అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today April 10th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సీత మెడ పట్టుకొని గెంటేసిన రామ్.. మహాకు 2 రోజుల గడువు!

Seethe Ramudi Katnam Today Episode సీతని రామ్ గదిలో నుంచి గెంటేయడంతో సీత మిధునలా రామ్‌ని రెచ్చగొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode అర్చన, మహాలక్ష్మీలు సీతతో గౌతమ్‌ గురించి మంచిగా ఎలా చెప్పించాలా అని ఆలోచిస్తూ ఉంటారు. సీత చాటుగా ఇద్దరు అత్తల మాటలు వింటుంది. మిమల్ని ఇంకా టెన్షన్ పెడతాను అనుకొని సీత మిధునలా మహాలక్ష్మీకి కాల్ చేస్తుంది. గౌతమ్ మంచోడు అని సీతతో ఎప్పుడు చెప్పిస్తారని అంటుంది. మహాలక్ష్మీ రెండు రోజులు టైం అడుగుతుంది. 

మిధున: నేను గౌతమ్ గురించి రకరకాలుగా వింటున్నా. వెంటనే మీరు సీతతో సర్టిఫికేట్ ఇప్పించకపోతే నా మనసు మారిపోతుంది. 
మహాలక్ష్మీ: అలా అనొద్దు మిధున రెండు రోజుల్లో సీతతో చెప్పిస్తా. నేనే నీకు కాల్ చేస్తాను ఉంటాను. ఇది వరకు మిధున కాల్ చేస్తే సంతోషంగా ఉండేది. ఇప్పుడు మిధున కాల్ చేస్తుంటే టెన్షన్ వచ్చేస్తుంది.
అర్చన: మరి అలాంటి కోడలు అవసరమా మహా.
మహాలక్ష్మీ: అవసరమే ఎలా అయినా సీతని ఒప్పించి సీతతో సర్టిఫికేట్ ఇప్పిస్తా. 
అర్చన: ఏమో మహా నువ్వు మాత్రం మిధున కోసం ఎన్నో మెట్లు దిగుతున్నావ్.
 మహాలక్ష్మీ: మిధున లాంటి కోడలి కోసం ఎంత దిగినా తక్కువ కాదు అర్చన. వన్స్ అది నా కోడలు అయితే చాలు. ఆ తర్వాత చక్రం నా చేతిలో ఉంటుంది. 
సీత: ఆ చక్రం ఎప్పటికీ మీ చేతికి రాదు అత్త మీ బలహీనతే నా బలం. సీత దెబ్బ  అంటే అబ్బ అనిపిస్తా. రామ్ గదిలో బెడ్ మీద దొర్లుతూ.. ఈ గది నాది ఈ గాలి నాది.. ఈ పరుపు నాది. 
రామ్: ఏయ్ సీత. నా రూంలోకి వచ్చావేంటి.
సీత: ఇది మన రూం మామ. మన పడకగది.
రామ్: నీ వేషాలు నా దగ్గర కాదు ఈ రకంగా దగ్గర అవ్వాలి అనుకుంటున్నావా. మన మధ్య చాలా దూరం ఉంది. 

సీత కావాలనే రామ్ మీద మీదకు వెళ్లి నేను ఇష్టం లేదా ప్రేమ లేదా అని అడుగుతుంది. మనల్ని కలుపుతా అని మీ పిన్ని తీసుకొచ్చింది. రామ్ సీతని బయటకు వెళ్లిపోమంటాడు. సీతని మెడ పట్టుకొని బయటకు గెంటేస్తాడు. ముఖం మీద డోర్ వేసేస్తాడు. నీతోనే నన్ను గదిలోకి రప్పించేలా చేస్తా అని అంటుంది. అందరూ భోజనాలు చేస్తుంటారు. అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. చలపతి సీత కిడ్నాప్ గురించి మాట్లాడుతుంటే అందరూ నోరు మూయిస్తారు. ఇప్పుడు ఆ విషయం అవసరం లేదు అని అంటారు.  

సీత తన గదిలోకి వెళ్లి మిధునలా రామ్‌కి కాల్ చేస్తుంది. ఈ టైంలో మిధున కాల్ చేస్తుంది ఏంటి అనుకుంటాడు. ఈ టైంలో ఎందుకు కాల్ చేశావ్ అని రామ్ అడిగితే నువ్వు గుర్తొచ్చి చేశానని అంటుంది. పెళ్లి చేసుకున్న సీతని దూరం పెట్టావ్.. పెళ్లి చేసుకుంటా అన్న నన్నూ దూరం పెట్టావ్ ఇంకా ఏం బాగుంటావ్‌లే అని మాట్లాడుతుంది. దానికి రామ్ నేను సోలోగా హ్యాపీగా ఉండగలను అంటాడు. నువ్వు ఓకే అంటే గౌతమ్‌తో పెళ్లి క్యాన్సిల్ చేసి నీతో పెళ్లికి రెడీ అవుతా అంటుంది. నాకు సీత చాలు అంటాడు. సీతకి నువ్వు అంటే ఇష్టంలేదని మిధున అంటుంది. నిజంగా సీతకి నువ్వు అంటే ఇష్టం ఉంటే ఫ్రూవ్ చేయ్ అంటుంది. దాంతో రామ్ ఇప్పుడే నిరూపిస్తా అని సీత గదిలోకి వెళ్తాడు. సీత పడుకున్నట్లు నటిస్తే వెళ్లి సీతని లేపుతాడు. సీతని తన గదిలోకి పిలుస్తాడు. డ్రామా చేశానని అలా నెట్టేస్తే ఎలా రియాక్ట్ అవుతావా అని యాక్ట్ చేశానని సీతతో చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: "అత్యాచారయత్నం కేసులో సీఎం అరెస్ట్.. పదవికి రాజీనామా"!

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today July 31st: నిండు మనసులు: ఏంటి గణ సిద్ధూ, ప్రేరణలకు అలా చెప్పాడా! సిద్ధూ బట్టల్లో ప్రేరణ చిందులు!
నిండు మనసులు: ఏంటి గణ సిద్ధూ, ప్రేరణలకు అలా చెప్పాడా! సిద్ధూ బట్టల్లో ప్రేరణ చిందులు!
Karthika Deepam 2 Serial Today July 31st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!
Illu Illalu Pillalu Serial Today July 31st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీమా కలిసిపోయారా! ఇంటి గుమ్మం దగ్గరే ఊహించని షాక్‌! చివరి సీన్‌ అదుర్స్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీమా కలిసిపోయారా! ఇంటి గుమ్మం దగ్గరే ఊహించని షాక్‌! చివరి సీన్‌ అదుర్స్!
Nuvvu leka Neanu Lenu Serial Today July 31th:రాధ గుడికి వెళ్దామంటే కుదరదన్న విక్కీ...చిట్టిని తీసుకుని రెస్టారెంట్‌కు వెళ్లడంతో రాధ ఏంచేసింది..?
నువ్వులేక నేను లేను: రాధ గుడికి వెళ్దామంటే కుదరదన్న విక్కీ...చిట్టిని తీసుకుని రెస్టారెంట్‌కు వెళ్లడంతో రాధ ఏంచేసింది..?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Priyanka Jain : ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Police Complaint OTT : నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget