Satyabhama Serials Today January 30th Episode: సత్యకు చీర పంపించిన క్రిష్.. మాధవ్‌కు నిజం చెప్పిన విశ్వనాథం!
Satyabhama Serials Today Episode క్రిష్ పంపిన చీర కట్టుకొని క్రిష్‌ని కలవడానికి సత్య రెస్టారెంట్‌కి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Today Episode: సత్యభామ షాపింగ్ మాల్‌లో ఇష్టపడిన చీరని తన అన్న ఇచ్చాడంటూ సత్యకు కాళీ తీసుకొని వచ్చి ఇస్తాడు. అందరి ముందు సత్య ఓపెన్ చేస్తుంది. చీరతో పాటు ఓ లెటర్ కూడా ఉంటుంది. ఆ లెటర్‌ని సంధ్య తీసుకుంటుంది.
సంధ్య: నాకు నిన్ను ఈ చీరలో చూడాలి అని ఉంది. ఈ రోజు సాయంత్రం ఈ చీర కట్టుకొని కేఫ్ మెరైన్‌కి వస్తే నీతో చాలా కబుర్లు చెప్పాలి.. ఓ ఈ గిప్ట్ బావగారు పంపించారా.. గుడ్ టేస్ట్.
హర్ష: సత్య ఫోన్ చేసి తనకి థ్యాంక్స్ చెప్పు.
సంధ్య: ఫోన్ ఎందుకురా అన్నయ్య సాయంత్రం రమ్మని సందేశం పంపారు కదా.. కబుర్లు చెప్పడానికి వెళ్తుంది కదా..
శాంతమ్మ: ఎక్కడికే వెళ్లేది. ఇంకా నిశ్చితార్థం కూడా కాలేదు. ఈ ఇచ్చిపుచ్చుకోడాలు. చేతులు పట్టుకొని తిరగడాలు లాంటివి నాకు ఇష్టం లేదు. సత్య వెళ్లడానికి వీళ్లదు.
విశ్వనాథం: మాధవ్ సత్యకు కాబోయే భర్తే కదా.. తనకి ఇష్టమైతే వెళ్లనిద్దామమ్మా.
సత్య: అన్నా అన్నా అన్నా ఎవడీ అన్న వాడి కోపానికి నాకు సంబంధం ఏంటి. కళ్ల ముందుకి రాకుండా ఈ నాటకాలు ఏంటి. పోనీలే అని నేను ఊరుకుంటే ఇంటి వరకు వచ్చారు. ఈ విషయం అమ్మానాన్నలకు తెలిస్తే ఇంకా ఏమైనా ఉందా.. వాళ్ల గుండె ఆగిపోతుంది. గొడవ వద్దని ఎంత రాజీ పడుతున్నా నన్ను రెచ్చగొడుతున్నారు. వాడు ఆగేలా లేడు. నన్ను ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేడు.
సత్య ఆలోచిస్తూ ఉంటే సంధ్య వచ్చి చీర తనమీద వేస్తుంది. సత్య కోపంతో ఆ చీరను విసిరేస్తుంది. సంధ్య మీద చిరాకు పడుతుంది. విశాలాక్షి కూడా అక్కడికి వస్తుంది. కొత్త చీరను ఎందుకు విసిరేశావని సత్యను అడుగుతుంది.
సంధ్య: నిజం చెప్పు నీకు బావగారు పంపించిన చీర నచ్చలేదా.. బావగారే నచ్చలేదా.. అక్క అలా బిహేవ్ చేస్తుంది అందుకే ఇలా అడిగా..
విశాలాక్షి: అది అలా వాగుతుంటే ఏం మాట్లాడవేంటి సత్య.
సత్య: సారీ సంధ్య ఏదో టెన్షన్‌లో అలా అనేశాను. వేరే చిరాకులో ఉండి అలా ప్రవర్తించాను సారీ సంధ్య. ఇదిగో చీర బావగారు ఇచ్చిన మొదటి గిఫ్ట్ జాగ్రత్తగా దాచుకో.
క్రిష్: బామ్మ నీ మనవరాలు నేను ఇచ్చిన గిఫ్ట్ తీసుకుంది అంట.
గంట: బామ్మ గంటకు ట్రాన్షలేషన్.. ఇంకా నీకు భార్య కాలేదు అప్పుడే నాకు మనవరాలు అయిపోయిందా అని అడుగుతున్నారయ్యా..
క్రిష్: అయి తీరుతుంది దాన్ని ఎవరూ మార్చలేరు. ఇప్పుడు నేను రెస్టారెంట్‌కి వెళ్లి మొదటి సారి తనతో మాట్లాడుతా..
మరోవైపు శైలు ఇంటికి వచ్చి క్రిష్‌తో మాట్లాడాలి అని బయటకు తీసుకెళ్లమని అడుగుతుంది. ఇక భైరవి, మహదేవయ్యలు క్రిష్‌ని బలవంతంగా పంపిస్తారు. ఇక ఈ విషయం గురించి ఇంట్లో వాళ్లకి చెప్పమని మైత్రి సత్యకు చెప్తుంది. కనీసం మాధవ్‌కి అయినా చెప్పమని అంటుంది. అవేమీ జరగవని సత్య అంటుంది.
మైత్రి: అసలు ఈ అన్న అనేవాడే ఉన్నాడా లేక ఈ చెంచా గాడే మధ్యలో ఉండి నాటకం ఆడుతున్నాడా.. ఆ వంక పెట్టుకొని నిన్ను రెగ్యులర్‌గా కలుస్తున్నాడు అంటావా..
సత్య: నన్ను వదిలేయ్ మని ఆ కాళీ గాడికి ఎవరో చెప్పారు. కాళీని అడ్డుపెట్టుకొని వాడు ఇప్పుడు ఆటలాడిస్తున్నాడు.
మైత్రి: ఎదురుపడొచ్చుకదా.
సత్య: హా.. దానికి ఈరోజు ముహూర్తం పెట్టుకున్నాడు కదా.. వాడి చెప్పిన ప్లేస్‌కి వెళ్తాను.
మైత్రి: ఏయ్ నువ్వు తెలివి ఉండే మాట్లాడుతున్నావా.. వాడు ఎవడో తెలీకుండా ఎలా వెళ్తావే..
సత్య: వాడితో ఈరోజు అటో ఇటో తేల్చుకుంటాను..
మరోవైపు సత్య ఆ రౌడీని కలుస్తాను అని బయల్దేరుతుంది. అయితే బామ్మ ఒప్పుకోదు. ఆ చీర కట్టుకొని వెళ్లమని చెప్తుంది. కుదరదు అని సత్య అంటే అయితే బయటకు వెళ్లకు అని సత్య తల్లి విశాలాక్షి చెప్పి తేల్చేస్తుంది. దీంతో సత్య సరే అని క్రిష్ పంపించిన ఆ చీర కట్టుకొని వస్తుంది. ఇక అందరూ ఆ చీరలో సత్యని పొగిడేస్తారు. ఇక మైత్రి తాను బయల్దేరితే హర్షని కూడా తీసుకొని వెళ్లమని ఇంట్లో వాళ్లు చెప్తారు. ఇక హర్ష కూడా వెళ్తాడు. మరోవైపు మాధవ్ సత్య కోసం గిఫ్ట్ కొని ఎలా అయినా ఇవ్వాలి అనుకుంటాడు. వెంటనే సత్య వాళ్ల నాన్నకి ఫోన్ చేస్తాడు. నీ దగ్గరకే బయల్దేరింది అని చెప్తాడు. మాధవ్ షాక్ అయిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.