Seethe Ramudi Katnam Serial Today April 6th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: అన్న మీద ప్రేమ సెంటిమెంట్ పిండేసిన సుమతి, ప్రాణ స్నేహితురాలే మహాలక్ష్మి అంట.. రెచ్చిపోయిన శివకృష్ణ!
Seethe Ramudi Katnam Serial Today Episode మధుమిత కండీషన్‌ను సీత తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Today Episode సీత ఫోన్‌లో మహాలక్ష్మిని తిడుతుంది. తన వల్లే మధుమితకి ఈ పరిస్థితి వచ్చిందని అంటుంది. రామ్ ఫోన్ లాక్కొని సీత పిచ్చిదానిలా మాట్లాడుతుంది అని పట్టించుకోవద్దని చెప్తాడు. ఇక సీత రామ్‌ని నిలదీస్తుంది. రామ్ సీతని ఊరుకోమని మధుకి ఏంకాదు అని అంటాడు. ఇక చలపతి, రేవతిలు ఇంటికి రాగానే సాంబ హాస్పిటల్‌కి తీసుకెళ్లారని చెప్తాడు. చలపతి రామ్‌కి కాల్ చేసి మధు పరిస్థితి తెలుసుకుంటారు.
మరోవైపు సీత తన తండ్రి శివకృష్ణకు కాల్ చేసి మధుమిత సూసైడ్ చేసుకుందని చెప్తుంది. శివకృష్ణ కంగారు పడతాడు. తన అక్క చావు బతుకుల మధ్య ఉంది అని తనని తన తల్లిని తొందరగా హాస్పిటల్‌కి రమ్మని చెప్తుంది. ఇక శివకృష్ణ మధుమిత నిద్రమాత్రలు మింగేసింది అని చావు బతుకుల మధ్య ఉందని చెప్తాడు. అందరూ షాక్ అవుతారు.
శివకృష్ణ: ఫొటో పగిలినప్పుడే నా మనసు కీడు శంకించింది అమ్మ. అందుకే ఆ బాధతో వెళ్లిపోయాను. నువ్వు నన్ను కశాయి తండ్రి, అన్న అనుకుంటున్నావు. కానీ నాకు వాళ్లిద్దరూ ఇష్టమే. కాకపోతే మీలా చూపించలేను అంతే.. అని లలిత, శివకృష్ణ హాస్పిటల్‌కి బయల్దేరుతారు.
శివతల్లి: చూశావా సుమతి ఇన్ని రోజులు మీ అన్న నువ్వు అంటే ఇష్టం అని చెప్తున్నాడు. మధు ప్రాణాల మీదకు రావడంతో పరుగులు తీశాడు. నిన్ను అలాగే క్షమిస్తాడు. నువ్వు ఎక్కడున్నా ఒక్కసారి ఇంటికి రామ్మా. నిన్ను క్షమిస్తాడు.
మరోవైపు ఆశ్రమంలో ఉన్న సుమతి తన అన్న మాటలు తలచుకొని బాధ పడుతుంది. నర్స్ వస్తే తనకు తన అన్న గుర్తొచ్చాడు అని తన అన్న గురించి చెప్తుంది.
ఫ్లాష్ బ్యాక్!
అందరూ తిందామని సుమతి తల్లి అంటే సుమితి వచ్చే వరకు ఎవరూ తినడానికి లేదుని శివకృష్ణ అంటాడు. సుమతి వచ్చి మొదటి ముద్ద తన చెల్లికి తినిపిస్తేనే తింటాను అంటాడు. ఇంతలో సుమతి వస్తుంది. ఇక శివకృష్ణ తన చెల్లికి మొదటి ముద్ద తినిపిస్తాడు. సుమతి కూడా తన అన్నకి మొదటి ముద్ద తినిపిస్తుంది. తన అన్న ఏం తెచ్చిన మొదటి తనకే ఇచ్చేవాడు. గోరింట పెట్టేవాడు అని కానీ ఎవరి దిష్టి తగిలో విడిపోయామని సుమతి బాధ పడుతుంది. దగ్గర కాలేని అంత దూరం అయిపోయామని సుమతి బాధ పడుతుంది.
ప్రస్తుతం
నర్స్: మీ అమ్మా, అన్నయ్యలు కాకుండా నీ జీవితంలో ముఖ్యమైన వాళ్లు ఎవరైనా ఉన్నారా..
సుమతి: ఉన్నారు నా ప్రాణ స్నేహితురాలు మహాలక్ష్మి. మా అన్నయ్య తర్వాత నాకు అంత ఇష్టమైనది తనే.
నర్స్: ఆవిడ ఎక్కడ ఉంది. ఎందుకు దూరం అయింది. గుర్తు లేదా..
శివకృష్ణ, లలిత హాస్పిటల్‌కి వెళ్తారు. మధుని చూసి ఏడుస్తారు. రామ్ వచ్చి మధు కోమాలోకి వెళ్లిందని అంటాడు. మధు కండీషన్ సీరియస్ అని చెప్తాడు. ఇక శివకృష్ణ అర్చన, గిరిధర్‌లను చూసి సీరియస్ అవుతాడు. మధు ఈ పరిస్థితికి కారణం మీరే అని అంటాడు. మహాలక్ష్మి గురించి నిలదీస్తాడు. మధుని ఏం చేయడానికి ఇక్కడికి తీసుకొస్తారో నాకు తెలుసు అని అందర్నీ జైలులో పెడతాను అని అంటాడు. దీంతో రామ్ మధుని చూడటానికి వచ్చారా మమల్ని తిట్టడానికి వచ్చారా అని అడుగుతాడు. ఇక లలిత తన భర్తని ఆపుతుంది. అర్చన గిరిధర్‌లు కూడా మాటా మాటా పెంచుతారు. అందర్ని రామ్ అపుతాడు. గొడవలు వద్దంటాడు.
మరోవైపు ఫ్లైట్‌కి టైం అయిందని బయల్దేరుదామని జనార్థన్ అంటే కాసేపు ఆగమని మహా అంటుంది. మధు స్ఫృహాలోకి వస్తుంది. ఇక మహా డాక్టర్‌కి కాల్ చేసి మధుకి స్ఫృహా వచ్చిందని చెప్పకుండా తాను చెప్పినట్లు చెప్పమని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.