Seethe Ramudi Katnam Serial Today April 15th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: 25 లక్షల చెక్ చింపేసిన రామ్.. మహాలక్ష్మీ, గౌతమ్‌లకు పెద్ద షాక్!
Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మీ పాతిక లక్షల చెక్ గౌతమ్‌కి ఇవ్వడం రామ్ అది చింపేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode గౌతమ్ ఇంటికి రాగానే అందరూ మిధున ఏం మాట్లాడింది అని అడుగుతారు. దానికి గౌతమ్ అందరితో మిధున నాతో చాలా ప్రేమగా మాట్లాడింది షేక్ హ్యాండ్, హగ్ ఇచ్చిందని పెళ్లి గురించి పుట్టబోయే పిల్లల గురించి మాట్లాడిందని అంటాడు. నా కోడలు నా గురించి ఏం చెప్పింది అని మహాలక్ష్మీ అడిగితే నువ్వు స్టైల్‌గా ఉంటావ్ మోడ్రన్ మహాలక్ష్మీ అని చెప్పిందని అంటాడు. ఇంకా ఏం చెప్పిందని మహాలక్ష్మీ అడిగితే గౌతమ్ మహాలక్ష్మీని పక్కకు తీసుకెళ్తాడు.
గౌతమ్ మహాలక్ష్మీతో మిధున నిశ్చితార్థానికి డైమండ్ నక్లెస్ అడిగిందని ఇప్పటికి ఇప్పుడు నాకు 25 లక్షలు అడుగుతుంది. అంత క్యాష్ నా దగ్గర లేదని మహాలక్ష్మీ చెప్తుంది. కంపెనీ అకౌంట్ నుంచి తీసివ్వమని మహాలక్ష్మీతో గౌతమ్ చెప్తాడు. మహాలక్ష్మీ సరే అని చెక్ రాసి తీసుకొస్తానని అంటుంది. గౌతమ్ వెళ్లగానే మహాలక్ష్మీ చెక్ రాసి కిందకి తీసుకెళ్తుంది. ఇంతలో రామ్ ఇంటికి వస్తాడు. గౌతమ్ రామ్‌తో గుడ్ న్యూస్ అని నేను మిధున కలిశాం అంటాడు. నాకు అది గుడ్ న్యూస్ ఎందుకు అని రామ్ గౌతమ్ మీద చిరాకు పడతాడు. ఇంతలో మహాలక్ష్మీ వస్తుంది. రామ్‌ని పలకరిస్తుంది. రేపు గౌతమ్ నిశ్చితార్థం అందరూ ఇంట్లోనే ఉండాలి అంటుంది.
రామ్ మహాలక్ష్మీ చేతిలో కాగితం చూసి ఏంటి అని అడుగుతాడు. రామ్ చూపించమని అడుగుతాడు. చెక్ అని మహాలక్ష్మీ చెప్తుంది. రామ్ చూసి పాతిక లక్షలు ఎవరికి ఇస్తున్నారు చెక్ మీద పేరు రాయలేదు అని అడుగుతాడు. నాకే అవసరం అని మహాలక్ష్మీ చెప్తుంది. నిశ్చితార్థం ఉంది కదా అంటుంది. వీడి నిశ్చితార్థానికి అంత ఎందుకు అని చలపతి అడుగుతాడు. సీతలా నిలదీస్తున్నావ్ ఏంటి అని అర్చన, గిరిలు అడుగుతారు. సీత దుబారా ఖర్చు అడ్డుకుంది అని రామ్ అంటాడు. మిధున డైమండ్ నెక్లెస్ అడిగింది అందుకే పిన్ని డబ్బులు ఇస్తుందని గౌతమ్ చెప్తాడు. ఆ నెక్లెస్ కోసమే చెక్ రాశావా అని అందరూ మహాలక్ష్మీని అడుగుతారు. గౌతమ్ అవును అని అంటాడు వేల కోట్ల ఉన్న అమ్మాయికి పాతిక లక్షల రూపాయల నెక్లెస్ ఇవ్వలేమా అని అంటాడు. దానికి రామ్ ఇవ్వడం కుదరదు అని చెక్ చింపేసి వెళ్లిపోతాడు.
మహాలక్ష్మీతో గౌతమ్ నీ సవతి కొడుకుకి అంత పొగరు ఏంటి అని అడుగుతాడు. దానికి అర్చన మనసులో ఏకైక వారసుడు అయిన రామ్ మీద వీడికి ఇంత చిన్న చూపు ఏంటి అనుకుంటుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదని మహాలక్ష్మీ అంటుంది. రామ్ ఇలా చేయడం వెనక ఏదో ఒక కారణం ఉంటుంది అది ఏంటో తెలుసుకోవాలని అనుకుంటారు. రామ్ బయటకు వెళ్లడంతో అర్చన, మహాలక్ష్మీ రామ్‌ని ఫాలో అవుతారు. రామ్ రేవతి ఇంటికి వెళ్తాడు. మహాలక్ష్మీ వాళ్లు కూడా ఫాలో అవుతారు.
రామ్ వాళ్లతో ఏం మాట్లాడుతారా అని చాటుగా వింటారు. సీతని రేవతి పిలిచి నీ కోసం రామ్ వచ్చాడని అంటుంది. డైమండ్ నెక్లెస్ పాతిక లక్షల గురించి చెప్పినందుకు థ్యాంక్స్ అని రామ్ అంటాడు. మహాలక్ష్మీ పిన్ని ఆ డబ్బు ఇవ్వకుండా ఆపానని అంటాడు. మహాలక్ష్మీ, అర్చనలు షాక్ అవుతారు. సీతతో కలిసి ఉండాలని ఉందని కానీ సీత మీద నింద తొలగిపోవాలని రామ్ అంటాడు. రామ్ రావడానికి ముందే మహాలక్ష్మీ వాళ్లు వెళ్లిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కొన ఊపిరితో కొట్టుకుంటున్న దశరథ్.. దీప వల్ల సుమిత్ర జీవితం అన్యాయం అయిపోతుందా!





















