వస్తున్నాడని సీత చెప్తుంది. విద్యాదేవి రామ్ నీ దగ్గరకు వస్తున్నాడా అని అంటే మహాలక్ష్మి వినేస్తుంది. మహాలక్ష్మి కోపంతో రగిలిపోతుంది. రామ్ తాను చెప్పినా వినకుండా సీత దగ్గరకు వెళ్లడంతో ఆపడానికి బయటకు వెళ్తుంది.
సీత, రామ్‌లు ఇద్దరూ మాట్లాడుకుంటారు. సీత, రామ్‌లు ఇద్దరూ ముద్దు పెట్టుకోబోతే మహాలక్ష్మి రామ్ అని పెద్దగా పిలుస్తుంది. అది చూసి సీత, రామ్‌లు చెట్టు మీద పిట్టల్ని తోలేలా ఉష్ ఉష్ అని అరుస్తారు. మహాలక్ష్మి కోపంతో రామ్‌ని తీసుకొని లోపలికి వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.